Author: Editor's Desk, Tattva News

బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ లోనే ఫిలిబిత్‌ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఈ పర్యాయం ఆయనకు బిజెపి సీటు నిరాకరించి, కాంగ్రెస్ నుండి వచ్చిన యుపి మంత్రి జితిన్‌ ప్రసాదను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన మౌనం పాటిస్తున్నారు. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు.  దానితో వరుణ్ గాంధీ పార్టీ నిర్ణయానికి తలవంచి ఎన్నికలకు దూరంగా ఉంటారా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? మరేదైనా పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తారా? అనే ప్రశంలు తలెత్తుతున్నాయి. మరోవైపు వరుణ్‌ గాంధీ తల్లి మేనకా గాంధీకి మాత్రం బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. యూపీలోని సుల్తాన్‌పుర్‌ నుంచి మరోసారి బరిలోకి దింపింది. గత నాలుగు పర్యాయాలుగా ఫిలిబిత్‌ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తూ వస్తున్నది. దాదాపు మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నది. వరుణ్ గాంధీ ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా…

Read More

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ భారీ కంటేన‌ర్ బోటు ఢీకొట్ట‌డంతో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌టాప‌స్కో న‌దిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను ఓ భారీ నౌక ఢీకొట్టింది. సింగ‌పూర్ జెండాతో ఆ నౌక ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలిసింది.  ఆ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. నౌక ఢీకొన్న స‌మ‌యంలో గల్లంతైన వారు మృతిచెంది ఉంటార‌ని భావిస్తున్నారు. నౌక ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప‌వ‌ర్ పోయింద‌ని, దాంతో ఆ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బంది సుర‌క్షితంగా ఉన్నారు. బ్రిడ్జ్‌పై రిపేర్ వ‌ర్క్ చేస్తున్న ఆరుగురు గల్లంతైన్నట్లు గుర్తించారు. అయితే, ప్రధాన వంతెనను ఢీకొట్టి కింద నదిలో పడిపోయిన కార్గో నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా సిబ్బందిలో ఎవరికీ ఎలాంటి గాయాలు…

Read More

* 12 మంది సైనికుల మృతి? పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నేవల్ ఎయిర్‌స్టేషన్‌ పీఎన్ఎస్ సిద్ధిఖ్‌పై గతరాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది భద్రతాధికారులు మరణించినట్టు తెలుస్తున్నా స్పష్టత లేదు. దాడితో అప్రమత్తమైన సైనికులు, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఎయిర్ స్టేషన్‌కు ఎలాంటి నష్టమూ జరగలేదని, ముష్కరులు లోపలికి వస్తుండగానే మట్టుబెట్టామని అధికారులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ) ప్రకటించింది. తమ కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులు మరణించారని పేర్కొంది. ఈ నెల 20న గ్వాదర్ పోర్టుపై దాడికి పాల్పడిన తీవ్రవాదులు అంతలోనే నేవీ ఎయిర్‌స్టేషన్‌పై దాడికి దిగారు. గ్వాదర్‌పై జరిగిన దాడి ఘటనలో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. బలూచిస్థాన్‌‌కు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టడమే లక్ష్యంగా పలు గ్రూపులు పనిచేస్తున్నాయి. అందులో బీఎల్ఏ ఒకటి. దీనిని…

Read More

లిక్కర్ కేసులో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. 10 రోజుల కస్టడీ ముగియడంతో ఇడి అధికారులు మంగళవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చారు. కవితను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరారు ఇడి అధికారులు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. దీంతో రిమాడ్ కు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. మరోవైపు, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్లు ఢిల్లీ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. కాబట్టి…

Read More

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ మొత్తం వ్యవహారం అప్పటి ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్ లాంటి కొన్ని ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల్ని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు పోలీస్ దర్యాప్తులో వెల్లడించారు. ఎస్‌ఐబీ మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు వెల్లడించిన వివరాల ఆధారంగా శనివారం అరెస్టయిన భూపాలపల్లి అడిషనల్ ఎస్‌పి భుజంగరావు, హైదరాబాద్ సె క్యూరిటీ విభాగం అడిషనల్ డిసిపి తిరుపతన్నలను ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వీరిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 6 వరకు వీరికి రిమాండ్ విధించగా, అనంతరం పోలీసులను వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొంపల్లి మెజిస్ట్రేట్ నివాసం వద్ద నిందితుల తరఫు అడ్వకేట్ రాజేందర్ మాట్లాడుతూ భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు రెండు…

