Author: Editor's Desk, Tattva News

బంగ్లా యుద్ధం – 101971 యుద్దానికి ముందు, యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ సైనికాధికారుల ప్రవర్తనను యుద్ధం తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం నియమించిన వార్ కమీషన్ తూర్పురా బట్టింది. ఈ సందర్భంగా సైన్యం, దేశ నాయకత్వం వ్యవహరించిన తీరును సిగ్గుమాలినదిగా అభివర్ణించింది.   వారిని దుర్మార్గం, స్మగ్లింగ్, యుద్ధ నేరాలు,  విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించింది. వార్ కమీషన్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్‌పై బహిరంగ విచారణకు సిఫారసు చేసింది, వారు మొదట ఈ పరిస్థితికి బాధ్యత వహించాలని, వారు పోరాడకుండానే లొంగిపోయారని స్పష్టం చేసింది. అయితే బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం సాహసింపలేదు.  యుద్ధం ముగిసిన తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం బెంగాలీయుడైన సుప్రీం కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి హమూదుర్ రెహమాన్ నేతృత్వంలో యుద్ధ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయమూర్తులు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.  యుద్ధంలో ఓటమికి కారణమైన ఇంటెలిజెన్స్, వ్యూహాత్మక, రాజకీయ,…

Read More

* నేడు మాలవీయ జయంతి భారతదేశపు మొట్ట మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది? బెనారస్ హిందూ యూనివర్సిటీ! దానిని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవీయ స్థాపించారు. అందుకోసం దేశం అంతా తిరిగి విరాళాలు సేకరించారు. అందుకే ఆయనను చాలామంది “నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి” అని హాస్యమాడేవారు కూడా. అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు. ఇదే క్రమంలో ఆయన హైదరాబాద్ లో నిజాం దగ్గరకి వచ్చారు. నిజాం మహా పిసినారి. పైపెచ్చు మహా మత దురహంకారి. ” నీకెంత ధైర్యం…హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా” అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా. మాలవీయ మారు మాట్లాడలేదు. ఆ చెప్పును కళ్లకద్దుకుని “మహా ప్రసాదం” అంటూ బయటకి వచ్చేశాడు. బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పుని ఉంచి, దాన్ని అమ్మకానికి పెట్టాడు. నిజాం ప్రభువు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు. పోటీ పెరిగింది. వేలం…

Read More

డా. కె.లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా, జాతీయ అధ్యక్షుడు ‘‘ఈ దేశం కేవలం ఒక భూభాగం కాదు, ఒక సజీవ జాతి, పుణ్యభూమి.. భారత్ కోసం నా జీవితాన్ని త్యాగం చేసేందుకు గర్వపడతాను’’ అని చెప్పిన పరిపూర్ణ జాతీయవాది వాజ్​పేయి. తాను జీవించి ఉన్నంత కాలం తరచు ఇదే మాటను చెప్పారు. సుపరిపాలనతో నవభారత నిర్మాణానికి పునాది వేసిన సూత్రధారి వాజ్​పేయి. జనాల్లో చైతన్యం నింపుతూ ఆయన ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారి దాన్ని కాపాడేందుకు గొంతెత్తారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా విలువలతో రాజకీయాలు నడిపారు. అందుకే అటల్​జీ ఈ గడ్డకు ఆత్మీయ బంధువు. ఆ మహనీయుని జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సిద్ధాంత నిబద్ధత, అభివృద్ధి రాజకీయాలకు మరో పేరు అటల్ బిహారి వాజ్ పేయి. స్వతంత్ర భారతదేశంలో ఆయనలాంటి రాజనీతిజ్ఞుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయ జనతా పార్టీని పునాదుల నుంచి నిర్మించడంలో,…

Read More

కరోనా మహమ్మారి ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు దేశంలో తీవ్రరూపం దాలుస్తున్న కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరపవలసిన ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నది. అదే జరిగితే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తున్నది. అయితే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ల అసెంబ్లీల పదవీకాలం మార్చ్ లో ముగియనున్న కారణంగా ఒక నెల రోజుల పాటు ఎన్నికలు వాయిదా పడినా ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది. కానీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే వరకు ఉండడంతో రెండు నెలలపాటు వాయిదా పడినా రాష్ట్రపతి పాలన అవసరం ఏర్పడక పోవచ్చు. అయితే వాయ్హిదా అంటూ పడితే ఐదారు నెలలపాటు ఉండే అవకాశాలు ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను రెండు నెలలపాటు  వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కమీషన్ ను కోరడంతో ఈ డిమాండ్ కు ప్రాధాన్యత…

Read More

వ‌చ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరుగవలసిన వింట‌ర్ ఒలింపిక్స్‌ నిర్వహణ పట్ల నీలినీడలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే మెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిథువేనియా, కెనడా వంటి దేశాలు ఈ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా జపాన్ ఆ దేశాల జాబితాలో చేరింది. చైనాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై దౌత్య‌వేత్త‌ల‌ను ఆ దేశానికి పంపేందుకు ఈ దేశాలు నిరాకరించాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు వేడుకల్లో తమ దేశం తరఫున అధికారులు గానీ, రాయబారులు గానీ పాల్గొనరని ఈ దేశాలు ప్రకటించాయి. అయితే క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటారని వెల్లడించారు. బహిష్కరణ గురించి ఐరోపా దేశాలతో చర్చిస్తున్నామని ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజంలో సార్వత్రిక విలువలైన స్వేచ్ఛ, ప్రాథమిక మానవ హక్కుల పట్ల గౌరవం, చట్ట నియమాల సార్వత్రిక విలువలకు చైనా హామీ ఇవ్వడం చాలా ముఖ్యమని జపాన్ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. అమెరికా చేప‌ట్టిన…

