కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన సీనియర్ నటి, ఎంపీ సుమలత అంబరీష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్న సుమలత అంబరీష్ త్వరలోనే బీజేపీ గూటికి వెళ్లనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తన అభిమానులు, నియోజకవర్గ సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించిన సుమలత ఈ ప్రకటన చేశారు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రకటన చేయని సుమలత అంబరీష్ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సుమలత అంబరీష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా సుమలత…
Author: Editor's Desk, Tattva News
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. రూ.9,69,296 ట్ల (116 బిలియన్ డాలర్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ జాబితా పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చితే 32 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. నాడు 83.4 బిలియన్ డాలర్లే. ఈ క్రమంలోనే భారత్‌లోనేగాక ఆసియా దేశాల్లోనే అపర కుబేరుడి రికార్డును ముకేశ్ అంబానీ ఈసారి కూడా నిలబెట్టుకున్నారు. అంతేగాక 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ, ఆసియా వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించారు. కాగా, ప్రపంచ ధనవంతుల్లో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. ఇక దేశీయ శ్రీమంతుల్లో రెండో స్థానంలో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఉన్నారు. 2023తో చూస్తే 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు ఈయన సంపద ఎగబాకింది. ప్రపంచ ర్యాంక్ కూడా 17గా ఉన్నది. నిజానికి…
మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ” ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ నోటీసులు పంపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వార్తలపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు.…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పిఠాపురంలో నాలుగు రోజులుగా ఎన్నికల ప్రహకారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంకు గురికావడంతో బుధవారం తన ప్రచారాన్ని అక్కడ ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు తెనాలిలో పవన్ వారాహి యాత్రకు ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా తెనాలి పర్యటనను వాయిదా వేసుకుని ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. పిఠాపురంలో తన ప్రచారం ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడ్డారు. దీంతో మధ్యలో ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు పిఠాపురం నుంచి తెనాలి వెళ్లాల్సి ఉండగా.. మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. జ్వరం తీవ్రత ఎక్కువగా…
చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 13 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బీజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌లో డీవీసీ మెంబర్ క్రాంతి ముచతోపాటు మరో కీలక సభ్యుడు పాపారావు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మావోయిస్టులు భారీ సంఖ్యలోనే గాయపడ్డట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని లెండ్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కాల్పుల పోరు జరిగింది. నక్సల్స్ కోసం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది తమపై…
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, బిఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సిఎం రేవంత్‌రెడ్డితో పాటు చేవెళ్ల ఎంపి అభ్యర్థి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల తర్వాత అయినా మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరమన్నారు. బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కెసిఆర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుందని చెబుతూ కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందన్నారు. 65 లక్షల రైతుల ఖాతాలో తాము రైతుబంధు…
ఈ ఏడాదిలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి. 1970 లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది భారత్‌లో కనిపించబోదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్‌లో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి.ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 02:22 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. అయితే, ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై, అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని కోట్లాది మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి. ఈ గ్రహణం మజాట్లాన్, మెక్సికో నుంచి న్యూఫౌండ్ ల్యాండ్ వరకు, అలాగే యునైటెడ్…
చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకుడు గెలువకూడదనే తాను కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఆమెను కడప లోక్ సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన వెంటనే కడపలో మీడియాతో మాట్లాడుతూ తన మరో బాబాయి కుమారుడు, ప్రస్తుత ఎంపీ, అన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడైన వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేయాల్సి రావడం పట్ల భావోద్వేగంకు గురయ్యారు. ఈ పోటీ కారణంగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, తన కుటుంభంలో చీలికకు దారి తీస్తుందని, పైగా నాన్న వైఎస్ అభిమానులను గందరగోళంకు గురిచేస్తోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. అయితే, చిన్నాన్న వైఎస్ వివేకానందాను హత్య చేయించిన వాళ్లను అన్న జగన్ వెనకేసుకొస్తున్నారని, హంతకులను కాపాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివేకాను చంపించిన అవినాష్ కు జగన్ టికెట్…
అధికార పక్షం కనుసన్నలలో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులపై వేటు వేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలు,…
సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న సంజయ్ సింగ్ గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో సోదాలను నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని నెలల పాటు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొన్నారు. గతంలో పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా, పీబీ వరలేతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల…