Author: Editor's Desk, Tattva News

పాకిస్థాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు మూసుకుపోయాయి. ముఖ్యంగా వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో వర్షాలకు బీభత్స పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రావిన్స్‌లో చనిపోయిన 27 మందిలో చాలామంది చిన్నారులే. బజౌర్, స్వాత్, లోయర్ దిర్, మలకండ్ , ఖైబర్, పెషావర్ , నార్త్, సౌత్ వజిరిస్థాన్,చ లక్కిమార్వట్, తదితర 10 జిల్లాల్లో 37 మంది గాయపడ్డారు. వర్షబాధిత ప్రజలను ఈ క్లిష్టసమయంలో విడిచిపెట్టమని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, వారు నష్టపోయిన ఆస్తులకు సంబంధించి నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి కెపికె అలి అమీన్ గండపుర్ చెప్పారు. కోస్తా తీర పట్టణం గ్వాడర్‌ను వరదలు ముంచెత్తడంతో వాయువ్య బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో మొత్తం ఐదుగురు చనిపోయారు. అధికార యంత్రాంగం బోట్లు ఉపయోగించి అక్కడి ప్రజలను ఖాళీ చేయించింది. వరద…

Read More

దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తొలి విడత జాబితాలో పేరు లేకపోవడంతో మరుసటి రోజే ఆయన ఈ ప్రకటన చేశారు. ఆయన స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో నిరాశకు గురైన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీ గౌతమ్‌ గంభీర్‌, హజారీభాగ్‌ ఎంపీ జయంత్‌ సిన్హా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించాలని కోరారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ సైతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. డాక్టర్‌ హర్షవర్ధన్‌ దాదాపు 35 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో కొనసాగారు. మొత్తం ఐదుసార్లు అసెంబ్లీ, రెండుసార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చోటీ గెలుపొందారు. దాంతో పాటు…

Read More

పాలస్తీనాలోని గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆకలితో ఎదురుచూస్తున్న గాజాలోని అమాయక ప్రజలకు సాయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది.  విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తామని అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గాజాలోని అమాయక ప్రజలకు సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.  ఆహార ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా గాజాలో ఎయిడ్‌ డ్రాప్‌ చేయనున్నట్లు  బైడెన్‌ తెలిపారు. కాగా, పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్‌ ఆర్మీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. నబుల్సి రౌండ్అబౌట్ వద్ద సహాయ సామగ్రి లారీల కోసం వేచి ఉన్న ప్రజలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం…

Read More

త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ 195 మందితో ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకటించిన అభ్యర్థుల్లో సిట్టింగ్ లే ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పేరును ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పేరును ప్రకటించారు. అర్వింద్ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి కిషన్ రెడ్డి మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఆయన కూడా సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరును ప్రకటించారు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ మధ్యే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  ఇక నాగర్ కర్నూల్ అభ్యర్థిగా భరత్ పేరును ప్రకటించారు. భరత్ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న…

Read More

తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీని (ఐఐహెచ్‌టీ) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐఐహెచ్‌టీతో జౌళీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.  ఐఐహెచ్‌టీతో రాష్ట్ర విద్యార్థులకు కోర్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో చేనేత, జౌళి పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏళ్లుగా సంప్రదాయ పద్ధతులను నమ్మకొని మగ్గాలపై చీరెలు, చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనేత సాంకేతిక కోర్సుల వైపు చూస్తుండగ రాష్ట్రంలో కోర్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీకి పేరుంది. విద్యకు ఐఐటీ మాదిరిగా చేనేతకు ఐఐహెచ్‌టీని పరిగణిస్తుండగా ఇందులో కోర్సులకు మంచి డిమాండ్‌…

Read More

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 543 స్థానాల లోక్‌సభలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్‌షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. 34 మంది కేంద్ర మంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేతలు ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే విడుదల చేశారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 195 స్థానాలకు అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఖరారు చేసినట్టు తావడే తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేధీ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్…

