Author: Editor's Desk, Tattva News

‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ఉమేశ్ చంద్ర పిటిషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్ లో కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. సజ్జలతో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి తో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పని చేయాలని మీడియా సమావేశంలో సజ్జల…

Read More

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పంజాబ్‌ కేసును గుర్తించింది.  గవర్నర్‌ వైఖరిపై కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బిల్లులపై గవర్నర్‌కు వీటో అధికారం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా బిల్లును పెండింగ్‌లో ఉంచేందుకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్‌కు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు అప్పగించబడ్డాయని, ఈ అధికారాన్ని రాష్ట్ర శాసనసభల సాధారణ చట్టాన్ని అడ్డుకోవడానికి ఉపయోగించలేమని తేల్చి చెప్పింది. అయితే, గవర్నర్‌ ఎనిమిది బిల్లులపై నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. బిల్లులపై చర్చించేందుకు సంబంధిత మంత్రితో పాటు పినరయి విజయన్‌తో భేటీ కావాలని కోర్టు సూచించింది.  ఎనిమిది బిల్లుల్లో ఏడింటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌ చేయగా, ఒక బిల్లును ఆమోదించినట్లు గవర్నర్‌…

Read More

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ( పీఎంజీకేఓవై) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్ ఇచ్చే ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.  పీఎంజీకేఏవై కింద అంత్యోదయ అన్నయోజన (ఎఎవై) హౌస్‌హోల్డ్స్, ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ (పిహెచ్ హెచ్) లబ్ధిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించే ఈ పథకం 2023 జనవరి 1 న ప్రారంభించారు.  కాగా, పీఎంజీకేఏవై పథకం పొడిగింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. పేదరికపు రేఖకు ఎగువకు చేరిన వారి సంఖ్య గత ఐదేళ్లలో 13.50 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో…

Read More

తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజురాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వాఖ్యలను సీరియస్ గా పరిగణించిన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్య లపై తక్షణమే వివరణ ఇవ్వాలని స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ కు స్పష్టం చేసింది విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలిపింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలో తన భార్య, కూతురితో కలిసి ప్రచారం చేపట్టిన ఆయన ఎమోషనల్ గా మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించగా ఆ వాఖ్యలు కాస్త వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుండటంతో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నారు. కాగా మంగళవారం ఉదయం కమలాపూర్ మండల కేంద్రంలో రోడ్డు షో నిర్వహించిన పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు,…

Read More

ఉత్కంఠ పోరులో ఒత్తిడికి గురైన టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 పరుగులు నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో అజేయ సూపర్ సెంచరీ చేసి ఆసీస్‍ను గెలిపించాడు. చివరి బంతికి ఆస్ట్రేలియా గట్టెక్కింది.  జట్టుకు విజయం ఖాయమనుకున్న దశలో భారత యువ బౌలర్లు పేలవ బౌలింగ్‍ వేయడంతో చేజేతులా ఓటమి ఎదురైంది. చివరి రెండు ఓవర్లలో విజయానికి ఆసీస్ 43 పరుగులు చేయాల్సి ఉండగా.. మ్యాక్సీ, మాథ్యువేడ్ దాన్ని సాధించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో ఆసీస్ తొలి విజయం సాధించి.. 1-2తో సజీవంగా నిలిచింది.  గౌహతి వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.  223 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడి.. గెలిచింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత అజేయ శతకం…

Read More

ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు 17 రోజుల అనంతరం ఆ చీకటి సొరంగం నుండి క్షేమంగా బయటకు వచ్చారు. వారిని కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ నాటి నుంచి కృషి చేస్తూనే ఉంది. ఎట్టకేలకు వారి కృషి, దేశ ప్రజల ప్రార్థనలు ఫలించి, ఆ 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు. పర్వతం కింది భాగంలో టన్నెల్ నిర్మాణం చేస్తుండగా, ఆ భాగం కుప్పకూలి, కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు నాటి నుంచి కృషి చేస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తూ వారు చిక్కుకుని ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన అధికారులు అక్కడికి చిన్న పైప్ ను పంపించి, దాని ద్వారా ప్రతీ రోజు ఆహారం, తాగు నీరు పంపించారు. ఆ తరువాత వివిధ మార్గాల ద్వారా ఆ కార్మికులను చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.…

Read More

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాము అంతరిక్షంలోకి పంపిన నిఘా ఉపగ్రహం అమెరికా అధ్యక్ష భవనాన్ని ఫొటోలు తీసిందని చెప్పారు. వైట్ హౌస్ తో పాటు పెంటగాన్, అక్కడికి దగ్గర్లోని నావల్ బేస్ ల ఫొటోలను మంచి స్పష్టతతో తీసిందని వెల్లడించారు. రోమ్ న‌గ‌రం, అండ‌ర్స‌న్ ఎయిర్ ఫోర్స్ బేస్‌, పెర‌ల్ హార్బ‌ర్‌, కార్ల్ విన్స‌న్ ఎయిర్‌క్రాఫ్ట్ కేరీర్‌కు చెందిన ఫోటోల‌ను కూడా కిమ్ త‌ల‌కించారు. సుప్రీం లీడర్ కిమ్ ను కోట్ చేస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఈ వివరాలను వెల్లడించింది. గతవారం రిక‌న్నైసెన్స్ ప్రోబ్ అనే నిఘా ఉప‌గ్ర‌హాన్ని ఉత్తర కొరియా అంతరిక్షంలోకి పంపించింది. ఈ శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరిందని, ఇప్పటికే తన పని మొదలు పెట్టిందని కిమ్ వెల్లడించారు. ఈ ఉపగ్రహంతో ఉత్తర కొరియా శత్రువులపై నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహ పనితీరును…

Read More

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా భారత్‌తోపాటు ఆరు దేశాలకు శ్రీలంక టూరిస్ట్ వీసాలు ఉచితంగా మంజూరు చేయడానికి నిర్ణయించింది. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షించడానికి చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువగా పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మనదేశానికి చెందిన పర్యాటకులకు ఫ్రీ టూరిస్ట్ వీసాలను మంజూరు చేయనున్నట్టు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించింది. 2019 ఈస్టర్ పేలుళ్లు, కొవిడ్ మహమ్మారి కారణంగా శ్రీలంకకు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రధానంగా పర్యాటక రంగం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఆధారపడే శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌తోపాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేయాలని గత అక్టోబర్ నెలలో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని…

Read More

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం  సాయంత్రం ఐదు గంటల వరకు హోరెత్తిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక ఇప్పటి నుంచి పోలింగ్ కొనసాగే వరకు సైలెంట్ పిరియడ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో, ఎన్నికల ప్రచారానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ నియోజకవర్గాలకు వచ్చిన ఇతర ప్రాంతాల నేతలు ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లిపోవాలని ఈసీ సూచించారు అంతేకాదు గురువారం ఎన్నికల పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో, గురువారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని ఆయన సూచించారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్క్ లలో ప్రచారం నిషిద్ధమని, ఎవరూ ఎన్నికల ప్రచారానికి పాల్పడవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్…

Read More

కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంమండిపడింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలంటూ కర్ణాటక సీఎస్‌కు లేఖ రాసింది. వెంటనే ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రకటనల జారీపై సంబంధిత సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని లేఖలో పేర్కొంది. ఎన్నికల వేళ తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ పై విధంగా స్పందించింది. ప్ర‌క‌ట‌న‌ల కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌మ అనుమ‌తి తీసుకోలేద‌ని ఈసీ వెల్ల‌డించింది.  ప్ర‌క‌ట‌న కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం క‌నీసం ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా ఎన్నికల…

Read More