కర్ణాటక రాజధాని బెంగళూరు, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఇమెయిల్ అడ్రస్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. పాఠశాలల్లోనే బాంబులు పెట్టామని ఆ మెయిళ్లలో బెదిరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు. శుక్రవారం ఉదయం తొలుత ఏడు ప్రైవేటు పాఠశాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే మరికొన్ని స్కూళ్లకు కూడా అదే తరహా బెదిరింపులు వచ్చాయి. మొదట సంఖ్య 15గా ఉండగా, చివరికి 68కి చేరుకుంది. ఈ పాఠశాలల్లో 48 పాఠశాలలు బెంగళూరు నగరంలో ఉండగా, మిగతా స్కూళ్లు బెంగళూరు రూరల్ పరిధిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇమెయిళ్లు రాగానే స్కూళ్ల అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. వారు బాంబు డిస్పోజల్ బృందాలు, కుట్రలను ఛేదించే టీమ్‌లతో సంబంధిత స్కూళ్లకు చేరుకుని ఉపాధ్యాయులు, పిల్లలందరినీ బయటికి తీసుకువచ్చారు. తర్వాత…
Author: Editor's Desk, Tattva News
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ వాయుగుండం శనివారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి డిసెంబర్ 4న తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నడుమ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. దాంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్నం, రామనాథపురం, చెన్నై ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ…
నాగార్జున సాగర్‌లో ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకున్నది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్ స్టోరేజీకి చేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, డ్యామ్‌కు ఇరువైపులా ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉన్నది. నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. …
తెలంగాణాలో గురువారం జరిగిన పోలింగ్ లో తాము మంచి ఫలితాలు ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు బీజేపీ తరపున ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అయితే, బీఆరెస్, కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంగించి డబ్బు, మద్యం పంపిణి చేశారని కేంద్ర మంత్రి విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మరింత కఠినంగా వ్యవహారించాల్సిందని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు పోలీసుల ముందే విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణి జరిగిందని పేర్కొంటూ అయినా చూసి చూడనట్లే వ్యవహరించారని కిషన్ రెడ్డి విమర్శించారు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని చెబుతూ అయినా ధైర్యంగా ఎదుర్కొని, ఎన్నికల్లో ముందుకు వెళ్లారని కొనియాడారు. బీజేపీ కార్యకర్తలపై…
తెలంగాణాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పోలింగ్ తక్కువగా జరగడం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరాశాజనకంగా ఉండటంతో ఫలితాల పట్ల ఉత్కంఠత వ్యక్తం అవుతున్నది. అధికార పార్టీ బిఆర్ఎస్ పట్ల ప్రజలు ప్రతికూలంగా స్పందించినట్లు భావిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పట్ల మొగ్గు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే `హంగ్ అసెంబ్లీ’ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 60 సీట్లు మార్కును దాటాల్సి ఉంటుంది. అలా దాటితినే సింగిల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలు ఉంటే మాత్రం హంగ్ కు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అదే జరిగితే బిజెపి, ఎంఐఎం `కింగ్ మేకర్’గా మారే అవకాశాలు ఉన్నాయి. జన్ కీ బాత్ సర్వే చూస్తే… బీఆర్ఎస్ పార్టీకి 40-55 సీట్లు వస్తాయని తెలపగా, కాంగ్రెస్ పార్టీకి 48-64 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. బీజేపీ 7-13, ఎంఐఎం -…
