జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రీకులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించాగా, 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యాత్రీకులతో శివ్ ఖోరి కేవ్ మందిరానికి వెళ్తుండగా ఈ దాడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సు లోయలోకి పడిపోయిందని రైసీ సీనియర్ ఎస్‌పి మోహితా శర్మ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్టు వెల్లడించారు. శివఖోరీ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. బుల్లెట్లు బస్సు డ్రైవర్ విజయం ను లక్ష్యంగా చేసుకున్నాయని, దానితో అతను వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దాని కారణంగా అది రోడ్డుపై నుండి తప్పి లోయలో పడిపోయిందని నిఘా వర్గాలు తెలిపాయి.ఘటన జరిగిన రోడ్డుపై కనీసం 20 రౌండ్ల ఎకె-47, ఎం4 కార్బైన్‌లు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన…
Author: Editor's Desk, Tattva News
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మోదీ రికార్డు స్థాయిలో 3వ సారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమానం చేశారు. ఇక మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ 3.0 ప్రభుత్వంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరి పోర్ట్‌ఫోలియోలను తర్వాత ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే కేంద్ర మంత్రి మండలిలో మొత్తం 27 మంది ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారికి స్థానం కల్పించారు. 10 మంది ఎస్సీలు, 5 మంది ఎస్టీలు,…
కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటుదక్కింది. వీరిలో ఇద్దరు తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవులు ఖరారు కాగా.. అనూహ్యంగా నరసాపురం బజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. తెలంగాణ నుండి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరుతున్నారు. నరసాపురం నుంచి పోటీచేసి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గూడురు ఉమాబాలపై 2.79 లక్షల ఓట్ల పైచిలుక మెజార్టీతో గెలుపొందారు. అయితే, శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవే కాదు.. ఎన్నికల్లో టిక్కెట్ కూడా అనూహ్యంగా దక్కాయి. చివరి వరకూ బీజేపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణరాజు పేరు బలంగా వినిపించింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా…
* తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్‌లో ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీ నుంచి ఇద్దరి మంత్రి పదవులు ఖాయమైనట్టు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవి దక్కింది. ఈ మేరకు గల్లా జయదేవ్ వారి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎన్డీయే కొత్త ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి దక్కినందుకు నా మిత్రుడు రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు.. మీ చిత్తశుద్ధి, నిరాడంబరత దేశాభివృద్ధికి నిశ్చయంగా తోడ్పడతాయి. కొత్త పాత్రను సమర్ధవంతంగా పోషించాలని కోరుకుంటున్నాను’ అని గల్లా ట్వీట్ చేశారు. ‘కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు.. మీ తొలి రాజకీయ ప్రస్థానంలో కేంద్ర స్థాయిలో దేశానికి సేవ చేయడం…
టి20 ప్రపంచకప్‌లో దాయాదులు భారత్, పాక్ పోరు కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకుమ సమయం రానేవచ్చింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుండగా మొదటి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన పాకిస్థాన్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. పసికూన అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్ మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్లు మధ్య పోరు హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి టేబుల్ టాపర్‌గా నిలవాలనే యోచనలో ఉంది. తొలి మ్యాచ్ లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝలిపించాలనే కసితో ఉన్నాడు. పాకిస్థాన్‌పై పరగులు యంత్రంలా మారే కోహ్లీ ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో…
ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇక జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే రిజిస్టర్ కాని పార్టీలు.. గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. వాటిని స్వీకరించి ఆమోదించేందుకు ఈసీ నిర్ణయించినట్లు సెక్రటరీ జయదేబ్ లాహిరి ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఇటీవలె కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. వెల్లడించారు. చివరిసారిగా 2014 లో జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేశారు. 2016 లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019 జూన్…
దేశవ్యా్ప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో కూడిన నివేదిక ఇస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) డీజీ సుబోధ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని, ఆ తర్వాత ఫలితాలను సవరించే అవకాశం ఉందని తెలిపారు. కాగా, నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్టీయే డీజీ సుబోధ్‌కుమార్ ఖండించారు. పేపర్ లీక్ కాలేదని.. ఎలాంటి అవకతవకలు జరగలేవని స్పష్టంచేశారు. ఎన్ సి ఇ ఆర్ టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే పలువురు విద్యార్థులు అధికంగా…
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోశనివారం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం కోసం క్యూ లైన్ నిలబడ్డ వ్యక్తి సొమ్మసిల్లి కిందికి పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లావాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతిని కుటుంబ సభ్యులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నాంపల్లిలో శుక్రవారం సాయంత్రం నుంచే చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషనల్ కు పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలి వచ్చారు. టోకన్ల కోసం క్యూ లైన్లో నిలబ్బారు. అయితే నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57).. ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్‌లో నిలబడి ఉండగా.. రద్దీ పెరిగి…
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారని వెల్లడించారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. కాగా, సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావాలని కాంగ్రెస్ నేతలంతా గట్టిగా కోరుతున్నారని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది వర్కింగ్…
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936, నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిననాటినుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన ఆయన.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్ చేసుకునేలా సకల వసతులు కల్పించారు.ఆయన మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్‌ను నెలకొల్పారు.…