టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు విజయవాడలో ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కు ఆయన తరపు న్యాయవాదులు నిర్ణయించారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ…
Author: Editor's Desk, Tattva News
భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే నాడు నిర్వహించనున్నారు. ఆదివారం మ్యాచ్ ఎక్కడి వరకు జరిగిందో అక్కడి నుంచే సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. అంటే 50 ఓవర్ల పూర్తి మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. కాగా వర్షం అంతరాయం కల్గించే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది. సాధారణ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకే మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు కూడా మంచి ఫిట్నెస్‌తో గ్రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రోహిత్ శర్మ మొదట స్ట్రైక్ లోకి వచ్చారు. ఇక పాకిస్థాన్ పేస్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిది మొదటి ఓవర్ వేశాడు అయితే మొదట షాహిన్ అఫ్రిది బాల్స్ చాలా వేగంగా దూసుకు రావడంతో రోహిత్…
అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో రాష్ట్రాలన్నీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అటు దేశంలోని రైతులందరినీ మోసం చేసే ధోరణితో వెళ్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులందరికీ మేలు జరిగేలా ఎరువులపై సబ్సిడీ ఇస్తుంటే తెలంగాణలో ఆ సబ్సిడీ అందకుండా చేస్తున్న దుష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల కొరత తీవ్రంగా కనపడుతోందని చెబతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎరువుల కోసం రైతులు క్యూ లో నిలబడి, చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టి గంటల కొద్దీ వేచిచూసి క్యూలైన్లలోనే సొమ్మసిల్లిపడిపోయారని, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు.అయితే, నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘బీజ్ సే బజార్ తక్’ నినాదంతో ముందుకెళ్తోందని, రైతులకు విత్తనం నుంచి పంట అమ్ముకునేంతవరకు బాధ్యత…
భారత అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను ఆయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ కు సంబంధించి విజన్‌పై చేస్తోన్న కృషికి జీ 20 ఓ వేదికగా మారడంతో నాకెంతో సంతృప్తి లభించింది. ’ అని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. పలు కీలక అంశాలపైకూడా జీ20 బృందం చర్చించిందని తెలిపారు. దీంతోపాటు ఐరాసలో చేపట్టాల్సిన సంస్కరణల పైనా మోదీ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత ప్రధాని ఉద్ఘాటించారు. సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ , ఐరాస భద్రతా…
మయన్మార్‌లో నెలకొన్న సంక్షోభంపై తక్షణమే దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు చెందిన 44 సంస్థలు జి20 దేశాధినేతలను కోరాయి. ఢిల్లీలో జి20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఓ బహిరంగ లేఖ రాశారు. ‘మయన్మార్‌లో సైనిక జుంటా వేధింపులు పెచ్చుమీరిపోయాయి. దీనిపై తక్షణమే, అందరూ కలసికట్టుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక దేశాలుగా మీరు మీ పలుకుబడిని ఉపయోగించి సమస్యను పరిష్కరించాలి. అది మీ నైతిక బాధ్యత’ అంటూ స్పష్టం చేశారు. `మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 30 నెలల్లో నాలుగు వేల మందికి పైగా చనిపోయారు. ఇరవై నాలుగు వేల మందిని అక్రమంగా నిర్బంధించారు. 145 మందికి మరణశిక్ష విధించారు. ఇవి ఎఎపిసి సంస్థ విడుదల చేసిన గణాంకాలు. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది’ అంటూ తెలిపారు. `మయన్మార్ సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకొని…
టీడీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకు చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆర్థిక నేరాలకు బెయిల్ ఇవ్వకూడదన్న సీఐడీ వాదనలకు ఏకీభవించిన కోర్టు తీర్పు వెల్లడించింది. పోలీసులు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బృందం సుమారు 8 గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు విజయవాడకు తరలించారు. తాడేపల్లి సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు ఆదివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ఆదివారం ఉదయం నుంచి ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. రాజకీయ కక్షతోనే…