Read More

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ శంఖారావం పూరించనున్నారు. ఈనెల 4, 5 తేదీల్లో తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో ఆదిలాబాద్, పటాన్ చెరు వేదికగా రూ. 15,718 కోట్ల విలువ గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నట్లు వెల్లడించారు. మార్చి 4వ తేదీన ఉ.9 గం.లకు ఆదిలాబాద్ స్టేడియంలో జరిగే విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాల గురించి ప్రజలకు వివరిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న విజయ సంకల్ప బహిరంగ సభల్లో రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు…

Read More

బెంగాల్ సీఎం దీదీ ప్ర‌తి ప‌థ‌కాన్ని స్కామ్ గా మార్చిదని ప్ర‌ధాని నరేంద్ర మోదీ మండ్డిప‌డ్డారు. ఆమె వ‌ల్ల బెంగాల్ ప్రతిష్ట దిగజారిదని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్లోని కృష్ణ‌నగర్లో నేడు బీజేపీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌పై నిప్పులు చెరిగారు.  ప్రతి పథకాన్ని స్కామ్‌గా మార్చారని, తమ‌ స్కీములపై స్టిక్కర్ వేసి వారివ‌ని చెప్పుకుంటున్నారని చెబుతూ తాము పేదలకు ఇచ్చే ప్ర‌తిదానిని లాక్కోవడానికి వెనుకాడ‌టం లేద‌ని ధ్వజమెత్తారు.  ‘మా, మాతి, మనుష్’ నినాదాన్ని ఉపయోగించి తృణ‌మూల్ ప్రభుత్వం బెంగాల్ మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంద‌ని ప్ర‌ధాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇప్పుడు ఈ మ‌హిళ‌లంద‌రూ దీదీ పాలనా విధానంపై అసంతృప్తితో ఉన్నార‌ని చెబుతూ సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు న్యాయం చేయాలని కోరుతూనే ఉన్నార‌ని, అయినప్పటికీ ప్రభుత్వం వారి విన్నపాలను వినడంలేద‌ని వివ‌రించారు. బెంగాల్‌లో, ఒక నేరస్థుడిని ఎప్పుడు అరెస్టు చేయాలో పోలీసులు నిర్ణయించర‌ని అంటూ నేరస్థుడే…

Read More

తెలంగాణాలో రైతు కమిషన్, విద్యా కమిషన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, త్వరలో నే ఈ రెండు కమిషన్‌ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నామని, కుల, మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమని చెప్పారు. పౌరసమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, రమ మేల్కొటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదె ఇన్నయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పౌర సమాజం ప్రతినిధులతో సిఎం రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌక్ ను…

Read More

పాలస్తీనీయులను చంపేందుకు ఇజ్రాయిల్‌కు లైసెన్స్‌ ఇచ్చింది అమెరికాయేనని ఐక్యరాజ్య సమితికి చెందిన మూడు సంస్థలు విమర్శించాయి. పాలస్తీనీయులకు మానవతా సాయం అందకుండా చేయడం, కాల్పుల విరమణకు అడ్డు పడడంలో ఇజ్రాయిల్‌కు ఎంత పాత్ర ఉందో, అమెరికాకు కూడా అంతే పాత్ర ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి), మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసిహెచ్‌ఎ), ఆహార, వ్యవసాయక సంస్థ (ఎఫ్‌ఎఓ) చెప్పాయి. గాజాలో తాజా పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)కి ఈ సంస్థలు ఇచ్చిన రిపోర్టులో ఈ మేరకు అభిప్రాయపడ్డాయి. గుయానా, స్విట్జర్లాండ్‌, అల్జీరియా, స్లొవేనియా అభ్యర్థన మేరకు ఐరాస భద్రతా మండలి దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గాజాలో మొత్తం 22 లక్షల మంది పాలస్తీనీయులకు గాను చాలా మంది ఇప్పటికే ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిపోగా, మిగిలినవారిలో 5 లక్షల మంది ఇప్పుడు తీవ్రమైన క్షామాన్ని ఎదుర్కొంటున్నారని డబ్ల్యుఎఫ్‌పి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కార్ల్‌ స్కువా…

Read More