Read More

‘కేంద్రం టెలిస్కోప్‌తో చూస్తోంది. ఇకపై మీ ఆటలు సాగవు. త్వరలోనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది.’ అని బిజెపి ఎంపి సిఎం రమేష్‌ హెచ్చరించారు. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని వెల్లడించారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని ధ్వజమెత్తారు. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని రమేష్ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని గుర్తు చేశారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి…

Read More

పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. తన ఉన్నతికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పారు. సీజేఐ స్వగ్రామం కృష్ణ జిల్లా పొన్నవరంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుబంధముందన్నారు. పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని, చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, పొలాలు, చెరువులు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే జౌషదమని చెబుతూ తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని జస్టిస్‌ రమణ సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి ఢిల్లీలో అనేక మంది చెబుతారని.. తమ రాష్ట్రాల్లోని కట్టడాలను తెలుగు వాళ్లే నిర్మించారని చెప్తుంటారని పేర్కొన్నారు. తెలుగు జాతికి సరైన గుర్తింప లేదనే ఆవేదన తనలోనూ ఉందని చెబుతూ తెలుగు బాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఛైతన్యాన్ని పటిష్ట…

Read More

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలైనా.. జొమాటో తదితర ఆన్‌లైన్‌ డెలివరీ కంపెనీలైనా.. జనవరి 1 నుంచి తమ వేదికలపై కస్టమర్ల కార్డు సమాచారాన్ని సేవ్‌ చేసుకోలేవు. నూతన సంవత్సరం మొదలు ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతేడాది మార్చిలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్‌ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్డు టోకనైజేషన్‌ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్‌ విజయవంతం కాగలదని అందులో పేర్కొన్నది. యూనిక్‌ ఆల్గరిథమ్‌ జెనరేటెడ్‌ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్‌ చేసేందుకు టోకనైజేషన్‌ సహకరిస్తుంది. ఈ మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది నుంచి వర్తించనున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. వీటి ప్రకారం: జనవరి 1 నుంచి ఏ ఈ-కామర్స్‌…

Read More

బంగ్లా యుద్ధం – 9 తూర్పు పాకిస్తాన్‌లో పౌరులపై  పాకిస్థాన్ సైనిక చర్యకు ఉపక్రమించడంతో భారత్ సైనిక జోక్యంతో బాంగ్లాదేశ్ విముక్తికి బాట వేయడానికి త్వరితగతిన పరిణామాలు జరిగిపోయాయి.  అటువంటి పరిణామాలకు భయపడే దేశ అధ్యక్షుడు యహ్యాఖాన్ ముందే సైనిక చర్యకు తూర్పు పాకిస్తాన్ గవర్నర్, వైస్-అడ్మిరల్ సయ్యద్ మొహమ్మద్ అహ్సన్, డాకాలోని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చెందిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ కమోడోర్ ముహమ్మద్ జాఫర్ మసూద్ స్పష్టంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడం ద్వారా తమ పదవులు పోగొట్టుకోవలసి వచ్చింది.  వాస్తవానికి యాహ్యాఖాన్ కు సహితం అటువంటి భయమే ఉంది. అందుకే తొలుత సైనిక చర్యకు సుముఖత వ్యక్తం చేయలేదు.  అయితే పాకిస్తాన్ సైన్యం,  వైమానిక దళం జనరల్స్ నుండి వచ్చిన వత్తిడి కారణంగానే సైనిక చర్యకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అసలు అటువంటి సైనిక చర్యకు పాకిస్థాన్ సైన్యం సిద్ధంగా లేకుండానే ఆదేశాలు ఇచ్చారు.  అప్పటికే ఆవామీలీగ్ నేత తాజుద్దీన్ అహ్మద్ ఏప్రిల్ 3, 1971న భారత ప్రధాని ఇందిరాగాంధీని కలసి సాధ్యమైనంత సహాయం…

Read More

2014 ఎన్నికల ముందు `కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో బిజెపి ప్రధాని అభ్యర్థిగా వచ్చిన నరేంద్ర మోదీ అఖండ విజయం సాధించడమే కాకుండా, చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్ లో అధికారికంగా కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేయగలిగారు.  అప్పటి నుండి ఆ పార్టీ క్షీణిస్తూ వస్తున్నది. ఆ పార్టీ ప్రాబల్యం నాలుగైదు, రాష్ట్రాలకు పరిమితమవుతుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలలో ఆ పార్టీ కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా కాలేకపోయింది.  “కాంగ్రెస్-ముక్త్ భారత్” కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి తరహాలో పనిచేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్-అనుకూల బెంగాలీ వార్తాపత్రికలోని ఒక కధనం పేర్కొంది. బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్న్యాయం తాము కాక మరొకరు రాలేరని, ఆ పార్టీ ఏదో ఒకరోజుకు ప్రజా వ్యతిరేకతకు గురయితే, తామే తిరిగి అధికారంలోకి రాగలమని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కలల…

Read More