తమ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిందని, చిలిమాతో సహా విమానంలో ఉన్నవారందరూ మరణించారని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వెరా వెల్లడించారు. 51 ఏళ్ల చిలిమా, పూర్వపు తొలి మహిళ షనీల్ జింబిరి సహా పది మంది పాటు సైనిక విమానంలో వెళుతున్నారని, విమానం మలావీ రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిందని, ముజుజు విమానాశ్రయంలో దిగవలసి ఉందని మలావీ అధ్యక్షుడు, మంత్రివర్గ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. అననుకూల వాతావరణం కారణంగా విమానం ఆ విమానాశ్రయంలో దిగలేకపోయినట్లు, రాజధానికి తిరిగి రావలసిందని సోమవారం ఆదేశించినట్లు అధ్యక్షుడు చక్వెరా జాతిని ఉద్దేశించి చేసిన టివి ప్రసంగంలో చెప్పారు. విమానం ఆచూకీ తీయడానికి ఒక రిజర్వ్ అడవిలో పది కిలో మీటర్ల పరిధిలో తీవ్రంగా అన్వేషించినట్లు అధ్యక్షుడు తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అండగాఉండవలసిందిగా పొరుగు దేశాలకు, యుఎస్, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు మలావీ విజ్ఞప్తి చేసినట్లు అధ్యక్షుడు తెలియజేశారు.…
Author: Editor's Desk, Tattva News
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 15 లోపు విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. అయితే జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ ను కోరారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై లోటుపాట్లు తేల్చాలని కమిషన్ ను ఆదేశించింది. దీంతో జస్టి నరసింహారెడ్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం, అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో సమావేశం అయ్యారు. తెలుగు దేశం పార్టీ, జననసేన పార్టీ, బీజేపీల ఎన్డీఏ కూటమి శాసన సభా పక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలియజేశారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలుకుతారు.. చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిపై ఉందని…
సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ మార్క్‌ను అందుకోలేకపోయిన బీజేపీ (240 స్థానాలు), త్వరలో వివిధ రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి సవాల్ ఎదురవుతుందని భావిస్తున్నది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న 5 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆదివారం 71 మందితో మంత్రివర్గం ఏర్పాటుచేయగా, ఇందులో 21 మంది మంత్రులు (30 శాతం పదవులు) అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ర్టాల నుంచి ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు 2024, 2025లలో ఎన్నికలు రాబోతున్నాయి. హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లో ఎన్డీయేకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. కీలక రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు మోదీ సర్కార్‌కు సవాలేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఈ రాష్ర్టాల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. మరోవంక, ప్రధాని మోదీ నేతృత్వంలో…
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆదివారం కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రధానమంత్రితో సహా 72 మంది మంత్రుల్లో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు, 36 మంది రాష్ట్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. వారికి సోమవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ : పీఎంఓ, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కేంద్ర కేబినెట్ మంత్రులు 1. రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ 2. అమిత్ షా – హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ 3. నితిన్ జైరామ్ గడ్కరీ – రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 4. జగత్ ప్రకాష్ నడ్డా – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ 5. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతుల…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు ఢిల్లీలో ఉండి లాబీయింగ్ చేస్తుంటే పార్టీ శ్రేణుల్లో అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ కేంద్రమంత్రి అమిత్ షాతో సోమవారం భేటీ అయ్యారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు అనూహ్యంగా బండి సంజయ్ని పక్కన పెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అదనంగా రాష్ట్ర అధ్యక్ష…
మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం ఉదయం తన పనిని ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద.. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, సుమారు రూ .20,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో దేశంలోని 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి రూ.2 వేల చొప్పున డబ్బులు పడనున్నాయి. “రైతన్న అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందుకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశాను. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగం కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నాము,’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గ్రామీణ భారతం నుంచి…
వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘాలపై పనులు ప్రారంభించింది. అమరావతి రాజధాని నిర్మాణం రూపురేఖలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా ఇస్తున్న నేపథ్యంలో సిఆర్‌డిఎ అధికారులు నిధుల సేకరణపై దృష్టి సారించారు. ఇప్పుడున్న ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, భవనాల ప్రారంభం, రోడ్ల నిర్మాణానికి తక్షణం రూ.2 వేల కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. వీటిని సమీకరించుకోవడమా, ప్రభుత్వం నుండి తక్షణావసరంగా తీసుకోవడమా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ నిధుల నుండి తక్షణ పనులు చేపట్టామని, ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దీనిపై స్పష్టత తీసుకుంటామని అధికారులు వివరించారు. అయితే, గతంలో టిడిపి హయాంలో రాజధాని ప్రాంతంలో వేసిన అనేక రోడ్లు ఇప్పుడు కనిపించడం లేదు. గత ఐదేళ్లల్లో తవ్వేశారు. కంకరను సొంత అవసరాలు,…
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. లోయెస్ట్ స్కోర్‌ను కాపాడుకోగలిగింది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియాకు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించింది భారత్. ఈ రెండింట్లో కూడా బౌలర్లే హీరోలు. ఈ నెల 12వ తేదీన తన తదుపరి మ్యాచ్‌లో యునైటెడ్ స్టేట్స్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. గ్రూప్ ఏలో భాగంగా న్యూయార్క్‌లోని నస్సౌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయారు. 19 ఓవర్లల్లో 119 పరుగులకే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్ ఒక్కడే 42 పరుగులతో టాప్ స్కోరర్. రోహిత్ శర్మ- 13, విరాట్ కోహ్లీ- 4, అక్షర్ పటేల్- 20, సూర్యకుమార్ యాదవ్- 7, శివందుబే-…
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ వైఫల్యాలపై మొదటి నుంచి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స‌్థానాల్లో కూడా అభ్యర్థులు విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన టీడీపీ సొంతంగా 133 స్థానాల్లో గెలిచింది. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మూడో సారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా నిలిచింది. టీడీపికి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇద్దరు ఎంపీలు గెలుపొందిన జనసేన నుండి కూడా ఒకరు మోదీ మంత్రివర్గంలో చేరబోతున్నట్లు కధనాలు వ్యాపించినా కార్యరూపం దాల్చలేదు. అసలు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో…