రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది. మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి దూసుకెళ్లిన ఆగంతకులు.. కాల్పులకు తెగబడ్డారు. అనంతరం మొత్తం హాల్కే నిప్పంటించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. 100మంది గాయపడ్డారు. మాస్కోలో దాడి తమ పనేనని టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘క్రీస్టియన్స్తో కూడిన భారీ సమూహంపై దాడి చేశాము,’ అని ఓ ప్రకటన విడుదల చేసింది ఇస్లామిక్ స్టేట్. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, రష్యాపై మరింత పట్టు సాధించిన కొన్ని రోజులేక ఈ దాడి జరగడం గమనార్హం. మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. రష్యాన్ రాక్ బ్యాండ్ ‘పిక్నిక్’ ప్రదర్శనని చూసేందుకు ప్రజలు వెళ్లారు. ఇంతలో ఆగంతుకులు హాల్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఆ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. చివరికి.. పేలుడు…
Author: Editor's Desk, Tattva News
తెలుగుదేశం పార్టీ శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్ నాయకులకు చోటుదక్కలేదు. అయితే, ఈ జాబితాలో తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు బాపట్ల పార్లమెంటు సీటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బిజెపి- టీడీపీ- జనసేన కూటమి సీట్ల పంపకంలో భాగంగా బిజెపికి 6 ఎంపీ సీట్లు కేటాయించారు. అయినప్పటికీ బాపట్ల సీటును బిజెపి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్‌కు కేటాయించడం పట్ల టిడిపి వర్గాలలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఆంధ్రాలోని టిడిపి నేతలకు కాకుండా తెలంగాణలోని బిజెపి నేతకు ఎంపీ టిక్కెటు ఇవ్వడం ఏంటని బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కృష్ణప్రసాద్ బిజెపి టికెట్‌ను ఆశించినా, అప్పుడు టికెట్ దక్కలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనైనా వరంగల్ సీటు వస్తుందనే ఆశతో వున్న ఆయనకు అనూహ్యంగా బాపట్ల సీటు…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగుమమైంది. 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీని తిరిగి కోర్టులో హాజరుపరచాలని సూచించింది. ఆయన్ని పూర్తిగా కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నేను జైలులో ఉన్న బయట ఉన్న నా జీవితం దేశానికి అంకితం” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం…
రానున్న ఎన్నికల్లో ఒడిశాలో బిజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ తెలిపారు. ఒడిశాలోని మొత్తం 21 లోక్ సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలుగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సమల్ కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని మన్మోహన్ సమల్ ట్విటర్ (గతంలో ఎక్స్) లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, ఒడిశాలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నామని సమల్ వ్యాఖ్యానించారు. ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశలు,…
ఇటీవలి రాజ్యసభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా వోటు వేసిన ముగ్గురు స్వతంత్ర ఎంఎల్‌ఎలు తమ రాజీనామా పత్రాలను శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. వారు ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ సుఖ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాము బిజెపిలో చేరతామని, పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తామని వారిలో ఒకరు విలేకరులతో చెప్పారు. ముగ్గురు ఎంఎల్‌ఎలు ఆశిష్ శర్మ (హమీర్‌పూర్), హోషియార్ సింగ్ (దెహ్రా), కెఎల్ ఠాకూర్ (నాలాగఢ్) శుక్రవారం సిమ్లా చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్, ఇతర బిజెపి ఎంఎల్‌ఎలు వెంట రాగావారు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి యశ్ పాల్ శర్మకు అందజేశారు. ‘మేము రాజీనామాలు సమర్పించాం. బిజెపిలో చేరిఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తాం’ అని హోషియార్ సింగ్ విలేకరులతో చెప్పారు. ఆ ముగ్గురు 2022 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి టిక్కెట్లు కోరారు. కాని టిక్కెట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్…
దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ విమానం తరహా రెక్కలు ఉన్న..) రాకెట్ పుష్పక్‌ను ఇస్రో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోగల ఏయిరోనాటికల్ టెస్టింగ్ రేంజ్‌లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వేపై ల్యాండైంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు. అంతరిక్ష రంగంలో సుస్థిరత, వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్. అంటే..పీఎస్‌ఎల్‌వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇందులో అత్యాధునిక ఎక్స్-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్‌బెడ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్, ఆధునికీకరించిన డీసీ-ఎక్స్ఏ ఫ్లైట్ డెమాన్‌స్ట్రేటర్ ఉన్నాయి. పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయింది. దీంతో,…
ఏపీలో భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం కావడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో భారీ ఎత్తున కొకైన్ దొరకడం కలకలం రేపుతోంది. డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్‌ను తరలిస్తుండగా అధికారులు ఈ కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్‌పోల్ ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖపట్నం పోర్ట్‌లో ఈ మత్తు పదార్థాలను పట్టుకున్నారు. కొకైన్‌ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.…
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు గురువారం రాత్రి ఎఐసిసి విడుదల చేసింది. మొత్తం 57 మంది అభ్యర్థులను ఈ జాబితాలో చోటు దక్కిం ది. ఎఐసిసి విడుదల చేసిన ఈ జాబితా లో తెలంగాణకు చెందిన ఐదుగురు పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా స్థానాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ క ర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్‌రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ జాబితా విడుదల చేశారు. మొదటి విడతలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రెండో విడతలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తుండడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…
నాటకీయ పరిణామాల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో అరెస్లు చేసింది. నిలిపేసిన మద్యం పాలసీ అవినీతి కేసులో ఇడి బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో దీనిపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇంతలోనే ఇడి అధికారుల బృందం అయిదు బస్సుల నిండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్)ను వెంటేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, ఆయన నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఆ వెంటనే ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతికి గురైన ఆప్ శ్రేణులు ఇది చర్యపై ఆగ్రహిస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు నగరమంతటా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు.…
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి, తిరిగి బీజేపీలో చేరిన తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు 9 మందితో తాజాగా విడుదల చేసిన బీజేపీ మూడో జాబితాలో తమిళిసైకి చోటు కల్పించారు. తమిళిసైతోపాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై పేరు కూడా ఆ జాబితాలో ఉంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. తాజాగా మరో జాబితాను కూడా ప్రకటించి ఎన్నికల సమరంలో ప్రత్యర్థుల కంటే ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రులు, ఇతర కీలక నేతలు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. తమిళనాడు నుంచి 9 మంది లోక్‌సభకు పోటీ చేసేవారికి సంబంధించిన జాబితాను తాజాగా బీజేపీ ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. తమిళనాడులోని చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ…