దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరగడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పోలీసులు, భద్రతా బలగాలు కలిసి మొత్తం 800 మంది చేపట్టిన ఆపరేషన్‌లో తుపాకుల మోత మోగిపోతోంది. భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరుగుతున్న భీకర పోరుతో అడవుల్లో అలజడి నెలకొంది. ఇక ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఏకంగా ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాల డంప్, పేలుడు పదార్థాలు సహా కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం ఐటీబీపీ, ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ, బస్తర్ బెటాలియన్.. స్థానిక పోలీసులు కలిపి మొత్తం 800 మంది భద్రతా బలగాలు ఈ భారీ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలో నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో నక్సలైట్ల స్థావరాన్ని గుర్తించి.. దానిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో…
Author: Editor's Desk, Tattva News
థియేటర్స్ మూతపడిన షాక్ నుంచి తేరుకొనేలోపే టాలీవుడ్ హీరోలకు మరో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ వ్యాప్తంగా బెన్‌ఫిట్ షోలు రద్దుకానున్నట్లు తెలుస్తోంది. నైజాంకి చెందిన ఎగ్జిబిటర్లు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ విషయంలో తమ డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూన్నారు. అయితే ఈ డిమాండ్‌ను నిర్మాతల మండలి పట్టించుకొనక పోవడంతో బెన్‌ఫిట్ షో రద్దు చేయలానే నిర్ణయానికి వచ్చారు ఎగ్జిబిటర్లు. దీనికి జూన్ 01వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు లాంటి సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు పేర్కొన్నట్లు తెలుస్తుంది. కాగా.. దీనిపై తెలుగు నిర్మాతల మండలి స్పందిచాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ సినిమా…
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హయాంలో2010 సంవత్సరం నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. దీంతో గత పద్నాలుగేళ్ల వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి. ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని పేర్కొంది. బంగాల్ బీసీ కమిషన్ చట్టం – 1993 ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త జాబితాను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలని నిర్దేశించింది. 2010కి ముందు బంగాల్ ఓబీసీల జాబితాలో ఉన్న కేటగిరీలలో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పింది. 2010 సంవత్సరం తర్వాత రాష్ట్ర సర్కారు జారీ చేసిన…
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు స్కూల్స్, ఆస్పత్రులకే పరిమితమైన బాంబు బెదిరింపులు ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వచ్చాయి. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు ఈమెయిల్‌ను దుండగులు పంపించారు. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన సాయుధ బలగాలు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టాయి. నార్త్ బ్లాక్ నుంచి ఉద్యోగులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా సాయుధ బలగాలు సూచించాయి. దీంతో వారంతా వెంటనే బయటకు వెళ్లిపోయారు.ఇక, హోం శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాలను సాయుధ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. విజయ్ చౌక్, నార్త్ అవెన్యూ మార్గాల్లో అగ్నిమాపక యంత్రాలను ఢిల్లీ పోలీసులు సిద్ధం చేశారు. మరోవైపు, డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే, ఇప్పటి…
బంగ్లాదేశ్ ఎంపి అన్వరుల్ అజీమ్ (55) కోల్‌కతాలో మరణించినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు ధ్రువీకరించారని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు తెలియజేశారు. బంగ్లాదేశ్ అధికార అవామీ లీగ్ ఎంపి అన్వరుల్ వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్‌కతాకు వచ్చారు. ఆ దరిమిలా ఆయన అదృశ్యమైనట్లు తెలియవచ్చింది. ఆయన కనిపించకుండా పోయిన తరువాత కోల్‌కతా పోలీసులు ఈ నెల18న ఒక జనరల్ డైరీ దాఖలు చేశారు. కోల్‌కతా బారానగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రాథమిక ఫిర్యాదు దాఖలు చేసిన తరువాత బంగ్లాదేశ్ ఎంపి చివరిసారిగా కోల్‌కతా న్యూటౌన్ ప్రాంతం సమీపంలో కనిపించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మూడు సార్లు ఎంపి అన్వరుల్ ఒకరిని కలవడానికి వెళ్లిన న్యూటౌన్ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌లో హత్యకు గురైనట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. కాళీగంజ్ ఉపజిలా అవామీ లీగ్ అధ్యక్షుడు కూడా అయిన అన్వరుల్ అజీమ్ తన కుటుంబ మిత్రుడు గోపాల్ బిశ్వాస్‌ను కలిసేందుకు ఈ నెల…