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా టీ20, వన్డే, టెస్టు జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మొదట జరగబోయే టీ20, వన్డే సిరీస్ ల నుంచి తమను మినహాయించాల్సిందిగా రోహిత్ శర్మ, కోహ్లి కోరినట్లు బోర్డు వెల్లడించింది. దీంతో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉండనున్నారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు రోహిత్, కోహ్లి తిరిగి రానున్నారు. ఇక పేస్ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని, అతడు పూర్తి ఫిట్ గా ఉంటే టెస్టులకు తిరిగి వస్తాడని బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికాతో డిసెంబర్, జనవరిలో జరగబోయే మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం ఢిల్లీలో గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. భారత వన్డే జట్టులోని తొలిసారి సాయి సుదర్శన్ కు చోటు దక్కింది. ఇక రజత్ పటీదార్, రింకు సింగ్, సంజూ శాంసన్ లాంటి వాళ్లు కూడా…
ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో మరణించారని కిస్సింజర్స్ అసోసియేట్స్ తెలిపింది. అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, జెరాల్డ్ ఫోర్డ్ హయాంలో ఆయన రెండు పర్యాయాలు విదేశాంగ మంత్రిగా పని చేశారు. 1923 మే 7న కిసింజర్ జర్మనీలో జన్మించారు. ఆయన కుటుంబం 1938లో అమెరికాకు వలస వెళ్లిన తరువాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యంలో చేరారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టా పొందారు. అక్కడే 17 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. వియత్నాం యుద్ధాన్ని అమెరికా విరమించుకోవడంలో కీలక పాత్ర వహించినందుకు 1973లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ హయాంలో చైనాతో అమెరికా సంబంధాలు ప్రారంభం కావడానికి ప్రముఖ పాత్ర వహించారు. 1971-72 లో బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి భారత్ పాకిస్తాన్…
నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పోలీసులు నాగార్జున సాగర్ డ్యాంకి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్, తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఏపీ పోలీసులకు డ్యాం భద్రతా బలగాలకు, తెలంగాణ పోలీసులు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుడి కాల్వ నుంచి నీటిని తరలించేందుకు యత్నం చేశారు. 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ముళ్ల కంచె ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్ చేశారంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీఎస్పీ పోలీసులను మోహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు 13వ నంబర్…
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్-1బీ వీసాల రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు. హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేయనున్నారు. ఈ విధానాన్ని డిసెంబరు నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఫలితంగా భారతీయులకు భారీ సంఖ్యలో లబ్ధి చేకూరనుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ వెల్లడించారు. పైలట్ ప్రోగ్రామ్‌లో ప్రస్తుతం 20 వేల మందికి మాత్రమే దీన్ని పరిమితం చేసినట్టు తెలిపారు. ‘‘భారత్‌లో అమెరికా వీసాలకు డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం ఆరు నుంచి 12 నెలల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. భారత్ విషయంలో ఇది సరికాదని భావిస్తున్నాం. భారత పౌరులకు త్వరితగతిన ఉద్యోగాలు లభించాలని మేం భావిస్తున్నాం. దీనిలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నాం.’’ అని జూలీ స్టఫ్ తెలిపారు. రానున్న మూడు మాసాల్లో అమెరికాలో ఉంటున్న 20 వేల మంది విదేశీ…
మణిపూర్‌లో శాంతిస్థాపనకు మార్గం ఏర్పడింది. మణిపూర్‌కు చెందిన సాయుధ తిరుగుబాటు బృందం యుఎన్‌ఎల్‌ఎఫ్ కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. రాష్ట్రంలో నెలల తరబడి పలు తెగల మధ్య రిజర్వేషన్ల కోటా రగులుకుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది బలి అయ్యారు. అత్యధిక సంఖ్యలో జనం నిర్వాసితులుఅయ్యారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ చొరవతో తిరుగుబాటుదార్ల బృందాలతో సంప్రదింపులు జరిగాయి. ఇవి ఫలించాయి. యుఎన్‌ఎల్‌ఎఫ్‌తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధి కుదిరింది. ఇప్పుడు శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీలో తెలిపారు. ఇది చారిత్రక ఘట్టం అని స్పందించారు. ఆరు దశాబ్దాలుగా ఈ తిరుగుబాటు దార్ల బృందంపై పోరుబాటలో ఉంది. ఇప్పుడు చర్చల ప్రక్రియ ఫలించిందని, సిఎం చేపట్టిన చర్చలు ఫలించాయని హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్థారించారు. ఇప్పటి ఒప్పందంతో ఇంఫాల్ లోయకు చెందిన ఆర్‌కె మెఘెన్…