Read More

దశాబ్దాలపాటు రెండు రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను ఎట్టకేలకు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. వీరప్పన్ గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీరప్పన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వీరప్పన్ రెండో కుమార్తె విద్యా రాణి వీరప్పన్ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె సోమవారం తన నామినేషన్ కూడా దాఖలు చేశారు. విద్యా రాణి తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.  విద్యారాణి 2020లో బీజేపీలో చేరి, ఆమె రాష్ట్ర ఓబిసి విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఆమె తాజాగా నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే)లో చేరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి స్థానంలో కూడా పోటీ చేస్తుంది.  విద్యా రాణి మూడో తరగతి చదువుతున్న సమయంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని…

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 2014 నుంచి 2022 వరకు రూ. 133.54 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఖలిస్తానీ గ్పూలు అందచేసినట్లు ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నున్ ఆరోపించాడు. ఇందుకు బదులుగా 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో దోషిగా తేలి జైలుపాలైన ఖలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్‌సింగ్ భుల్లర్‌ను విడుదల చేయిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారని పన్నున్ ఆరోపించాడు.  ఇందుకు సబంధించిన పన్నున్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. సిక్కు వేర్పాటువాద నాయకుడైన పన్నున్ గతంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశాడు.  పార్లమెంట్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపులకు ఆపల్పడ్డాడు. అయితే పన్నున్ హత్యకు భారత్ కుట్ర పన్నినట్లు అమెరికా గతంలో ఆరోపించింది. ఈ కుట్ర వెనుక భారత గూఢచారి ఏజెంట్లు ఉన్నట్లు తమ అంతర్గత దర్యాప్తులో తేలినట్లు కూడా…

Read More

బిజెపి 111 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఐదవ జాబితాలో కొందరు కేంద్ర మంత్రులు, సిట్టింగ్‌ ఎంపీలకు చోటు దక్కలేదు. కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, వీకే సింగ్‌కు టికెట్లు నిరాకరించింది. అలాగే పార్టీ సీనియర్ నేత వరుణ్‌ గాంధీ సహా 37 మంది సిట్టింగ్‌ ఎంపీలను బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టింది.  జాబితాలో ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు టికెట్లు లభించాయి. ఇటీవల కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డేకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన ఇప్పటి వరకు ఆరు సార్లు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆయన రాజ్యాంగం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అగ్రనాయకత్వం ఆయనకు టికెట్‌ను నిరాకరించినట్లు తెలుస్తున్నది.  ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా తొమ్మిది మందికి బీజేపీ టికెట్‌ నిరాకరించింది. గుజరాత్‌లో ఐదుగురు, ఒడిశాలో నలుగురు, బిహార్‌, కర్ణాటక, జార్ఖండ్‌లో ముగ్గురు చొప్పున మొత్తంగా 37…

Read More

మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భస్మ హారతి జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కనీసం 14 మంది పూజారులకు గాయాలయ్యాయి.  గర్భగుడిలో ప్రమాదం జరగడంతో లోపల ఉన్న పూజారులు తప్పించుకోవడం కష్టమైంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు జిల్లా కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. గాయపడినవారిలో ప్రధాన అర్చకుడు సంజయ్ గురు సహా పలువురు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  లోపలి నుంచి ఒక్కసారిగా వారంతా పరుగెత్తుకుని బయటకు వచ్చారు. బయట ఉన్నవారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. హోలీ వేడుకలు చేసుకుంటున్న సమయంలో ప్రమాదం జరగడంతో పరుగులు తీశారు. ఇప్పటి…

Read More

జనసేన పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల జాబితాను శనివారం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. పొత్తులో భాగంగా 21 సీట్లు ఆ పార్టీకి కేటాయించగా, అందులో 18 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను వెల్లడించింది. మిగిలిన అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ ఖరారైన విషయం తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసే అభ్యర్ధి పేరుపిఠాపురం పవన్‌కల్యాణ్‌నెల్లిమర్ల లోకం మాధవిఅనకాపల్లి కొణతాల రామకృష్ణకాకినాడ రూరల్‌ పంతం నానాజీరాజానగరం బత్తుల బలరామకృష్ణతెనాలి నాదెండ్ల మనోహర్‌నిడదవోలు పెందుర్తి కందుల దుర్గేష్‌పంచకర్ల రమేష్‌బాబుయలమంచిలి సుందరపు విజయ్ కుమార్‌పి.గన్నవరం గిడ్డి సత్యనారాయణరాజోలు దేవ వరప్రసాద్‌తాడేపల్లిగూడెం బలిశెట్టి శ్రీనివాస్‌భీమవరం పులవర్తి ఆంజనేయులునరసాపురం బొమ్మిడి నాయకర్‌ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజుపోలవరం చిర్రి బాలరాజుతిరుపతి ఆరణి శ్రీనివాసులురైల్వే కోడూరు యనమల భాస్కరరావు

Read More