ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ కూడా దాఖలు చేయగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు అనుమతివ్వాలని కోరగా అందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే విచారణకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో తీహార్ జైలులోనే కవితను సీబీఐ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పటంపై కవితను సీబీఐ విచారించనుంది. మరోవైపు బుచ్చిబాబు ఫోన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా విచారించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టు…
Author: Editor's Desk, Tattva News
‘‘అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆరే ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యత వహించాలి. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, అందుకే ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరతామని తెలిపారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, గవర్నర్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఒకవైపు రాజకీయ లబ్ధి కోసం, మరోవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేసేందుకే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపించారు. రిటైర్డ్ అధికారిని…
చీర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ చీరను పలు రకాలుగా ధరిస్తూ వస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా విభిన్న శైలిలో ధరిస్తూ వస్తున్నారు. అయితే, చీరను ధరించడం ద్వారా క్యాన్సర్స్ సోకుతుందని తేలింది. భారతీయ మహిళలు చీర కట్టుకునే విధానంతో క్యాన్సర్ తదితర సమస్యల బారినపడుతున్నట్లుగా అధ్యయనం గుర్తించింది. ముంబయిలోని ఆర్‌ఎన్ కూపర్‌లాంటి హాస్పిటల్స్‌లో పరిశోధనలు జరిగాయి. చీరను కట్టుకోవడం ద్వారా స్క్వామస్ సెల్ కార్సినోమా (ఎస్ సి సి) ముప్పు పెరుగుతున్నది. చీర కట్టుకోవడం వల్ల వస్తున్న క్యాన్సర్‌ను చీర క్యాన్సర్‌గా భావిస్తున్నారు. ఇది భారతీయ మహిళల్లో వేగంగా విస్తరిస్తోంది. గత కొన్నేళ్లుగా చీర క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ‘ఓన్లీ మై హెల్త్’లో ఈ కథనం ప్రచురితమైంది. గ్రామీణ భారతంలో మహిళలు ఏడాది పొడువునా చీరలు ధరిస్తారని ఎస్‌సీపీఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదీప్ తెలిపారు. నడుముపై చీర…
ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో అగ్ని ప్రైమ్ అనే కొత్తతరం బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లో మోహరించిన అనేక శ్రేణి సెన్సార్ల డేటా ఆధారంగా ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్షాలను పూర్తి చేసిందని రక్షణశాఖ పేర్కొంది. ఈ ప్రయోగాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ , డిఆర్‌డిఒ , ఇండియన్ ఆర్మీ అధికారులు పర్యవేక్షించారు. ఈ అగ్నిప్రైమ్ పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డిఆర్‌డిఒ, ఎస్‌ఎఫ్‌సి, సాయుధ దళాలను అభినందించారు. ఇది సాయుధ దళాలకు అద్భుతమైన బలాన్ని అందించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలకు వ్యతిరేకంగా భారత్‌కు బలమైన శక్తిని ఇది అందిస్తుందని భావిస్తున్నారు. ఇది కొత్తతరం…
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ నర్మగర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయనున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. తాను పోటీ చేయాలని నిర్ణయించుకుంటే తమకే ప్రాతినిధ్యం వహించాలని అమేథీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఆయన విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి గెలిచిన వ్యక్తి గాంధీ కుటుంబంపై దాడి చేయడానికే పరిమితమై పోయారని, ప్రజల బాగోగులు, నియోజవకర్గ అభివృద్ధి గురించి ఆమెకు ఏమీ పట్టదని వాద్రా వ్యాఖ్యానించారు. అనేక ఏళ్లుగా రాయబరేలి (సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం), అమేథీ, సుల్తాన్‌పూర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం…
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో గురువారం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. తన కొడుకు పరీక్షలు ఉన్నందుకు బెయిల్ ఇవ్వాలని కవిత తరుపు లాయర్ కోర్టును కోరారు. ఏప్రిల్ 16వ వరకు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. లిక్కర్ పాలసీ ప్లాన్ చేసిందే కవిత అని, దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ఆటంకం కలుగుతుందని ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్లై, కవిత బినామిగా ఉన్నాడని, వీరికి ఇండో స్పిరిట్ lo 33 శాతం వాటా ఉందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఈడి తరుపు న్యాయవాది వాటిని కోర్టుకు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న రౌస్…
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని దాఖలైన పిటిషన్లను విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి, ఆప్ నేతలకు.. మరీ ముఖ్యంగా కేజ్రీవాల్‌కు భారీ ఉపశమనం లభించింది. అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా జైలు నుంచే ఢిల్లీ పరిపాలనను కేజ్రీవాలే చూస్తారని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముక్త కంఠంతో చెబుతుండగా, అలా కుదరదు అనే వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు ఏకంగా ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లను విచారణ చేసేందుకు అంగీకరించని ఢిల్లీ హైకోర్టు అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. దీంతో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారా? లేదా? అనే ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో ఆప్ కార్యకర్తల్లోని ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ మద్యం కేసులో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు మార్చి 21 వ తేదీన ఢిల్లీ…
బీహార్‌లో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్‌సభ టిక్కెట్లు దక్కకపోవడంతో 22 మంది నేతలు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రవీంద్ర సింగ్, అజయ్ కుష్వాహ, సంజయ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ డాంగి సహ పలువురు ప్రముఖ నేతలు ఉన్నారు. వీరంతా ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్ని లోక్‌సభ టిక్కెట్లను అమ్ముకున్నారని వారు మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకి కాకుండా బయటి వ్యక్తులకు టిక్కెట్లు ఎందుకు ఇచ్చారని మాజీ ఎంపి రేణు కుష్వాహా ప్రశ్నించారు. బయటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వడమంటే పార్టీలో సమర్థవంతులు లేరని అర్థమని, పార్టీలో కూలీలుగా పని చేయడానికి తాము సిద్ధంగాలేమని మండిపడ్డారు. తామంతా ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నామని…
అమెరికా సార్వత్రిక ఎన్నికలు నవంబర్ నెలలో జరుగనున్నాయి. తాజా ఓపినియన్ పోలింగ్ లో 7 రాష్ట్రాలలో ఆరింట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత డోనాల్డ్ ట్రంప్ కన్నా వెనుకబడి ఉన్నారు. దేశ ఆర్థిక తీరు తెన్నులపై ఓటర్లు చాలా నిరాశతో ఉన్నారు. పైగా బైడెన్ సమర్థత, ఉద్యోగాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సర్వేను నిర్వహించింది. పెన్సిల్వేనియా, మిచిగాన్, ఆరిజోనా, జార్జియా, నేవ్డా, నార్త్ కరోలినా … ఆరు రాష్ట్రాలలో ట్రంప్ 2.8 శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నారు. కాగా విస్కాన్సిన్ లో మాత్రం బైడెన్, ట్రంప్ కన్నామూడు పాయింట్లు ఆధిక్యతతో ఉన్నారు. రియల్ క్లియర్ పోలిటిక్స్ ప్రకారం ప్రధాన జాతీయ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటాపోటీ పోటీపడుతున్నారు. అయితే ట్రంప్ కేవలం 0.8 శాతం పాయింట్లతో కాస్త ముందున్నారు. ‘ది హిల్’ న్యూస్ పేపర్ బుధవారం ఆ ఇద్దరి…
మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికెట్ పై నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. నవనీత్ 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. అయితే, ఆమె నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు ఆరోపించారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని గుర్తించింది. ఈ మేరకు ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. అయితే, బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్…