Author: Editor's Desk, Tattva News

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో = దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోయే దుస్థితి ఎందుకు వచ్చిందని  ప్రశ్నించారు.  రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించిన కేసీఆర్ రైతులను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం ధ్వజమెత్తారు.  నీరు, కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. రైతుల కష్టాలు చూస్తుంటే చాలా బాధగా అనిపించిందని…

Read More

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్ కె అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌కడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారత రత్న కోసం ఐదుగురు పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. శనివారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారత రత్న అవార్డులను ప్రదానం చేసింది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా అద్వానీ పాల్గొనలేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లి మళ్లీ భారత రత్నను రాష్ట్రపతి అందించారు. ‘ఎల్​కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం దక్కినందుకు ఆయనతో మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలపు…

Read More

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్రం జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించింది. ఆదివారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, ఆయన భద్రత కోసం 10 మంది సాయుధ సీఆర్పీఎఫ్ కమాండోలు ఉంటారని తెలిపింది. ఆదివారం 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేశ్‌ ఇంటికి చేరుకోనున్నారు.  శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేశ్‌కు ఈ మేరకు సమాచారం వచ్చింది. 2019కి ముందు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేశ్‌కు జెడ్‌ కేటగిరి భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది.  ఏవోబీలో మావోయిస్టుల ప్రభావం ఉండటం, చంద్రబాబు కుటుంబానికి వారి నుంచి పలుమార్లు హెచ్చరికలు, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేశ్‌కు గత ప్రభుత్వంలో పోలీసులు భద్రత పెంచారు.  అయితే, ఎన్నికల…

Read More

పిఠాపురం ప్రజలను అర్థిస్తున్నా.. నన్ను గెలిపించండి అని పేర్కొంటూ  ప్రజల కోసం నిలబడతానని.. తనను ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.పిఠాపురం నుండి పోటీచేస్తానని ప్రకటించిన ఆయన శనివారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. తనను ఓడించేందుకు ఏపీ సీఎం జగన్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.  తనను ఓడించేందుకు ఎంపీ మిథున్‌ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలానికో నాయకుడిని పెడుతున్నారని చెప్పారు.  పవన్‌ కళ్యాణ్‌ అంటే జవాబుదారీతనం అని భరోసా ఇచ్చారు. తాను మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కితీసుకోనని తెలిపారు. తనకు సినిమాలపై, రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు.  దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నానని చెబుతూ ఏపీలో నాణ్యత లేని మద్యం విక్రయించడం వల్లే చాలామంది చనిపోయారని ఆయన ఆరోపించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మద్యంపై…

Read More

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో వారిని జోక్యం చేసుకోకుండా కట్టడి చేస్తున్న ఎన్నికల సంఘం శనివారం మరో షాకిచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లపై భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్ధ వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదులు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కీలక ఆదేశాలు ఇచ్చింది.  హైకోర్టులో సిటిజన్ ఫర్ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్, దానిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. వాలంటీర్ల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోను ఈసీ ఆదేశించింది. వాలంటీర్లను రాష్ట్రంలో పెన్షన్ల సహా ఎలాంటి నగదుతో లింక్ ఉన్న సంక్షేమ పథకాల పంపిణీలోనూ…

Read More

మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపికైన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ తరఫున వారి వారసులు శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు తన తండ్రి తరఫున అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి స్వీకరించారు. చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డి) అధ్యక్షుడు జయంత్ చౌదరి అవార్డును అందుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ కుమారుడు రాంనాథ్ ఠాకూర్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతితోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ జనతా…

Read More

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన మరో ఢిల్లీ మంత్రి శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట హాజరయ్యారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ (49) జాఫ్‌గఢ్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అరివంద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో రవాణా, హోం, న్యాయ శాఖలను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆయన సెంట్రల్ ఢిల్లీలోని ఇడి కార్యాలయంలోకి ప్రవేశించడం కనిపించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు గెహ్లాట్‌ను ఇడి పిలిపించినట్లు వర్గాలు తెలిపాయి. పిఎంఎల్‌ఎ చట్టం కింద గెహ్లాట్ వాంగ్మూలాన్ని ఇడి నమోదు చేసినట్లు వారు చెప్పారు. 2021-22 సంవత్సరానికి కొత్త లిక్కార్ పాలసీని రూపొందించి, అమలు చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)లో గెహ్లాట్ కూడా ఉన్నారు. జిఓఎంలో ఆయనతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఉన్నారు. …

Read More

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా మంది నేతలు తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలో ఇప్పటికే చేరారు. మరికొందరు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు.  ఈ నేపథ్యంలో నేతల జంపింగ్‌లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం కీలక వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఖాళీ అవుతాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. వారు కూడా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే…

Read More

బెంగళూరు బాంబు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం ఇద్దరు అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. . ‘ఎక్స్‌’లో నిందితులు ఇద్దరి ఫొటోలు, వివరాలను శుక్రవారం ఫోస్టు చేసింది. ముస్సావీర్‌ హుసేన్‌ షాబిన్‌ (30), అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌ తాహా (30) ఆచూకీ చెప్పాలని కోరింది. వారి వివరాలను ప్రకటించింది. ఇద్దరి ఆచూకీ తెలిపితే తలా రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఆచూకీ తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది . ఇద్దరు అనుమానితులు ముసావిర్ హుస్సేన్ , అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలలు ఇప్పుడు ఎన్ఐఏ వాంటెడ్ జాబితాలో చేరారు. ఈ ఇద్దరు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు కుట్ర పన్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. ఫరారీలో ఉన్న ఈ ఇద్దరి జాడకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు…

Read More

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు ముమ్మరంగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ గురించి కీలక ఆదేశాలు జారీ చేస్తూ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 రాత్రి 7:30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్‌లను ప్రచురించడం చేయోద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా వివిధ దశల్లో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయంతో ముగిసే 48 గంటల వ్యవధిలో ఏదైనా ఎలక్ట్రానిక్…

Read More