Author: Editor's Desk, Tattva News

భారతదేశం,   చైనాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల 14వ రౌండ్‌లో హాట్ స్ప్రింగ్స్ నుండి వైదొలగడానికి ఎటువంటి పురోగతి కనబడలేదు. అయితే ఇరుపక్షాలు త్వరలో మళ్లీ కలవడానికి అంగీకరించాయి. ఒప్పందం కుదరనప్పటికీ చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇరుపక్షాలు గురువారం ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేస్తూ , తాము మునుపటి ఫలితాలను ఏకీకృతం చేస్తామని,  సన్నిహితంగా ఉంటామని పేర్కొన్నాయి.  అక్టోబర్‌లో ప్రతిష్టంభనతో ముగిసిన చివరి రౌండ్ చర్చల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఆ సమయంలో ఉమ్మడి ప్రకటన లేకపోగా,  పరిస్థితికి ఒకరినొకరు నిందించుకుంటూ ఇరుపక్షాలు స్వతంత్ర ప్రకటనలు ఇచ్చాయి.ఉమ్మడి ప్రకటనలో “ఉభయ పక్షాల రక్షణ, విదేశీ వ్యవహారాల  ప్రతినిధులు సమావేశంలో ఉన్నారు. వారు పశ్చిమ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వాస్తవిక రేఖ వెంట స్పష్టమైన,  లోతైన అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు” అని పేర్కొన్నారు..ఇరు పక్షాలు “చలికాలంతో…

Read More

రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం ఒమిక్రాన్ వ్యాపిస్తుందని తెలిపింది. 2022 తొలి వారంలో 70 లక్షల మందికి కరోనా సోకడాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంచనాలను లెక్కగట్టారు. ఐరోపా ఖండంలో ఇన్‌ఫెక్షన్ సోకిన వారి సంఖ్య రెండు వారాల్లో రెట్టింపైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ హన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కనీసం 50 శాతం మంది ప్రజలు అత్యధికంగా ఎనిమిది వారాల్లోపు ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉందని అమెరికా లోని సియాటెల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మ్యాట్రిక్స్ అండ్ ఇవల్యూషన్ అంచనా వేసినట్టు వెల్లడించారు. ఐరోపా, మధ్య ఆసియా దేశాలపై ఒమిక్రాన్ ఒత్తిడి కొనసాగుతోందని డాక్టర్ హన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాల రేటు నమోదవుతున్న దేశాల్లో ఐరోపా లోని పోలాండ్…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా ఉల్లంఘనపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య “నిందల ఆట”, “మాటల యుద్ధం” అని సుప్రీం కోర్టు ధ్వజమెత్తిన రోజున, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్, పంజాబ్ లోని ఆ పార్టీ ప్రభుత్వంపై “ముందుగా వేసుకున్న పధకం” ప్రకారం జరిగిన “కుట్ర”గా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ సహితం ప్రధాని భద్రతా ఉల్లంఘనలు కాంగ్రెస్ లో ఎవ్వరికీ ప్రయోజనకరం? అంటూ ప్రశ్నించడం గమనార్హం. కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులు, హిమంత బిస్వా శర్మ (అస్సాం) బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), “ఖలిస్థానీల” ప్రమేయం ఉందని ఆరోపించారు, ప్రధానమంత్రిని “హత్యకు కుట్ర” చేసినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని అరెస్టు చేయాలని శర్మ డిమాండ్ చేశారు. . నలుగురు ముఖ్యమంత్రులు, యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), శర్మ, దేబ్, ప్రధానమంత్రి కాన్వాయ్ చిక్కుకుపోయిన ఫ్లైఓవర్ “పాకిస్తాన్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో” ఉందని,…

Read More

బంగ్లా యుద్ధం – 28నిర్జనమైన, చీకటి ప్రదేశంలో ఒక ట్రక్కు ఆగిపోయింది. ఒకరినొక్కరు కట్టివేయబడి, బాగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన మహిళల కుప్పను కిందకు పారవేయడానికి తెరిచారు. బహుశా ఆ మహిళలు వందల సంఖ్యలో ఉండాలి. ఆ తర్వాత వెంటనే సైన్యం వారిని క్యూలలో కూర్చోబెట్టి, వయసుల వారీగా వేరు చేసింది. సంతానం పొందడానికి అవకాశం లేనివారిగా భావించిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు. అయితే పిల్లలను కనే సామర్థ్యం ఉన్నవారిని రాబోయే కొన్ని నెలలపాటు అత్యాచార శిబిరంలో నివసించడానికి అక్కడే ఉంచారు. ఆర్మీ కమాండర్ తన సైనికులకు “ఈ స్త్రీలను గర్భం ధరించాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. తమ  దేశానికి,  మతానికి విధేయతగల పాకిస్తాన్‌ను నిర్మించాలనే ఆలోచన వారిది. దర్శకుడు మృత్యుంజయ్ దేవవ్రత్ చిత్రం, “చిల్డ్రన్ ఆఫ్ వార్” నుండి ఈ గగుర్పాటు కలిగించే సన్నివేశం కేవలం కల్పితం. ఇది బయట ప్రపంచంలో పెద్దగా వెలుగు చూడని 1971లో కొత్తగా ఏర్పడిన దేశం జ్ఞాపకాలు,…

