Author: Editor's Desk, Tattva News

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పగా ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. లోయర్‌ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని తుషార్‌ మెహతా పేర్కొన్నారు.  దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్‌ తరపున న్యాయవాది…

Read More

అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరగాలనేది విధి నిర్ణయమని, అందుకు అది ప్రధాని మోడీని ఎంచుకున్నదని బిజెపి వృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె ఆద్వానీ పేర్కొన్నారు. వచ్చే వారం ప్రచురితం కానున్న ‘రాష్ట్రధర్మ ’ ప్రత్యేక ఎడిషన్‌లో రాసిన ఓ ఆర్టికల్‌లో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ రామమందిర్ నిర్మాణ్, ఏక్ దివ్య స్వప్న కీ పూర్తి’ పేరుతో రాసిన ఆ వ్యాసంలో అద్వానీ 33 ఏళ్ల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తాను చేపట్టిన రథయాత్రను గుర్తు చేసుకున్నారు. అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన, పూరిత్గా మార్చివేసిన సంఘటన అని తాను నమ్ముతానని, అది భారత దేశాన్ని తిరిగి కనుగొనడానికి, ఆ ప్రక్రియలో తనను మళ్లీ అర్థం చేసుకోవడానికి తోడ్పడిందని ఆయన తెలిపారు. రామమందిర ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న అద్వానీ ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ…

Read More

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా,  మొత్తం రూ.404.35 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేసింది.  ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే అందర్నీ ఒక్కతాటిపై నిలబెట్టామని తెలిపారు. పోరాటానికి ఆయన మరో రూపమని, మరణం లేని మహానేత అని జగన్ కొనియాడారు.  సామాజిక న్యాయ మహా శిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఇది అందరికీ స్పూర్తినిస్తుందని చెప్పారు.  సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందని తెలిపారు. అంటరానితనం రూపం మార్చుకుందని, పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరాని తనమేనని అన్నారు. పేదలకు…

Read More

సినీ నటి నయనతార చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. సరోగసి వివాదం, తిరుమలలో ఫోటో షూట్ల వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇలా నయన్ పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. నయన్ తీస్తోన్న సినిమాలు సైతం ఈ మధ్య ఎక్కువగా వివాదాలు సృష్టిస్తున్నాయి.  మూకుత్తి అమ్మాన్, అన్నపూరణి చిత్రాలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీన్లను చిత్రీకరించారని నెటిజన్లు మండిపడుతున్నారు.  ఇప్పుడు అన్నపూరణి వివాదం తారాస్థాయికి చేరుకుంది.  ఓటీటీలోకి ఈ మూవీ వచ్చిన తరువాత మరింతగా వివాదం చెలరేగుతుంది. హిందూ సంస్కృతి, ఆచారాలను తక్కువ చేసేలా, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా సన్నివేశాలున్నాయని మండి పడుతున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్ సైతం ఈ సినిమాను ఆపేసిందని అప్పట్లో టాక్ వచ్చింది.  ఇక ఈ వివాదాల మీద నయన్ స్పందించింది. జై శ్రీరామ్ అంటూ ఓ ప్రెస్…

Read More

అయోధ్యలో దివ్య రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22 వ తేదీన అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు భారీ స్థాయిలో జరుగుతున్న క్రమంలోనే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు అయోధ్యలో ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ పోలీసులు పట్టుకోవడం కలకలం రేపుతోంది. అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను ఎస్‌ఏటీ పోలీసులు అరెస్టు చేసినట్లు యూపీ స్పెషల్‌ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.  అయితే వారు ఏ ఉగ్రగ్రూప్‌నకు చెందినవారు అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఆ ముగ్గురు అనుమానితులను విచారణ చేస్తున్నట్లు వివరించారు.  అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే…

Read More

నందమూరి కుటుంబంలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. బాబాయ్‌ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్‌ ఎన్టీఆర్‌ మధ్య గ్యాప్‌ ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని నిరూపించే ఘటన ఎన్టీఆర్‌ ఘాట్‌ వేదికగానే జరిగింది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద గురువారం తెల్లవారుజామున నందమూరి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కూడా తెల్లవారుజామునే వచ్చి తాతకు నివాళి అర్పించి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తారక్‌ అభిమానులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో వచ్చిన బాలకృష్ణ తండ్రికి అంజలి ఘటించి వెళ్లారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బాలయ్య వెళ్లిపోయిన తర్వాత ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన తారక్‌ ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశించడంతోనే వాటిని తొలగించారన్న ప్రచారం మొదలు కావడమే కాదు, వాటిని తొలగించాలని…

Read More

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌లో మార్పులు చేయడంతో పోలీసులు యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాహుల్‌ యాత్ర అస్సాంలోని జోర్హాట్‌ పట్టణంలో కొనసాగుతోంది. అయితే తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చార్ట్‌లో చూపించని మార్గాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడం అంతరాయాలకు దారితీసినట్లు తెలిపారు. యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. కాగా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే…

Read More

జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. రామ్​ లల్లా విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి గర్భగుడిలోకి తరలించిన విషయం తెలిసిందే. ఇక గురువారం నాడు రామ్​ లల్లా విగ్రహానికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది.  గర్భగుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముసుగుతో కప్పి ఉన్న విగ్రహం, మొదటి ఫోటోను ఆవిష్కరించారు. ఈ ఫొటోలను విశ్వహిందూ పరిషత్ మీడియా ఇన్​ఛార్జి శరద్ శర్మ షేర్ చేశారు.  ఐదు తరాల ప్రసిద్ధ శిల్పుల కుటుంబ నేపథ్యం కలిగిన మైసూరు వాసి చెక్కిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని బుధవారం ఆలయానికి తీసుకువచ్చారు.  వైదిక బ్రాహ్మణులు, ఆచార్యులు ఆలయ పవిత్ర ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారని విశ్వహిందూ పరిషత్ తెలిపింది. గురువారం మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహాన్ని…

Read More

జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలీడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాయాలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆఫీసులు మూసి ఉంటాయని పేర్కొంది. ఉద్యోగుల మనోభావాలు, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ‘ఉద్యోగుల మనోభావాలు, వారి నుంచి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు 2024 జనవరి 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు హాఫ్ డే మూసివేయాలి’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటించాయి. ఉత్తర్ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్,…

Read More

ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ స్వగ్రామంలో వ్యవసాయంపై మక్కువ చూపే మల్లికార్జున్ రెడ్డి లాంటి వారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా యువతకు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. గురువారం భారత్ వికసిత్ సంకల్ప్ యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని న్యూఢిల్లీ నుండి వర్చువల్ గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, మేఘాలయ, మహరాష్ట్ర, రాష్ట్రాలకు చెందిన వారితో మాట్లాడుతూ ప్రధాని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మొదటగా చొప్పదండి మండలం పెద్ద కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డితో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి కార్పోరేట్ సంస్థలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న మల్లికార్జున్ ఎంతో మందికి ఆదర్శమని ప్రధాని అభివర్ణించారు. అనంతరం ప్రధానమంత్రి యోజన పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందిన లబ్ధిని గురించి వివరాలను, మల్లికార్జున్ నిర్వహిస్తున్న…

Read More