Author: Editor's Desk, Tattva News

రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్‌ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల విలువ రూ.127.81కోట్లుగా ఉందని ఏడీఆర్‌ తెలిపింది.  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 59 మంది అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్నారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థి జీసీ చంద్రశేఖర్ అఫిడవిట్‌ మాత్రం విశ్లేషించలేకపోయారు.  స్కాన్ చేసిన పత్రాలు చదవడం సాధ్యం కాలేదని.. దాంతో 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను మాత్రమే పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది.  ఇందులో 36శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 17శాతం మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ అభ్యర్థిపై హత్యాయత్నం ఆరోపణలున్నాయి.   ఆ విశ్లేషణ ప్రకారం, 30 మంది బిజెపి అభ్యర్థులలో ఎనిమిది (27 శాతం) మంది, తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థులలో ఆరుగురు…

Read More

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూల్ జిల్లాకు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసు విషయంలో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు లేనందున ఆమె మరణానికి కారణమైన అధికారిపై క్రిమినల్‌ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్‌ స్టేట్‌లోని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ప్రకచింది. ఈ తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించిన్నట్లు సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది. ”దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్‌ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్‌ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం” అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు, ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్‌ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై…

Read More

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరున్న మనోజ్ రాజ్‌పుత్ అత్యాచారం కేసులో శనివారం అరెస్ట్ అయ్యాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 13 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని 29 ఏళ్ల బాధితురాలైన దగ్గరి బంధువు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్‌లు దుర్గ్ జిల్లా లోని రాజ్‌పుత్ ఆఫీస్‌లోనే అరెస్ట్ చేశారు. ఈ నెల 22న బాధితురాలు ఓల్డ్ భిలాయి రైల్వే పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ముందుగానే తనతో లైంగికంగా 2011 నుంచి కార్యకలాపాలు సాగించడం ప్రారంభించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే మాట ప్రకారం పెళ్లి సంగతి ఎత్తకపోవడంతో ఆమె పోలీస్‌లను ఆశ్రయించిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజ్‌కుమార్ బోర్ఝా చెప్పారు. అత్యాచారం, అసహజ లైంగిక కార్యకలాపాలు, నేరపూరిత బెదిరింపులు, ఇతర నేరాల కింద అతనిపై కేసు దాఖలైంది. బాధితురాలిపై లైంగిక దాడి ప్రారంభమైనప్పుడు మైనర్ కావడంతో పోక్సో చట్టాన్ని కూడా నిందితుడిపై నమోదు…

Read More

బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్‌పిసి) స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలుజులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశ క్రిమినల్ జసిస్సిస్టమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసే కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో కొత్త చట్టాలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం పొందుపరిచింది. భారతీయ సాక్ష సంహిత, 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023 బిల్లును పార్లమెంట్ గత ఏడాది డిసెంబర్ 21న ఆమోదించింది. గత ఏడాది డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో ఈ బిల్లులు చట్ట…

Read More

టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేన.. ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఈ జాబితాను ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. బిజెపితో పొత్తు విషయమై స్పష్టత వచ్చిన తరువాత రెండో జాబితాను విడుదల చేయనున్నారు. మాఘ పౌర్ణమి శుభదినాన శుభ ముహూర్తంలో టిడిపి-జనసేన పార్టీలు ఎన్నికల్లోకి వెళ్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దని, విజయంలో 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 24 అసెంబ్లీ సీట్లతో పాటు.. 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే.. మొత్తంగా రాష్ట్రంలోని…

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బి ఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను సిబిఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సిబిఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బి ఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను సిబిఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సిబిఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే కవితను సిబిఐ మూడుసార్లు ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఎ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో సిబిఐ హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను విచారణ చే సి, ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్న సంగతి…

Read More

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 13 తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే షెడ్యూల్‌ విడుదల కానుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తరవాత యూపీ, జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది. వ‌చ్చే నెల‌ మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకుని ఆ వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది ఈసీ. రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వరుస భేటీలు నిర్వహించి.. పలు ప్రాంతాల్లోని సమస్యలు, ఈవీఎమ్‌లు తరలించేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఇతరత్రా భద్రతా పరమైన సమస్యలపై చర్చిస్తొంది. ఇక‌, ఈ సారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం…

Read More

* రాహుల్ కు మతి చెడిందా? వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్‌ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే ‘మోదీ గ్యారంటీ’ అని అభివర్ణించారు. వారణాసి పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో భాగంగా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘కాశీ.. ఇప్పుడు వారసత్వం, అభివృద్ధికి నమూనాగా కనిపిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ ఆధునికత ఎలా అభివృద్ధి చెందిందో యావత్‌ ప్రపంచం చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి చిహ్నంగా భారత్‌ మారుతుంది. ఇదే మోదీ గ్యారంటీ’ అని ప్రధాని పేర్కొన్నారు. బనారస్‌ విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉందన్న ఆయన అమృత్‌ కాల్ వేళ వారు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారనే విశ్వాసం కలుగుతోందని తెలిపారు. కాశీకి ఇంతకుముందున్న సామర్థ్యం, రూపం నేడు మళ్లీ ఆవిష్కృతమవుతోందని ప్రధాని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా వారణాసి పార్లమెంట్‌ నియోజకవర్గంలో రూ.13వేల కోట్లతో…

Read More

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార వైసిపిని ఓడించేందుకు ఒక వంక టిడిపి, జనసేన, బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండగా, మరోవంక ఎపిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన వైఎస్ షర్మిల నోటాకు మించి ఓట్లు లేని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం వామపక్షాలతో జత కట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. టిడిపి, జనసేన కూటమితో పొత్తుకోసం మొన్నటి వరకు ప్రయత్నం చేసిన వామపక్షాలు, ఇప్పుడు ఆ కూటమిలో బీజేపీని చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో తమ రాజకీయ మనుగడకోసం అంతర్మధనంలో పడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికలలో కూడా ఏపీలో ఒక్క సీటు కూడా గెలుపొందలేని వామపక్షాలు ఇప్పుడు సొంతంగా నిలబడి బలమైన పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేవు. అందుకనే కాంగ్రెస్ తో పొత్తుకోసం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. `చలో సెక్రటేరియట్’ ఉద్యమం సందర్భంగా అరెస్ట్ అయినా షర్మిలకు రెండు వామపక్షాలు సంఘీభావం తెలిపారు.…

Read More

జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది.  అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది.  ముందుగా ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది ‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి…

Read More