అక్రమార్జన కేసుల్లో డీఎంకే మంత్రులు విడుదల కావడంపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, ఆ కేసులపై పునర్విచారణ ప్రారంభమైతే మంత్రులందరికీ జైలువాసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. రెండో విడద పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం తేని జిల్లా కంభంలో జరిగిన భారీ ర్యాలీ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కంభం ద్రాక్షపండ్లకు ప్రసిద్ధి చెందిందని, ఈ ద్రాక్షతోటల పెంపకాన్ని అభివృద్ధి పరచకుండా డీఎంకే ప్రభుత్వం రాష్ట్రమంతటా గంజాయి సాగు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం కేరళకు చెందిన మందుల వ్యర్థాలను పారబోసే ప్రాంతంగా మారిందని, ముల్లై పెరియార్ డ్యాం నీటిమట్టం పెంచే విషయమై కేరళ ప్రభుత్వంతో స్టాలిన్ చర్చలు జరపలేకపోతున్నారని తెలిపారు. ఆ రాష్ట్రంలో డీఎంకే మిత్రపక్షమైన వామపక్షాలు అధికారంలో ఉండడమే దానికి కారణమని ఆరోపించారు. డీఎంకే యువరాజు ఉదయనిధి సనాతన ధర్మం నిర్మూలించాలంటూ పిలుపునిస్తున్నారని, ఈ విషయంలో పట్టుదలగా ఉంటే తొలుత ఆయన తల్లిని ఆలయాలకు…
బలహీన వర్గాలకు చెందిన 93 కులాలకు బిసి బంధు పథకం అమలు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిసి బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్లు ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం.. అధికార పార్టీ నాయకులకు, తమకు నచ్చినోళ్లకే బీసీ బంధు ఇస్తూ అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. బీసీ కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామంటూ ప్రకటించిన బీఆర్‌ఎస్ సర్కార్.. నిబంధనలకు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. బిజెపిలో ఉంటే బిసి బంధు ఇవ్వం అని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏజెంట్లను పెట్టుకొని అధికార పార్టీకి వత్తాసు పలికే వాళ్లకు బిసి పథకం అందిస్తున్నారని విమర్శించారు. బిసి పథకం కోసం సిద్దిపేట జిల్లాలో 26 వేల దరఖాస్తులు వచ్చాయని చెబుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నచోట కనీసం బిసి పథకం లబ్దిదారుల జాబితా…
ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో 2000 మందికి పైగా మృతి చెందారు. భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతోంది. వేలసంఖ్యలో గాయపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.8 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్‌హౌజ్ ప్రావిన్స్ లోని ఎల్‌ఘిల్ నగరంలో భూకంప కేంద్రంగా ప్రకంపనలు వ్యాపించినట్టు అధికారులు చెప్పారు. 18 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైంది. అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు ఈ భూకంపం ధాటికి వణికిపోయాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అకస్మాత్తుగా భవనాలు ధ్వంసం కావడంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. మృతదేహాలు, కుప్పకూలిన భవనాల శిథిలాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానక వాతావరణం కన్పిస్తోంది. కొన్ని భవంతులు కూలకపోయినా వాటికి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి.…
ఢిల్లీ వేదికగా శనివారం ప్రారంభమైన రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశాలు ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపాయి. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు. ఇందులో మునుపటి సమావేశాల కన్నా ఎక్కువ ఫలితాలతో పాటు రికార్డ్ స్థాయిలో పత్రాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భిన్నాభిప్రాయాల కారణంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం పొందేందుకు కొంచెం ఆలస్యం అయ్యింది. ఏదైమైనా.. దీనిపై ఏకాభిప్రాయం రావడంతో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ఒక శుభవార్త. మా బృందం కృషి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతుతో న్యూ ఢిల్లీ జీ20 లీడర్ల సమ్మిట్ డిక్లరేషన్ ఏకాభిప్రాయానికి చేరుకుంది’’ అని చెప్పారు. దీనిని జి20 నాయకులందరూ స్వీకరించాలని, ఇది జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాధ్యమయ్యేలా కృషి చేసిన మంత్రులకు, షెర్పాలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.…