తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. ఓటుకు నోటు కేసు వ్యవహారం సిఎం/హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని కూడా హెచ్చరించింది ఎసిబి అధికారులు ఈ కేసును సిఎం/ హోంమంత్రి లకు రిపోర్ట్ చేయొద్దనీ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ముఖ్యమంత్రి/హోంమంత్రి జోక్యం చేసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చు అని బీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టం చేసింది. దీంతో.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి అలాగే బీఆర్‌ఎస్ పార్టీకి ఊరట లభించింది. అయితే విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ జరుగుతున్న ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోచేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.…
Author: Editor's Desk, Tattva News
తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడానని, వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించమని చెప్పానని అన్నారు. కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభాకరంద్లాజే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. తిరుమలకు చెందిన కళాశాలల్లో పద్మావతీ శ్రీనివాసుల ఫొటోలను తొలగించాలని, హిందూయేతర గుర్తులను…
లైంగిక వేధింపుల ఆరోపణల్లో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. నేరాన్ని జానీ అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2019లో జానీతో బాధితురాలు పరిచియమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేరుకున్నాడని చెప్పారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత బాధితురాలిపై జానీ పలుసార్లు లైంగిక దాడి జరిపాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా బాధితురాలిని బెదిరించాడని.. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లు వెల్లడించారు. అలాగే, పలుకుబడి ఉపయోగించి బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశాడని.. జానీ భార్య సైతం…
కాంగ్రెస్ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో మహాత్మాగాంధీతో సంబంధమున్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే స్ఫూర్తి పూర్తిగా అంతరించిపోయింది. కాంగ్రెస్ నేతలు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారు’ అంటూ ప్రధాని మండిపడ్డారు. `కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను ఎదగనివ్వలేదు. వెనుబడిన వర్గాలు, దళితులపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రతికూల ఆలోచనలను ప్రభుత్వ వ్యవస్థ నుంచి తొలగించాం. వీళ్లు విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి’ అని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత…
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.…
పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా డాక్టర్లు సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీతో గురువారం జరిపిన చర్చలు ఫలించినట్లు రాత్రిపూట ప్రకటన వెలువడింది. ఆర్‌జి కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన కలకలానికి దారితీసింది. డాక్టర్లు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఇది ఆసుపత్రులలో చికిత్సలకు ఆటంకంగా మారింది. ఈ క్రమంలో చర్చలకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ చొరవతీసుకున్నారు. విధుల సమయంలో తమకు రక్షణ లేకుండా పోయిందని, బాధితురాలికి న్యాయంతో పాటు , తమ రక్షణపై తగు లిఖితపూర్వక పత్రం ఇవ్వాలని, చర్చల రికార్డు జరగాల్సి ఉంటుందని డాక్టర్లు పట్టుపట్టారు. దీనిపై చాలారోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన తరువాత ప్రభుత్వం వరుసగా ఇస్తూ వచ్చిన హామీల క్రమంలో , డాక్టర్ల భద్రతకు చర్యల ప్రకటనలతో ఇప్పుడు డాక్టర్లు సమ్మె విరమించినట్లు వెల్లడైంది. అయితే తాము శుక్రవారం విషయాలను సమీక్షించుకుని , శనివారం నుంచి విధుల్లోచేరుతామని డాక్టర్ల బృందం విలేకరులకు తెలిపింది. సిఎం అధికారిక…
టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఎజిఆర్)లో బకాయిల గణనలో తప్పులను సరిదిద్దాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సహా పలు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. టెలికాం కంపెనీల పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. క్యూరేటివ్ పిటిషన్‌లను ఓపెన్ కోర్టులో విచారించేందుకు జాబితా చేయాలని కంపెనీలు కోరాయి. క్యురేటివ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో చివరి ప్రయత్నం.. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడానికి చట్టపరమైన మార్గం ఉండదు. సాధారణంగా ఇలాంటి పిటిషన్స్‌ని న్యాయమూర్తులు ఛాంబర్‌లో పరిశీలించి.. విచారణకు అర్హత ఉందో.. లేదో నిర్ణయిస్తారు. ప్రత్యేకంగా అభ్యర్థలు ఉంటే ఓపెన్ కోర్టులో విచారణకు అనుమతిస్తారు. క్యూరేటివ్ పిటిషన్‌లను ఓపెన్ కోర్టులో లిస్ట్ చేయాలన్న పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గత ఏడాది అక్టోబర్ 9న కొన్ని టెలికాం కంపెనీల వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నేతలు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైఎస్సార్సీపీకి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఇరువురు ఒకరి తర్వాత ఒకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. గంటకు పైగా అన్ని అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. పవన్తో భేటీ అనంతరం బాలినేని మాట్లాడుతూ విశ్వసనీయత గురించి పదేపదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అసలు విశ్వసనీయత లేదని విమర్శించారు. జగన్ కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 17మంది పట్ల జగన్ ఎలాంటి విశ్వాసం చూపించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగానని పేర్కొంటూ…
వైసిపి పాలనలో తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కమీషన్ల కోసమే వైఎస్సార్సీపీ నేతలు లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే కాంట్రాక్టర్‌ను మార్చారని, గత ఐదేళ్లలో టీడీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డిడిబి క్యాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీపై అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి లడ్డు నాణ్యత అంశంపై తితిదే ఛైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఓవీ రమణ తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూకు ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్ను గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి దిల్లీకి చెందిన ఆల్ఫా అనే సంస్థకు ఇచ్చారని తెలిపారు. ఆల్ఫా…
నటి, పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో వారం రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. సెన్సార్ సర్టిఫికేట్ ఆ సినిమాకు లభించనందున ఇంతవరకు ఆ సినిమా విడుదలకు నోచుకోకుండా డోలాయమానంలో ఉంది. ‘ఎమర్జెన్సీ’ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. ఆ సినిమాను కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తీశారు. అయితే ఓ వర్గం ఈ చిత్రంపై ఆక్షేపణలు తెలుపుతూ మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సినిమాలో తమని తక్కువ చేసి చూపారని పేర్కొంది. మరోవైపు శిరోమణి అకాలీదళ్ కూడా చిత్రాన్ని అడ్డుకోవాలని సెన్సార్ బోర్డును కోరింది. అయితే సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ కంగనా రనౌత్, చిత్ర నిర్మాణ సంస్థ జీ ఎంటర్ టైన్మెంట్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని…