ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ డి డైరెక్టరేట్ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడి అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జ్ హోటల్స్ రిసార్ట్ చీఫ్ విక్రమాదిత్య సింగ్, ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్ లపై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతరులపై ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసును ఈడి విచారణ జరుపుతోంది. ఇందులో అమన్ దీప్ సింగ్ దాల్ కూడా నిందితుడు. ఈ ఏడాది తొలి నాళ్లలో ఈడి అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అమన్ దీప్ సింగ్ ధాల్ కు సహాయం చేసేందుకు పవన్ ఖత్రీ, ఈడిలో క్లర్క్ గా పనిచేస్తున్న నితేష్ కోహర్ ద్వారా రూ. 5 కోట్లు లంచంగా స్వీకరించినట్టుగా దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ధాల్ అతని తండ్రి బీరేందర్ పాల్ సింగ్ ఈడి దర్యాప్తులో సహాయం కోసం ఈడి అసిస్టెంట్…
Author: Editor's Desk, Tattva News
లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగా బుక్ చేసుకొందని, మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన అని ఆమె వెల్లడించారు. “పశ్చిమబెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మూడోసారి బీజేపీ అధికారం లోకి వస్తే నిరంకుశ పాలనే ” అని ఆమె హెచ్చరించారు. టిఎంసి యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ తీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ, ఆయన తీరు ఏమాత్రం బాగా లేదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల…
స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ల వాడడంపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు తరగతి గదుల్లోకి తమ మొబైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావకూడదని స్పష్టం చేసింది ఏపీ విద్యాశాఖ. టీచర్లు క్లాస్ రూముల్లోకి వెళ్లే ముందు తమ ఫోన్లను హెడ్ మాస్టర్లకు అప్పగించాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. చాలా మంది ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను వ్యక్తిగత పనులకు వాడుతున్నారన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకున్నారు. స్కూళ్లలో బోధనా ప్రమాణాల పెంపునకు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఆటంకంగా మారిందని విద్యాశాఖ చెబుతోంది. కొత్తగా తీసుకువచ్చిన ఈ నిబంధన కఠినంగా అమలయ్యేలా అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అధికారులు. యునెస్కో 2003 లో ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తన ఆదేశాల్లో…
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి సోమవారం రాష్త్రపతి భవన్ లో విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని చెబుతూ భారత చలనచిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ స్మారక నాణెంను ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. …
ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. క్వాలిఫైయర్స్‌లో నీరజ్ ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. మరోవైపు నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల…
వాగ్నర్ కిరాయి సేనల చీఫ్ యెవెగ్నీ ప్రిగోజిన్ (62) మృతిపై రష్యా ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. మాస్కో శివార్లలో ఇటీవల కూలిన విమానంలో మృతి చెందిన వారిలో ఆయన కూడా ఉన్నట్లు దేశ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలకు కోల్పోయిన 10మందికీ జన్యుపరీక్షలు నిర్వహించామని, వారిలో వాగ్నర్ గ్రూపు నాయకుడు కూడా ఉన్నట్లు ధ్రువీకరించుకున్నామని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రిగోజిన్ మృతిని రష్యా అధికారికంగా వెల్లడించని సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనా స్థలిలో దొరికిన పది మృతదేహాలను గుర్తించారు. వారి పూర్వాపరాలను అధికారిక రికార్డుల మేరకు ధృవీకరించుకున్నారని ప్రకటనలో తెలిపారు. ఈ విమాన ప్రమాదం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందంటూ పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా.. ఆయన దాన్ని ఖండిస్తున్నారు.