Read More

* నేడు జయంతి భారతదేశం అమెరికా తర్వాత మందుల తయారీ,  పంపిణీ లో ప్రముఖ స్థానం పొందింది. హైదరాబాద్ లో  అనేక భారీ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వందేళ్ళ క్రితమే వీటికి పునాదులు పడ్డాయి. సర్ రోనాల్ రాస్ సికింద్రాబాద్ లోనే పరిశోధనలు చేశారు.ఇంకా అనేక మంది ఇటువంటి పరిశోధనలు చేశారు. ఇందులోప్రముఖ జీవ రసాయన శాస్త్ర వేత్త యల్లాప్రగడ సుబ్బారావు ఒకరు. ఆయన ఎన్నో ప్రాణాంతకమైన అనేక వ్యాధులకు చికిత్సలను కనుగొన్నారు. లాభాపేక్ష లేకుండా మానవాళికి ఉపకారం చేశారు. సుబ్బారావు తన ఆవిష్కరణలను ఏనాడూ అమ్ముకోలేదు. పేటెంట్స్ తీసుకోలేదు. సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో1895 జనవరి12న జన్మించారు. ప్రాధమిక విద్య రాజమండ్రిలో, మెట్రిక్యులేషన్ మద్రాసు హిందూ హైస్కూలులో, ఇంటర్మీడియట్ ప్రెసిడెన్సీ కళాశాలలో, వైద్య విద్య మద్రాసు మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడై ఖాదీ వస్త్రాలను ధరించారు.దాంతో ఆంగ్ల ప్రొఫెసర్లు ఆగ్రహించటం వలన…

Read More

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. తద్వారా ఒకవంక అభివృద్ధి అంశంతో పాటు హిందుత్వ అంశం కూడా ఎన్నికలలో ప్రధానంగా ఓటర్లకు చేరేందుకు దోహదపడగలదని భావిస్తున్నారు. ఆదిత్యనాథ్, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు మంగళవారం దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు ఆ పార్టీ  వర్గాలు తెలిపాయి. అయోధ్య నుండి ముఖ్యమంత్రి పోటీ చేయడం పార్టీ మద్దతుదారులకు `అంతిమ’ సందేశం ఇచ్చిన్నట్లు కాగలదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం మొదటి సారి కావడమే కాకుండా, తన స్వస్థలం గోరఖపూర్ వెలుపల పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి కాగలదు. ఇప్పటి వరకు ఐదు సార్లు…

Read More

బ్రిటిష్ వలస పాలకుల నుండి, పాకిస్థాన్ నుండి ఎన్ని  ప్రలోభాలకు, వత్తిడులు ఎదురైనా లెక్క చేయకుండా జమ్మూ, కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసిన చివరి రాజవంశీయుడైన రాజా హరిసింగ్ రాజకీయ వారసత్వం గురించి 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కాశ్మీర్ లోయలో ప్రస్తావన వస్తున్నది.   మహారాజా హరిసింగ్ పుట్టినరోజును నిర్వహించాలా వద్దా అని నిర్ణయించడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ఇలా ఉంది: “మహారాజా హరి సింగ్ జీ జన్మదిన జ్ఞాపకార్థం  జమ్మూ,  కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సాధారణంగా లేదా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం దీనిని పాటించడం గురించి కమిటీ ని ఇందుమూలంగా నియమించడం జరిగింది.” జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రానికి చెందిన చివరి పాలక మహారాజు “నియంత” అని పిలిచినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ…

Read More

భారత సైన్యం తూర్పు లడఖ్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో కఠినంగానే వ్యవహరిస్తోందని, ఈ ప్రాంతంలో హై లెవల్ లో బలగాలను మోహరించినట్టు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవణే స్పష్టం చేశారు. ఆర్మీ డేకి ముందు జరిగిన మీడియా మీట్ లో జనరల్ నరవాణె మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పాక్షికంగా ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ ఏ విధంగానూ ముప్పు తగ్గలేదని పేర్కొన్నారు. దీంతో అత్యున్నత స్థాయి కార్యాచరణకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.  గత 18 నెలల్లో చైనాతో ఉత్తర సరిహద్దుల్లో భారత సైన్యం తన సామర్థ్యాలను అనేక రెట్లు పెంచుకుందని ఆర్మీ చీఫ్ జనరల్  తెలిపారు. చైనా వైపు ఉన్న చుషుల్-మోల్డో మీటింగ్ పాయింట్‌లో భారతదేశం,  చైనాల మధ్య 14వ రౌండ్ మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ, “మేము ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మరింత మెరుగ్గా సిద్ధంగా ఉన్నాము” అని ఆయన స్పష్టం చేశారు.  తూర్పు లడఖ్‌లో మే 2020…

Read More

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎవ్వరికీ వారుగా వాదనలు వినిపించాయి. ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరుభల్లా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో ఎపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, సమీర్ శర్మ పాల్గన్నారు. విభజన వల్ల అన్ని విధాల నష్టపోయన తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కోరగా, విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పలు కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. చట్టంలో ప్రస్తావించని సంస్థలు, బకాయిల కోసం విభజన చట్టాన్ని మరోసారి సవరించాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. దీంతో తాము నష్టపోతున్న మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. మరోవంక, సింగరేణి సంస్థలో వాటా కావాలన్న ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తినీ టి.సర్కారు తిరస్కరించింది. ఈ విషయమై…

Read More

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్రం ఆదేశించింది. కనీసం 48 గంటలకు సరిపడే విధంగా బఫర్‌ స్టాక్‌ ఉండేలా చూసుకోవాలని వెల్లడించారు.  ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కరోనా బాధితులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలాగే వైద్య కేంద్రాల వద్ద మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కనీసం 48 గంటలకు సరిపడే విధంగా బఫర్‌ స్టాక్‌ ఉండేలా చూసుకోవాలని వెల్లడించారు. పిఎస్‌ఎ ప్లాంట్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని కోరారు. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సీజన్‌ (ఎల్‌ఎంఒ) ట్యాంకులు తగినస్థాయిలో ఉండాలని, వాటి రీఫిల్లింగ్‌లో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించింది. ఆక్సిజన్‌ సంబంధ సమస్యలు, సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు ఆక్సిజన్‌ కంట్రోల్‌…

Read More