బంగ్లా యుద్ధం – 4 ఇండో-పాకిస్తాన్ యుద్ధం, 1971 ఉపఖండంలో మూడు దేశాలలో వ్యూహాత్మకంగా కీలక పరిణామాలకు దారితీసింది. ప్రతి ఏడాది అప్పటి నుండి డిసెంబరు మొదటి రెండు వారాలు సాధారణంగా చాలా కార్యకలాపాలను చూస్తుంటాము. ఈ యుద్ధం పాకిస్తాన్‌ను శాశ్వతంగా విచ్ఛిన్నం చేయడానికి, కొత్త దేశంగా బాంగ్లాదేశ్ సృష్టికి దారితీసింది. మూడు దేశాలు తమ సొంత కోణం నుండి యుద్ధం యొక్క కథనాన్ని చూస్తాయి. బంగ్లాదేశ్ డిసెంబర్ 16ని బిజయ్ దిబోష్‌గా జరుపుకుంటుంది. ఇటీవలి సంవత్సరాలలో, అక్కడ పోరాడిన భారతీయ సైనిక అనుభవజ్ఞులను ప్రభుత్వ అతిథులుగా వేడుకలకు ఆహ్వానిస్తోంది. కొత్త దేశాన్ని రూపొందించడంలో వారి సేవలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారతదేశంలో, డిసెంబర్ 16ని విజయ్ దివస్‌గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఆ నాటి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల ప్రదర్శన, సెమినార్లు, పుస్తకావిష్కరణలు, నాటి పోరాట యోధులను తలచుకొంటూ పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్‌లో, యుద్ధానికి దారితీసిన…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బెంగాల్, తమిళనాడు సహా.. పక్క రాష్ట్రాలకు కేసీఆర్ గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ రాజ్యసభ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని సంజయ్ హెచ్చరించారు. పార్లమెంట్‌లో ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలు తోకముడిచారెందుకు? అని ప్రశ్నించారు. బెంగాల్లో నాలుగు స్థానాల నుంచి 77 సీట్లు సాధించినట్లే.. తెలంగాణలో టీఆర్ఎస్‌పై కొట్లాడుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌కు చావు డప్పులు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు డిమాండ్‌తో ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తామని సంజయ్ ప్రకటించారు.…
దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, అధికారులపై పెరిగిపోతున్న ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం సుపరిపాలన వారంగా సోమవారాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గ్రామస్ధాయిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్ధను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామాలకు సుపరిపాలనను తీసుకెళ్లాలనే నినాదంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20 నుంచి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘సుపరిపాలన వారం’ ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, రాష్ట్ర స్థాయిలో పౌర పట్టికలను అప్ డేట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రజానుకూలమైన సుపరిపాలనను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనికి సంబంధించిన ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉందని, గ్రామాలను…
క్రిప్టో కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించాల్సిందేనని ఆర్బీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. వాటిపై పాక్షిక ఆంక్షలు ఫలితాలివ్వబోవని బ్యాంకు బోర్డు సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీల విలువ, క్రిప్టో ఎక్స్చేంజ్‌ల యాజమాన్య నిర్వహణతోపాటు సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సుస్థిరత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని ఆర్బీఐ అభిప్రాయ పడింది. క్రిప్టోలపై ఆర్బీఐ వైఖరినే బ్యాంక్ సెంట్రల్ బోర్డు సమర్థించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో పుట్టిన ఊహాజనిత ఆస్తుల నియంత్రించడం కష్ట సాధ్యం అనే అభిప్రాయం వ్యక్తమైంది. విదేశీస్టాక్ ఎక్స్చేంజీల్లో క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ జరుగుతుందని సమావేశంలో పాల్గొన్న ఓ సభ్యుడు అన్నట్లు సమాచారం. 2018లో క్రిప్టో కరెన్సీలను ఆర్బీఐ నిషేధించినా.. గతేడాది సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. కొందరు సభ్యులు బ్యాలెన్స్‌డ్ విధానాన్ని అనుసరించాలని కోరినట్లు సమాచారం. టెక్నాలజీ స్పేస్ విస్తరించడంతోపాటు ఆర్థిక రంగంపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు…
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ వంతు నిధులు విడుదల చేయక పోవడంతో, భూసేకరణ చురుకుగా సాగక పోతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఎక్కడికక్కడ ఆగోపితున్నాయి. ఎనోసార్లు ఇన్‌కాప్, కేంద్రం దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో భేటీలు నిర్వహించినప్పటికీ ఫలితం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇవే అంశాలపై కేంద్ర పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖలోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ అధికారులతో రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ భేటీ జరిగింది. ప్రాజెక్టులకు రాష్ట్రం భరించాల్సిన వాటా నిధులను కూడా విడుదల చేయాలని ఇన్‌కాప్ అధికారులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ-గూడూరుకు మూడో లైన్ నిర్మాణాన్ని రూ.3246 కోట్లతో నిర్మించాలని 2019లో నిర్ణయించారు. దీనికోసం దాదాపు 600 నిర్మాణాలను తొలగించాల్సి ఉండగా, ఇప్పటివరకు 300 మాత్రమే తొలగించారని, మిగిలిన వాటిపై నెల్లూరు అధికారులు దృష్టి పెట్టడం లేదని పిఎంజి చెబుతోంది. భూసేకరణలో కూడా ఇబ్బందులు వస్తున్నాయని…
