Author: Editor's Desk, Tattva News

ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మరోసారి ప్రపంచయవనికపై నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. యూఎస్ ఆధారిత కన్సల్టెన్సీ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ డిసెంబర్ 7న విడుదల చేసిన డేటా ప్రకారం మోదీ 76 శాతం రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 66 శాతం ఆమోదం రేటింగ్‌తో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 58 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. బ్రెజిల్ లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకి చెందిన ఆంథోనీ అల్బనీస్ వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ 37 శాతం ఆమోదం రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. చెక్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా అతి తక్కువగా 16 శాతం రేటింగ్‌ పొందారు. బ్రిటన్…

Read More

తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిట ల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం సాయం త్రం ప్రారంభమైన తుంటి ఎముక మార్పిడి సర్జరీ గత రాత్రి పూర్తియింది.  సర్జరీ పూర్తయిన అనంతరం కెసిఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసియుకి తరలించారు.  కెసిఆర్ సతీమణి శోభ కుమారుడు కెటిఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కెసిఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కెసిఆర్ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్‌కు తరలించారు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కెసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వై…

Read More

వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘కాక్క’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మిక మంచి పేరు తెచ్చుకుంది. పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాథక్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్మర్ సల్మాన్ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. లక్ష్మిక చివరిసారిగా నవంబర్ 2న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పటి ఒక అందమైన ఫోటోను ఆమె షేర్ చేశారు. ”హోప్. లైట్ డిస్పయిట్ ఆల్ ఆఫ్ ది డార్కెనెస్” అంటూ ఆమె చేసిన పోస్ట్‌‌కు ఆమె అభిమానుల నుంచి ఇప్పుడు స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నలుగురు మలయాళ నటీమణులు మరణించడం, వీరిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైన తరుణంలో…

Read More

ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది. ఈ కథనాన్ని తన పోస్ట్‌కు మోదీ జత చేశారు.  ఈ కరెన్సీ నోట్ల గుట్టలను దేశప్రజలంతా చూసిన తర్వాత ఆ పార్టీ నాయకుల నిజాయితీ, చెప్పే ఉపన్యాసాలు వినాలని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వాపలు చేయాల్సిందేనని, ఇది మోదీ గ్యారెంటీ అంటూ పలు ఇమోజీలతో మోదీ హెచ్చరించారు. బీరువాల నిండా నోట్ల కట్టలున్న ఒక కథనం కూడా ట్వీట్‌కు ఆయన జోడించారు. ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ శాఖ గురువారం జరిపిన పలు దాడుల్లో వివిధ మద్యం తయారీ సంస్థలకు…

Read More

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ చెబుతున్నారు. అందుకే కీలక వడ్డీ రేట్లను 6.5 శాతం దగ్గరే ఉంచాలన్న ప్రతిపాదనకు మానిటరీ పాలసీ కమిటీ ఏక గ్రీవంగా అంగీకారం తెలిపిందని చెప్పారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టనుంది. ఓ వైపు అప్పులు పెరగడం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల…

Read More

దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి గడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది. అదే విధంగా, గోధుమలను నిల్వ చేసే విషయంలో మరిన్ని ఆంక్షలను విధించింది. మరో ఆరు నెలల లోపే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పెరుగుతున్న ధరలు తమపై ప్రతికూల ప్రభావం చూపకూడదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు ఉల్లి గడ్డల ఎగుమతులపై నిషేధం విధించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. కాగా, ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులు ముంబై-ఆగ్రా హైవేపై మూడు చోట్ల శుక్రవారం రాస్తారోకోలు నిర్వహించారు. హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి వేలం పాటలను నిలిపివేశారు. అసల్‌గావ్, చాంద్వాడ్, నంద్‌గావ్, దిండోరి, ఏవ్లా, ఉమరానేతోపాటు నాసిక్ జిల్లాలోని ఇతర ప్రదేశాలలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి వేలంపాటలను రైతులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అసల్‌గావ్ వ్యవసాయ ఉత్పత్తుల…

Read More

తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై శుక్రవారం బహిష్కరణ వేటు పడింది. దీంతో ఆమె సభ్యత్వం రద్దు అయింది. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని మహువాపై ఆరోపణలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టారు.  ఎథిక్స్ కమిటీ నివేదికపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ ఆమోదించింది. ఇక ఆమె ఎంపిగా కొనసాగడం తగదని స్వీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మహువా మొయిత్రాను సభనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బీజపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోంకర్ 500 పేజీల  నివేదికను సమర్పించారు. టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదికను ‘ఫిక్స్‌డ్ మ్యాచ్’గా అభివర్ణించాయి. ఇది ముమ్మటికీ రాజకీయ కక్ష సాధింపేనని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బంధోపాధ్యాయ తెలిపారు. అదానీకి వ్యతిరేకంగా…

Read More

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే రేవంత్ రెడ్డి జరిపిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రెండు గ్యారంటీలలో రెండింటిని వెంటనే అమలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులను రాష్ట్రంలో సోనియాగాంధి జన్మదినమైన శనివారమ నుండే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిని రూ 10 లక్షలకు పెంచుకు నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థ్ధిక పరిస్థ్దితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా వి ద్యుత్ రంగం పరిస్థితులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో ప్రజలు…

Read More

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి కాలుజారి పడటంతో కేసీఆర్‌కు తీవ్ర గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి యశోద ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. కేసీఆర్‌ ఎడమ కాలి ఎముక విరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని పరీక్షలు నిర్వహించారు.. శుక్రవారం కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.  శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత ఆదివారం ఓట్ల లెక్కింపులు తమ పార్టీ బిఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తున్నట్లు తెలియగానే ఆయన మధ్యాన్నం ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ నుండి ఫార్మ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు. నిత్యం ఆయన మద్దతుదారులు, పార్టీ…

Read More

తనను మోదీజీ అని పిలవద్దని, మోదీ అంటే సరిపోతుందని చెబుతూ పార్టీలో ఏకనాయకత్వం కాదు సమిష్టిత్వం అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. గురువారం ఆయన ఢిల్లీలో బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో ఏ కోణంలోనూ ప్రజాస్వామిక లక్షణాలు లోపించరాదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే వ్యక్తి ఆరాధనభావం నెలకొంటుందో అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉంటుందని మోదీ హెచ్చరించారు. పార్టీ అందరిది, కొందరిదే అనుకోరాదని పిలుపు నిచ్చారు. కొన్ని అంశాలు సమాజంలో అతి త్వరగా రూపం సంతరించుకుంటాయని, కొన్ని విషయాలు ఇతరత్రా అపార్థాలకు దారితీస్తాయని, దీనిని నేతలు పార్టీ కార్యకర్తలు అంతా గ్రహించితీరాల్సి ఉందని హితువు చెప్పారు. ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా ఓ ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ బిజెపి కేంద్రంలో బలంగా ఉందని, రాష్ట్రాల స్థాయిల్లోకి వచ్చే సరికి డీలా పడిందనే విమర్శలు వెలువడుతున్నాయనే వాదన సరికాదని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లోనూ పరిస్థితి బాగా ఉందని,…

Read More