తిరుమల నడక దారిలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో.. ఏడవ మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించగా.. దీంతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు చెబుతున్నారు. జూన్ నెలలో ఓ చిరుతను బంధించగా, ఆగస్టు 14న ఓ చిరుత చిక్కగా, ఆగస్టు 17న మరో చిరుత బోనులో పడింది. తాజాగా మరో చిరుత బోనులో దొరికింది.. నాలుగు చిరుతలు బోనులో పడటంతో టీటీడీతో పాటుగా భక్తులకు ఊరట అని చెప్పాలి. అటవీశాఖ అధికారులు నాలుగో చిరుతను బోనులో బంధించేందుకు వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత కూడా రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. అయితే ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో ఎలుగుబంటిని…
ఈ నెల 31వ తేదీన ముంబైలో జరిగే మూడో ప్రతిపక్ష భేటీపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతం అయింది. ఇండియా కూటమి ఎట్టకేలకు ముంబైలో రెండు రోజుల సమావేశాన్ని ఖరారు చేసుకుంది. ఈ భేటీ సందర్భంగానే ఇండియా కూటమి లోగో, 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాట్ల విషయాలపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు వెల్లడైన అజెండాతో ఈ విషయాలు స్పష్టం అయ్యాయి. ప్రతిపక్షాలు సంఘటితంగా ఒకే చిహ్నంపై ప్రజల్లోకి వెళ్లడం, అత్యంత జటిలమైన సీట్ల సర్దుబాట్లకు దిగడం ముంబై భేటీలో ప్రధానాంశాలు అవుతాయని అజెండాతో స్పష్టం అయింది. ఇండియా కూటమిలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఈ కూటమిలోకి మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరుతాయని భావిస్తున్నారు. బిజెపి శివసేన ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఎన్‌సిపి చీలికల రాష్ట్రంలో ప్రతిపక్ష భేటీ జరగడం ప్రధాన విషయంగా మారింది. ఇండియా కూటమిలో మరికొన్ని పార్టీలు వచ్చి చేరుతాయని జెడియు నేత, ప్రతిపక్ష…
వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడటం కన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకడానికి సమగ్ర, ఏకీకృత వైఖరి ఉండాలని పేర్కొన్నారు. బీ20 వ్యాపార సదస్సును ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడుతూ. ‘‘వినియోగదారుల పరిరక్షణ గురించి మనం మాట్లాడగలమా? అది సకారాత్మక సంకేతాలను పంపిస్తుంది, వినియోగదారుల హక్కుల సమస్యలను పరిష్కరిస్తుంది. మనం వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించాలి’’ అని చెప్పారు. అంతర్జాతీయ వినియోగదారుల పరిరక్షణ దినోత్సవాన్ని ఏదో ఓ రోజున జరుపుకోవాలని సూచించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్నపుడే లాభదాయక మార్కెట్ సుస్థిరమవుతుందని చెప్పారు. ఇతర దేశాలను కేవలం మార్కెట్లుగా పరిగణించడం వల్ల ప్రయోజనం ఉండదని, అలా చూడటం వల్ల ఉత్పత్తిదారులైన దేశాలకు నేడో, రేపో హాని జరుగుతుందని తెలిపారు. అభివృద్ధిలో అందరినీ సమాన…
జి 20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలోని పలు మెట్రోస్టేషన్ల గోడలపై ఖలీస్థానీ అనుకూల రాతలు వెలువడడంతో కలకలం రేగింది. వచ్చే నెల 9 , 10 తేదీలలో స్థానిక ప్రగతి మైదాన్‌లో అధునాతన కన్వెన్షన్ సెంటర్‌లో జి 20 సమ్మిట్ జరుగుతుంది. `ఢిల్లీ బనేగా ఖలీస్థాన్’, `ఖలీస్థాన్ రెఫరెండం జిందాబాద్’ అనే నినాదాలు ఆదివారం పలు స్టేషన్ల గోడలపై, ప్రముఖంగా కన్పించే చోట్ల వెలియడం సంచలనానికి దారితీసింది. శివాజీ పార్క్, పంజాబీ బాగ్ ప్రాంత స్టేష్టన్లలో వీటిని కొట్టోచ్చే రీతిలో గుర్తు తెలియని వ్యక్తులు కన్పించేలా చేశారు. కాగా నంగ్లోయిలోని ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయ పాఠశాల గోడపై కూడా భారత వ్యతిరేక రాతలు వెలిశాయి. నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) ఈ రాతలకు దిగిందని వెల్లడైంది. ఈ మధ్యకాలంలో పలు మెట్రోస్టేషన్లలో ఎస్‌ఎఫ్‌జె కార్యకర్తలు కన్పిస్తున్నారని, వీరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. జి…