ఒక వంక దేశంలో ఒమిక్రాన్ కేసులు 126కు చేరగా, వీటి కారణంగా భారత్ లో జనవరి మొదటి వారంలో మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. కరోనా కేసులు ఫిబ్రవరి చివరి వారంలో గరిష్ఠ స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నది. అయితే రెండో వేవ్‌తో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చని తెలిపింది. డెల్టా వేరియంట్ సమయంలో చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని గుర్తు చేసింది. ‘దేశంలో వ్యాక్సినేషన్ మార్చిలో ప్రారంభమైంది. డెల్టా వేరియంట్ వచ్చేటప్పటికి చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు. దీంతో ఉద్ధృతంగా వ్యాపించింది. ప్రస్తుతం భారత్‌లో సీరో పాజిటివిటీ రేటు 75-80 శాతం మధ్యలో ఉంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహజ నిరోధకత ఉంది. 85% మంది ఒక్క డోసు టీకా వేసుకొన్నారు. సగం మంది రెండు డోసులు వేసుకొన్నారు. ఎంత పరిస్థితి చేయిదాటిపోయిందని అనుకొన్నా రోజువారీ కేసులు 2 లక్షలు దాటవు’ అని కమిటీ హెడ్,…
త్రివిధ దళపతి బిపిన్ రావత్ మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదని, ఘటనా స్థలంలో దొరికిన ప్రతి సాక్ష్యాన్ని పరిశీలిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ స్పష్టం చేశారు. దుండిగల్ ఎయిర్ పోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారన్నారని ఆయన గుర్తు చేశారు. వాతావరణ తప్పిదమా, మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా అనేది విచారణ చేస్తున్నామని వివేక్‌రామ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ప్రమాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాతే ఏమైనా మాట్లాడగలమని చెప్పారు. ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకోసం వారాల సమయం పడుతుందని తెలిపారు. కాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశా రు. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని వివేక్‌రామ్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే…
సెంటియెంట్ ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్, మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సును బుధవారం పూణెలో ప్రదర్శించింది. మార్కెట్ లోకి ఈ బస్సు రావటం వల్ల ముఖ్యంగా ప్రజా రవాణా, వాణిజ్య రవాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రాగలదు. మన పెట్రోల్, డీజిల్ దిగుమతులు కూడ తగ్గుతాయి.. విశేషం ఏమిటంటే, వ్యవసాయ అవశేషాల నుండి నేరుగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, దానితో నడిచే ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థ సెంటియెంట్ చేసింది. ఈ బస్సు,కేవలం 30 కిలోల హైడ్రోజన్‌ను ఉపయోగించుకుంటూ 450 కి.మీ దూరం వెళ్తుంది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ కెమికల్ లాబొరేటరీ, సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధి చేయబడింది.
బంగ్లా యుద్ధం – 3 బాంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పాకిస్థాన్ పై యుద్ధంకు దిగకుండా నివారించేందుకు భారత ప్రభుత్వంపై అమెరికా చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో తీవ్ర వత్తిడి తీసుకొచ్చింది. అయితే ఆ వత్తిడులను లెక్కచేయకుండా భారత్ దాదాపు ఒంటరిగా పాకిస్థాన్ జనాలపై విరుచుకు పడి, బాంగ్లాదేశ్ విముక్తికి కారణమైనది. నవంబర్ 29, 1970న, నాటి పాకిస్థాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ పశ్చిమ ఫ్రంట్‌లో భారతదేశంపై పూర్తిగా దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్ పై గెలుపొందగలమన్న నమ్మకం లేకపోవడంతో పూర్తి స్థాయి యుద్ధం లేకుండా తూర్పు పాకిస్తాన్‌ను కోల్పోతే పాకిస్తాన్ సైన్యం ప్రతిష్ట కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని భయపడ్డాడు. భారతదేశంతో సంపూర్ణ యుద్ధం చేయకుండా తూర్పు పాకిస్తాన్‌ను లొంగిపోయే అవమానాన్ని సైన్యం తగ్గించుకోలేదని అతను ఆ తరువాత అంగీకరించాడు.అతని చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ గుల్ హసన్ ఇలా చెప్పినట్లు తర్వాత వెల్లడైనది: “…మేము ఈ చర్య తీసుకోవలసి…
‘ఆంధ్రుల రాజధాని అమరావతే.. ఇది ఐదు కోట్ల ప్రజానీకం అభిమతం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకు అంగీకరించేది లేదు’ అంటూ తిరుపతిలో జరిగిన భారీ బహిరంగసభలో నేతలు స్పష్టం చేశారు. `మాటతప్పను.. మడమతిప్పను’ అన్న జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఒకలా, అధికారం వచ్చాక మరోలా ప్రవర్తించడం సరికాదని ఈ సందర్భంగా హితవు చెప్పారు. అమరావతి రాజధాని కోసం తమ భూములను ఉచితంగా ఉచ్చిన ఆ ప్రాంత రైతుల త్యాగం వృథాకాదని ఈ బహిరంగ సభలో పాల్గొన్న వివిధ రాజకీయ పక్షాల అధినేతలు భరోసా ఇచ్చారు. అమరావతి పరిరక్షణ సమితి జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి రూరల్ దామినేడు సమీపంలో జెఎసి నేత వెంకటరెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ’ పాదయాత్ర చేపట్టిన మహిళలకు, రైతులకు పాదాభివందనం తెలిపారు. అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి 180…