దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 46మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది కంటే తక్కువ విస్తీర్ణంలో కార్చిచ్చు చెలరేగినా ప్రాణ నష్టం మాత్రం అధికంగా ఉంది. వేసవి వచ్చిందంటే చాలు అమెరికా, ఐరోపా ఖండాల్లోని అడవుల్లో కార్చిచ్చు చెలరేగి లక్షలాది ఎకరాలు కాలిబూడిదవుతున్నాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ శనివారం మాట్లాడుతూ ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు 46 మంది మృతిచెందినట్లు తెలిపారు. వేలాది మంది గాయపడినట్లు చెప్పారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు వివరించారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. మంటలు చాలా వేగంగా…
Author: Editor's Desk, Tattva News
మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ పురస్కారం వరించడంపై ఎల్‌కే అద్వానీ తాజాగా స్పందించారు. ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డుని స్వీకరిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది తనకే కాకుండా తన సిద్ధాంతాలకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. తన జీవితం దేశం కోసమే అని ఎప్పుడో నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఎంతో వినయంగా, కృతజ్ఞతతో ఈ భారతరత్న పురస్కారాన్ని అంగీకరిస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే కాదు. నేను ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న సిద్ధాంతాలకు, విలువలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని సంతోషంగా…
ఆమ్ ఆద్మీ పార్ టీ(ఆప్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించాలని పోలీసులు కేజ్రీవాల్‌ను కోరినట్లు వర్గాలు తెలిపాయి. నోటీసులు అందచేసేందుకు శుక్రవారం కేజ్రీవాల్ నివాసంతోపాటు ఢిల్లీ మంత్రి ఆటిషి నివాసానికి కూడా పోలీసులు వెళ్లగా ఆ రెండు చోట్ల నోటీసులను స్వీకరించలేదని వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ ఆ సమయంలో తమ నివాసాలలో లేరు. దీంతో నోటీసులు అందచేసేందుకు ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం మళ్లీ కేజ్రీవాల్ నివాసానికి వచ్చారని వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఆప్ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభపెడుతోందంటూ చేసిన ఆరోపణలపై క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు తమ…
పంజాబ్ గవర్నర్ పదవికి భన్వరీలాల్ పురోహిత్ శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామాను పంపారు. రాజీనామాను ఆమోదించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలకు సైతం ఆయన రాజీనామా చేశారు. భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా 2021 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. 2017 నుండి 2021 వరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. 2016 నుంచి 2017 వరకు అసోం గవర్నర్‌గా పని చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ నేత. ఆయన నాగ్‌పూర్ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పురోహిత్ 1940 ఏప్రిల్ 16న రాజస్థాన్‌లో జన్మించారు. పంజాబ్‌లో పని చేసిన కాలంలో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా భగవంత్ మాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనకు, సీఎంకు మధ్య సంబంధాల్లో దిగజారాయి. పంజాబ్ అసెంబ్లీ సమావేశంలో విషయంలో ఇరువురి మధ్య వివాదం పెరిగి, ఈ…
విశాఖపట్నంజిల్లా మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు. చినగదిలి రూరల్ తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10.15 గంటల సమయంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో రమణయ్య తలపై దాడిచేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన మృతి చెందారు. తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్…
భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్‌కే అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. “ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంపై నేను కూడా అద్వానీజీతో మాట్లాడాను. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారత రత్న ఆయనకు లభించినందుకు అభినందనలు చెప్పాను. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఎల్‌కే అద్వానీ ఒకరు. దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు పెరుగుతోంది! బీజేపీతో చేరి ఇప్పటికే ఇండియా కూటమికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు.. కాంగ్రెస్‌పై బంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలు కూటమిలో మరోసారి కలకలం రేపుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం కూడా అనుమానమే అని ఆమె చెప్పడం పెను దుమారం రేపింది. బెంగాల్లో సీట్ షేరింగ్ అంశంపై ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే మమత ఈ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బెంగాల్‌లోని ఆరు జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై కూడా మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. అది కేవలం ఫొటో షూట్…
గురువారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) ప్రస్థావన రావడంతో ఇప్పుడు అందరూ దీనిపై దృష్టి సారిస్తున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మహిళల్లో క్యాన్సర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సరే. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్). నిజానికి, గర్భాశయ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. ఇక భారత్‌లో అత్యధికంగా వెలుగు చూస్తోన్న క్యాన్సర్‌లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. లక్షల సంఖ్యలో సర్వైకల్ క్యాన్సర్ బాధితులు మన దేశంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 3,42,333 మంది…
ఒడిషాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపి సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్‌లో నెర్గుడి – బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను రూ. 4,962 కోట్ల వ్యవయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద పైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడవ రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని…
త్వరలోనే 500లకే గ్యాస్ సిలిండర్, ఉచితంగా రూ. 200 యూనిట్ల కరెంట్ ను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన తొలుత కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడుతూ మరో రెండు హామీలపై ప్రకటన చేశారు. “త్వరలోనే రూ. 500 గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. ప్రియాంక గాంధీని పిలిచి లక్ష మందితో సభ నిర్వహించుకుందాం. త్వరలోనే ప్రకటన వస్తుంది. ఇదే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ను అందజేస్తాం. మీ కష్టాలను తీర్చేందుకే మన ప్రభుత్వం పని చేస్తుంది. ఈ రెండింటిని అమలు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నాగోబా దర్బార్ హాల్ లో స్వయం సహాయక సంఘాలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.60కోట్ల విలువైన బాంకు…