తీవ్ర రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచినా కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవిని చేపట్టనున్నట్టు పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో ప్రకటించారు. మంగళవారం అర్దరాత్రి షరీఫ్, బిలావల్ భుట్టోలు అత్యవసరంగా సమావేశమై సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఒప్పందం ప్రకారం ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీ ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. దేశంలో ఉన్న అంతర్గత సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సంఖ్యాబలం ఉందని బిలావల్ ప్రకటించారు. దీంతో రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు త్వరలో తెరపడనుంది. ఫిబ్రవరి…
Author: Editor's Desk, Tattva News
మానవ సహిత అంతరిక్ష పరిశోధనల దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. ఈ ఇంజిన్‌కు సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇస్రో ఈ ప్రయోగం ద్వారా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. వ్యోమగాములను దాదాపు 400 కి.మీ. ఎత్తైన కక్ష్యలోకి చేర్చి.. తిరిగి వారిని భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలి. ఈ ప్రయోగం 3 రోజుల పాటు జరుగనుంది. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది.మహేంద్ర గిరి లోని ఇస్రో లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. మొత్తం నాలుగింటిని 39 సార్లు మండించి, వాటి పనితీరును అంచనా వేశారు. ఇది దాదాపు 8810 సెకన్ల పాటు జరిగింది. వాస్తవానికి ప్రమాణాల ప్రకారం 6,350 సెకన్లు మండిస్తే చాలు.…
లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాద్ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. ”కలిసే ఉన్నాం” అంటూ అఖిలేష్ ప్రకటించడంతో పొత్తులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది. ఒక స్థానంలో చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ”భారత్ జోడో న్యాయ్ యాత్ర”లో ఉన్న రాహుల్‌తో తొలుత మాట్లాడిన ప్రియాంక ఆవెంటనే అఖిలేష్‌తో మాట్లాడి ప్రతిష్ఠంభన తొలగించారని, ఏఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై త్వరలో తుదిరూపు ఇవ్వనున్నారని ఆ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ 19 సీట్ల కోసం పట్టుబట్టగా, తొలుత 11 ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ…
వైసీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. తన మనసులోని మాటను బహిరంగంగానే బయటపెట్టారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఎంపీ సీటుపై భరోసా రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఆయనతో పాటు సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా పాలకమండలి అధ్యక్షరాలి పదవికి…
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క- సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళగా భావించే మేడారం మహాజాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది. జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ…
రాబోయే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో డబల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. సమక్క జాతర సందర్భంగా భద్రకాళి కాకతీయ యాత్రను ఈనెల 25వ తే దీకి వాయిదా వేశారు. విజయ సంకల్ప యాత్రలను ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరై స్థానిక నాయకులతో జెండా ఊపి ప్రారంభించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమలనాథులు 10 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మరోసారి అధికారం అప్పగించాలని ఓటర్లను కోరుతున్నారు. అందులో భాగంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈయాత్రలు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు, 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 5,500 కిలోమీటర్లు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు ఉంటాయని ఆపార్టీ…
ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. భారత న్యాయరంగంలో మహోన్నత వ్యక్తి అయిన నారిమన్ న్యాయవాద ప్రతిభ, న్యాయవాద వారసత్వాన్ని వదిలితన 95 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. గొప్ప న్యాయవాదిగా పేరొందిన ఆయనకు భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఫాలీ ఎస్ నారిమన్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్ లోని పార్సీ కుటుంబంలో జన్మించారు. బాంబే హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 38 ఏళ్ల వయసులో హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. …
ప్రకాశం జిల్లా ఒంగోలులో కత్తిపోట్ల కలకలం రేగింది. తెలుగు రైతు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఒంగోలులోని జిమ్స్ ఆస్పత్రిలో శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. దాడి అనంతరం శ్రీనివాసరెడ్డిని సంఘమిత్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాసరెడ్డిపై ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒంగోలులోని జయరాం సెంటర్లో ఉన్న జిమ్స్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడు రామచంద్రారెడ్డితో శ్రీనివాసరెడ్డికి ఆర్థిక పరమైన లావాదేవీలలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీటిపై చర్చిద్దామని శ్రీనివాసరెడ్డిని ఆస్పత్రికి పిలిపించారు. ఆర్థిక లావాదేవీలపై మాట్లాడుతున్న సమయంలోనే డాక్టర్ రామచంద్రారెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొంతమంది ఒక్కసారిగా శ్రీనివాసరెడ్డిపై దాడి చేశారు. కత్తితో…
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు 6 ఇనుప పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బంగారు ఆభరణాలను తీసుకెళ్లేందుకు తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు రూ.5 కోట్లు చెల్లించింది. జయలలిత బంగారు నగలు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనుంది. జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు సిటీ సివిల్ సెషన్స్ కోర్టు తేదీని నిర్ణయించింది. జయలలిత బంగారు ఆభరణాల తమిళనాడుకు అప్పగించే సందర్భంగా స్థానిక పోలీసుల ద్వారా సివిల్ కోర్టులో రెండు రోజుల పాటు అవసరమైన భద్రత ఉండేలా కోర్టు రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే ఏడాది మార్చి 6వ తేదీ విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త టి. నరసింహమూర్తి దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన బెంగళూరు నగరంలోని 36వ సిటీ సివిల్, సెషన్స్ కోర్టు…
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీ మారి నెలరోజులు కూడా తిరగక ముందే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి వైసీపీ ఇంఛార్జిగా గంజి చిరంజీవిని నియమించారనే అసంతృప్తితో గతేడాది డిసెంబర్‌లో ఆర్కే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం కావటంతో ఆమె వెంట నడిచారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే సమయంలో మంగళగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి నెలరోజులు కూడా తిరగకముందే రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డితో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం…