టిడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వేసినట్లే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రాష్త్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం విజయవాడలో పదవీబాధ్యతలు చేబడుతూ వై ఎస్ షర్మిల హెచ్చరించారు. ప్రజలు వైసీపీ, టీడీపీలకు ఎందుకు ఓటు వేయాలని ఆమె ప్రశ్నించారు. బీజేపీకి అమ్ముడు పోవడానికి వైసీపీ, టీడీపీ నుంచి ఎందుకు పోటీ పడుతున్నాయని ఆమె మండిపడ్డారు. టీడీపీ, వైసీపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. 25 మంది ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారని, బీజేపీ చెబితే గంగిరెద్దులా తల ఊపుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగనే కారణం అని వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని 3డీ గ్రాఫిక్స్ చూపించగా, జగన్ మూడు రాజధానులు అన్నారు. ఒకటి కూడా అవ్వలేదని…
Author: Editor's Desk, Tattva News
ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులను తెలంగాణ ప్రభుత్వంనియమించింది. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ లను సలహాదారులుగా ప్రకటించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా నరేందర్ రెడ్డిని నియమించగా, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ డా. మల్లు రవిని నియమించారు. గతంలో ఎంపీగా, ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోదరుడు. ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావును నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్‌తో నరేందర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పని చేశారు. 2004- 2009 మధ్యలో నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది.…
శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అలంకరణలతోపాటు సంప్రదాయం ఉట్టిపడుతూ, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. పుష్పాధివాసం పూజల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చక్కెర, పూలను శనివారం బాల రామునికి సమర్పించారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి 81 కలశాల్లో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో బాల రాముని విగ్రహాన్ని, గర్భగుడిని సంప్రోక్షణ…
భారత్, మయన్మార్ సరిహద్దులో కంచెను కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. దేశంలోకి స్వేచ్ఛాయుత రాకపోకల నిరోధానికి బంగ్లాదేశ్‌తో సరిహద్దులో కంచె ఏర్పాటు చేసిన వైనాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ఉదహరించారు. భారత్, మయన్మార్ సరిహద్దు సమీపంలో నివసించే జనం 16 కిలోమీటర్ల దూరం దాటి పరస్పర భూభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్న ‘స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్)’ ఈ ప్రకటనతో త్వరలో ముగియగలదు. గువాహటిలో అస్సాం పోలీస్ కమాండోల పాసింగ్ ఔట్ పరేడ్‌ను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ, ‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులో వలె మయన్మార్‌తో భారత్ సరిహద్దులో త్వరలో కంచె ఏర్పాటు కాగలదు’ అని తెలియజేశారు. ‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులో వలె మయన్మార్‌తో గల స్వేచ్ఛ సరిహద్దులో కంచె ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిశ్చయించిందని అస్సాంలోని మా మిత్రులకు చెప్పదలిచాను’ అని అమిత్ షా తెలిపారు. ‘మయన్మార్‌తో…
తమ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ప్రమాద బీమా పెంచింది. రూ.40 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ.1.12 కోట్లకు పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు శనివారం ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది…
డ్రగ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న కేసులో సమీర్ ఆస్పత్రి చైర్మన్, డైరెక్టర్‌తోపాటు మరో ముగ్గురు నిందితులను రాజేంద్రరనగర్, ఎస్‌ఓటి, టిఎస్ నాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా వైద్యుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం డ్రగ్స్ ఇంజక్షన్లు ఫెంటనేయిల్ సిట్రస్ ఇంజక్షన్లు వైద్య దంపతులు డ్రగ్స్‌కు బానిసగా మారిన వ్యక్తికి విక్రయిస్తున్నట్లు టిస్‌నాబ్ పోలీసులకు తెలిసింది. వెంటనే రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, టిఎస్‌నాబ్ పోలీసులు ఫెంటనేయిల్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వైద్యుడి ఇంటిపై దాడి చేశారు. మత్తు వైద్యులుగా సమీర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఆషాన్ ముస్తాఫా, అతడి భార్య లుబ్‌నా నజీబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు. తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటికి వచ్చాయి. దీంతో పోలీసులు ఆస్పత్రిపై దాడి చేసి ఆస్పత్రి చైర్మన్ సోయబ్ సుభాని, డైరెక్టర్ ఎండి. అబ్దుల్ ముజీబ్, ఫార్మసిస్ట్ సయిద్ నసీరుద్దిన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎండి…
ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహ్మద్ కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించాయి. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జనవరి 26 సందర్భంగా కూడా జైషే ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది.రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పన్నూ శుక్రవారం హెచ్చరికలు పంపాడు.…
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తుండడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుస్థానం నిష్ఠగా కఠిన దీక్ష పాటిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన దీక్ష పాటిస్తున్నారు. సూర్యోదయానికి ముందుగానే నిద్రలేస్తున్నారు. లేచిన వెంటనే కాలకృత్యాల్ని తీర్చుకొని ధ్యానం చేస్తున్నారు. ఆ తర్వాత యోగాసనాలు వేస్తున్నారు. స్నానం చేసి కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతున్నారు. కఠినమైన తపస్సు చేస్తున్నారు.. కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ నిరంతరాయంగా పర్యటనలు చేస్తున్నారు. నేల మీద కేవలం దుప్పటి వేసుకుని నిద్రిస్తున్నారు.…
లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను కాళీ చేయక తప్పలేదు. ఎంపిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు జారీ చేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ విభాగం అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే నివాసాన్ని ఖాళీ చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది షాదన్ ఫరాసత్ చెప్పారు. గత డిసెంబర్ 8న మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 7వ తేదీ లోగా ఆమెకు కేటాయించిన అధికారిక భవనాన్ని చేయాలంటే గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ చర్యలు చేపట్టింది. శుక్రవారం ఉదయం అధికారుల బృందం…
కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు నీటి రుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హామీలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు కేంద్రం ప్రతిపాదించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించినట్టు మంత్రులు వివరించారు. తాను నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న నియోజకవర్గం నుంచి ఎంపిగా, ఎంఎల్‌ఎగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించానని, సమస్య ఏమిటో తనకు తెలుసని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై ఎపిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించి రాయలసీమకు నీటిని తీసుకుపోతుంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎపి సిఎం జగన్‌తో కలిసి…