కేంద్ర ప్రభుత్వాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్ గా చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈ మేరకు సమావేశమైంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులను నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు డైరెక్టర్లు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి రూ.87,416 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. అప్పటి డివిడెండ్‌తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్ చెల్లిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది రూ.75 వేల నుంచి రూ. 1.20 లక్షల కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. అయితే, వారి అంచనాలను మించి డివిడెండ్ చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ నిర్ణయించింది. రిజర్వ్…
2024 ఆర్థిక సంవత్సరంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 62 శాతం క్షీణించి 10.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరంలో 27.98 బిలియన్ డాలర్లుగా వుంది. 2007 తర్వాత దేశంలోకి వచ్చిన నికర ఎఫ్‌డిఐల్లో ఇదే అత్యల్పం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 71.0 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయని ఆర్‌బిఐ తాత్కాలిక గణాంకాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ఎఫ్‌డిఐలు 26.55 బిలియన్ డాలర్లు, ఔట్ ఫ్లోలు 15.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, 2023 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐల ప్రవాహం 42.0 బిలియన్ డాలర్లు కాగా, ఔట్ ఫ్లోలు 14.02 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదేసమయంలో భారత్‌లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన వారి పెట్టుబడుల ఉపసంహరణ గతేడాది 29.34 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాదికి 44.40 బిలియన్…
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పోలీస్ ప్రత్యేక బృందాలు ఆయనను తెలంగాణాలో బుధవారం అరెస్ట్ చేశాయి. అరెస్టు విషయం తెలుసుకున్న పిన్నెల్లి హైదరాబాద్ నుంచి పరారయ్యారు. ఎట్టకేలకు ఆయనను వెంబడించిన పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పిన్నెల్లి కోసం ముమ్మరంగా గాలించగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో పిన్నెల్లిని గుర్తించి అరెస్టు చేశారు. పిన్నెల్లి అరెస్టును పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆయనను ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా, అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలు వెంటబడుతూ ఉండడంతో విదేశాలకు పారిపోతూ పట్టుబడినట్లు భావిస్తున్నారు. అప్పటికి పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీచేసి అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. మే 13న పోలింగ్ రోజున మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం(202)లో…
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. హైదరాబాద్ కమిషనరేట్ సీసీఎ్‌సలో ఏసీపీ (టీమ్-3)గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇంటితో పాటు.. ఆయన సంబంధీకుల ఇల్లు సహా.. తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో మూడు చోట్ల (విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెం, అనకాపల్లి జిల్లా రోలుగుంట, చోడవరం).. కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా ప్రీ లాంచ్ పేరుతో జరిగిన రూ.1500 కోట్ల మోసం కేసులో కీలక విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర తెలిపారు. ఇప్పటిదాకా నిర్వహించిన సోదాల్లో రూ.37.5 లక్షల నగదు.. 60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. …
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మే 13 వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మాచెర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. అందులో ఉన్న ఈవీఎం మెషీన్‌ను ధ్వంసం చేసినట్లు అందులో ఉంది. అయితే ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ ట్విటర్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ.. వైసీపీపై, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై తీవ్రంగా మండిపడింది. ప్రజలు వైసీపీకి ఓట్లు వేయడం లేదని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని పాపం లేదని పేర్కొంది. అంతేకాకుండా పోలింగ్ జరిగిన రోజున.. మాచెర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో (202).. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్…