శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. నవంబర్‌లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో పడిపోగా తుంటికి గాయమైంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోకి చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు,…
Author: Editor's Desk, Tattva News
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు కులాలకు ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసే ప్రయత్నం చేసిందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు బహుముఖి అయిన విధానాలతో ఈ ప్రభుత్వం పని చేసిందని వెల్లడించారు. రూ.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా అందించిందని ఆమె వివరించారు. పేదరిక నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేసిందని చెబుతూ సబ్‌కా సాథ్ లక్ష్యంతో గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుంచి బయటపడేశామని వెల్లడించారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని తెలిపారు. అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని వెల్లడించారు. పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీఎల్‌ఎఫ్ రాడార్ కేంద్రాన్ని వికారాబాద్‌లో పెట్టడం దారుణమని, ప్రభుత్వం తన ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సహా అనేక ప్రపంచ వేదికల్లో గళం వినిపంచిన బీవీ సుబ్బారావు, వికారాబాద్ ప్రాంతంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాడార్ కేంద్ర ఏర్పాటు హైదరాబాద్ వాతావరణ, భౌగోళిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం కోసం ఏ మొక్కలను, చెట్లను కొట్టేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు? అని ప్రశ్నించారు. వికారాబాద్ అడవుల్లో 12 లక్షల వృక్షాలను తొలగిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోనే అత్యంత విలువైన, అరుదైన ఔషధ మొక్కలు వికారాబాద్ అడవుల్లో ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిసెర్చ్ స్కాలర్లు 500కుపైగా ఔషధ మొక్కలను పేర్లతోపాటు గుర్తించారు. సౌత్-వెస్ట్‌లో వికారాబాద్…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో రాంచీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే అరెస్ట్‌కు ముందే జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ స్వయంగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆరుగంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం తమ అదుపులోకి తీసుకోవడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత రవాణా మంత్రి, ఆయనకు సన్నిహితుడైన చంపై సోరెన్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మంగళవారమే హేమంత్ సోరెన్ తన పార్టీ జేఎంఎం ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా తన వారసుడి గురించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో…
తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ‘నంది అవార్డు’. సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుని అందిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు తరువాత సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఈ అవార్డుల పురస్కారం పట్ల నిర్లక్ష్యం మొదలయింది. ఇక 2017 నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేసాయి. కాగా, తాజాగా కళారంగంలో ప్రముఖ ప్రజా కవి గద్దర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన చేశారు. హైదారాబాద్ లో రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు…
వాస్తవాధీన రేఖ వద్ద లఢఖ్‌కు చెందిన గొర్రెల కాపరులను చైనా సైనికులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనా సైనికులు గొర్రెల కాపరులను వాస్తవ నియంత్రణ రేఖ వద్ద గొర్రెలను మేపకుండా ఆపేందుకు యత్నించడం కనిపించింది. చైనా సైన్యానికి లఢక్ వాసులు సైతం నిర్భంగా ప్రతిస్పందిస్తున్నారు. చైనా సైనికులతో వాగ్వాదానికి దిగుతూ తాము భారత భూభాగంలో ఉన్నామంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ వీడియోలో ఉన్నది తూర్పు లడఖ్‌కు చెందిన వారిగా సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారత భద్రతను పెంచింది. గత మూడు సంవత్సరాల్లో తూర్పు లడఖ్‌లో స్థానిక పశువుల కాపరులు మూడేళ్లుగా తమ పశువులను మేపడం మానేశారు. తాజాగా ఈ ప్రాంతంలో మేపుతుండగా.. చైనా సైనికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, తమ ప్రాంతంలోనే ఉన్నామని స్థానికులు గట్టిగా చెప్పడం చైనా దళాలు తొలిసారిగా వెనక్కి వెళ్లిపోవడం ఇదే తొలిసారి. చుషుల్…
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది. ఈ మేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ… మరో ఏడు రోజుల్లో పూజ…
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్ట్‌లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దుల వద్ద మంగళవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. మావోల కార్యకలాపాల పర్యవేక్షణకు టేకులగూడెం గ్రామంలో సెక్యూరిటీ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జోనగూడ-అలిగూడ ప్రాంతంలో పెట్రోలింగ్, సోదాలు చేస్తున్న కోబ్రా- ఎస్టీఎఫ్-డీఆర్‌జీ దళాలపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డాయి. నక్సల్స్ కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ధీటుగా బదులిచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు సైనికులు వీరమరణం పొందగా.. మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన సైనికుల పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలిస్తున్నారు.టేకలగూడెం అడవుల్లో…
రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మంగళవారం వివిధ పార్టీల సభా నేతలతో చెప్పింది. బడ్జెట్ సెషన్‌కు ముందు ప్రభుత్వం ముండు ఏర్పాటు చేసిన సాంప్రదాయక సమావేశం నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బయటకు వస్తూ, సభా పక్షం నేతలతో ముఖాముఖి ‘అత్యంత సౌహార్ద్రం’గా సాగిందని అభివర్ణించారు. స్వల్ప కాలం జరిగే ఈ సెషన్‌లో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలియజేశారు. పార్లమెంటరీ ఎన్నికలు ప్రకటించే లోపు ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి సమావేశం. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభలో ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆయన సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న నేతలలో కె సురేష్…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం యథాతథ స్థితినే కొనసాగించాలని, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది. దాంతో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లు ప్రమాణం చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్‌ఖాన్‌లను నియమించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు నామినేట్ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి పేర్లను తిరస్కరించారు. అయితే గవర్నర్ తమ నియామకాలకు ఆమోదం తెలుపకపోవడంపై…