Author: Editor's Desk, Tattva News

సిగరెట్లు, బీడీలు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహిత మాచన రఘునందన్ తెలిపారు. సిగరెట్ల తో పాటు బీడీలు,ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని, హెల్త్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ విషయమై మాట్లాడుతూ.. హెల్త్ టాక్స్ విధింపు,పెంపు అనే నిర్ణయాలతో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులను పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాతంలో అరకిలోమీటరు వరకు విక్రయించకుండా ఆంక్షల్ని విధించి, అవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఆయన అభ్యర్ధించారు. “ప్రధాని నరేంద్ర మోదీ బాలలతో, విద్యార్థులతో కలివిడిగా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు ఆన్న విషయం దృష్టి లో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీ లు ఉన్న చోట అర కిలోమీటర్ దూరం వరకు పొగాకు, పొగాకు ఉత్పత్తుల విక్రయం పై నిషేధం విధిస్తే భవిష్యత్ భారతం…

Read More

చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం అప్రమత్తం చేసింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ చర్యలు ఉధృతం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తర చైనాలో ఇప్పుడు పిల్లల్లో తలెత్తిన న్యూమోనియా వైరస్ కారకం అనే వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోలన కలిగిస్తున్నది. చైనా వైరస్ దశలో రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్య, చికిత్సల పరిస్థితిని సమీక్షించుకుంటూ, సన్నద్ధతతను పెంపొందించుకోవల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఇప్పటికిప్పుడు చైనా న్యూమోనియాతో భారతదేశానికి పెద్దగా ముప్పేమీ లేదని వైద్య ప్రముఖులు తెలిపారు. కానీ ఎటువంటి ఉపేక్ష అయినా అది పరిస్థితిని విషమింపచేస్తుందని హెచ్చరించారు. దీనితో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. అత్యంత ఆద్యంత జాగ్రత్త చర్యలలో భాగంగా కేంద్రం వివిధ స్థాయిల్లో వైరస్ ముప్పు తట్టుకునే ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించుకుంటుందని,…

Read More

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు తూప్రాన్‌‌లో ఎన్నికల ప్రచార బహిరంగసభలో మాట్లాడుతూ గజ్వేల్‌లో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను చూసి కేసీఆర్‌ భయపడ్డారని చెప్పారు.‘‘తెలంగాణ ఈసారి ఓ కొత్త సంకల్పం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని సంకల్పం మొదలైంది” అని చెప్పారు.  భూ నిర్వాసితులను రోడ్డునపడేసిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. సచివాలయానికి రాని సీఎం అవసరమా? ఫాంహౌస్‌లో ఉండే సీఎం మనకు అవసరమా? అంటూ నిలదీశారు.  కాంగ్రెస్‌, బిఆర్ఎస్ వారసత్వ రాజకీయాలతో వ్యవస్థ నాశనమైందని మండిపడుతూ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ ఒక్కటే అని స్పష్టం చేశారు. ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని ప్రజలను హెచ్చరించారు. బీసీల్లో ప్రతిభావంతులకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం అని ప్రధాని మోదీ…

Read More

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలోని కొండగల్‌ కు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. హత్యాయత్నం, కిడ్నాప్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మరో ఆరు మందిపై ఈ కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఇందులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును నమోదు చేశారు. కోస్గిలో కూర నరేష్ అనే వ్యక్తిపై దాడి చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోస్గిలో తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో బైక్‌పై వెళ్తోన్న కూర నరేష్‌పై పట్నం నరేందర్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వారి అనుచరులు కర్రలతో దాడి చేసి చితగ్గొట్టినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని బాధితుడు పేర్కొన్నాడు.…

Read More

ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో థాయ్‌లాండ్‌ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.  ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్‌ దిశగా పయనించే సమయంలో తుఫాన్‌ ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బలహీన పడుతుందని చెప్పింది.  ఈ తుఫాను దక్షిణ కోస్తా… తమిళనాడుకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు వెళుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో నవంబరు 26 నుంచి 28 వరకూ అండమాన్ నికోబార్ దీవుల్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  ఆగ్నేయ బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న…

Read More

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. సుమారు 75 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. గత ఏడాదికంటే సుమారు 1 శాతం ఎక్కువగా పోలింగ్ జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, గవర్నర్‌ కలరాజ్‌ మిశ్రా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ప్రతిపక్ష రాజేంద్ర రాథోర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్‌ సింగ్‌ డోటస్రా, విధాన సభ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత సీపీ జోషి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  శనివారం మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఒకటి, రెండు రాళ్లు రువ్వుకున్న సంఘటనలు మినహా…

Read More

కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో సాయంత్రం టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా వర్షం కురియటంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. మరో 65 మంది గాయ పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులను అన్నా రుఫ్తా, సారా థామస్‌, అతుల్‌ తంబి, అల్బిన్‌ జోసఫ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో జరిగిన టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ నిఖితా గాంధీ లైవ్‌ కాన్సర్ట్‌ను వీక్షించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన…

Read More

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్ 1 తన ప్రయాణంలో చివరిదశకు చేరుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్1 పాయింట్ లో ప్రవేశ పెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఈ నౌక గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇంకా ఒకటిన్నర నెల సమయం పట్టే అవకాశం ఉందంటూ ప్రకటించారు. అంటే జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురం లోఇ విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొని మాట్లాడారు. చంద్రయాన్ 3 తర్వాత సెప్టెంబరు 2 న ఆదిత్య ఎల్1 ను ఇస్రో…

Read More

టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మార్చుకున్నంత మాత్రాన వారు చేసిన అవినీతి రూపుమాసిపోదని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అలాగే యూపీఏ నుంచి ‘ఇండియా’ అని మార్చుకున్నంత మాత్రాన వారి తీరు మారదని పేర్కొంటూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కామన్ పాయింట్ అవినీతి అని ధ్వజమెత్తారు. కామారెడ్డిలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఏటీఎం వద్దకు వెళ్తారని, కానీ బిఆర్ఎస్ మాత్రం కొత్త నీటి పారుదల ప్రాజెక్టులు చేపడుతుందని విమర్శించారు. బిఆర్ఎస్‌కు డబ్బులు అవసరమైతే కొత్త పథకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బు బిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. తెలంగాణ వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజల్లో ఆశలు కనిపిస్తున్నాయని, ఇది మార్పుకు నిదర్శనమని చెబుతూ బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కుటుంబ‌, అవినీతి పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పే స‌మ‌యం వ‌చ్చింద‌ని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ అని,…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత దేశ వైమానిక సత్తాకు తలమానికమైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో కాసేపు విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లో వైమానిక సామర్ధ్యంపై సమీక్ష కోసం వచ్చిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా తేజస్ రెండు సీటర్ల విమానంలో కాసేపు ఆకాశంలో విహరించారు.  ఈ సందర్భంగా మన వైమానిక సామర్ధ్యంపై ఎక్స్ లో ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులోని రక్షణ రంగ ప్రభుత్వ సంస్ధ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించారు.  దాని తయారీ కేంద్రంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. అనంతరం తేజస్ విమానం ఎక్కి కాసేపు చక్కర్లు కొట్టారు. అనంతరం తేజస్ లో తన ప్రయాణాన్ని వివరిస్తూ ఎక్స్ లో ప్రధాని మోదీ ఓ పోస్టు పెట్టారు.…

Read More