Author: Editor's Desk, Tattva News

బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ఈసారి బ్రిక్స్ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు. “పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు బహుళ పక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చించడానికి బ్రిక్స్ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను” అని ప్రధాని తన ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని ఎక్స్ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్తున్నాను. బ్రిక్స్ ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ 15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న…

Read More

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది. ఇక రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై చివరి నిమిషంలో కూలిపోయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్త ఒకరు కీలక ప్రకటన చేశారు. ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ దిగేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ‘‘ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి రెండు గంటల ముందు ఓసారి అన్ని అంశాలను పరిశీలిస్తాం. ల్యాండర్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే దిగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 24కు ల్యాండింగ్ తేదీని మారుస్తాం’’ అని ఇస్రో శాస్త్రవేత్త…

Read More

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ మొదలైంది. సోమవారం పార్టీ అధినేత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 మందికి గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. మరో నలుగుర్ని హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలో టికెట్ దక్కని వారు అధికార పార్టీ కి రాజీనామా చేసి..మరో పార్టీ వైపు చూస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమెకు టికెట్ దక్కలేదు. దీనితో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ థాకరేను కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీనితో…

Read More

కేంద్ర దర్యాప్తు సంస్థ( సిబిఐ) దర్యాప్తు చేసిన 6,841 కేసుల విచారణలు దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 313 కేసులు20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్( సివిసి) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక పేర్కొంది. 2022 డిసెంబర్ 31 నాటికి మొత్తం కేసుల్లో 2.039 కేసులు పదేళ్లనుంచి 20 ఏళ్ల దాకా పెండింగ్‌లో ఉండగా,2.324 కేసులు అయిదేళ్లకు పైబడినుంచి పదేళ్ల వరకు, 842 కేసులు మూడేళ్లనుంచి అయిదేళ్ల దాకా,1,323 కేసులు మూడేళ్లకన్నా తక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. ‘దేశంలోని వివిధ కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకొంది. 2021 డిసెంబర్ 31 నాటికి6,841 కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 313 కేసులు20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి’ అని ఆ నివేదిక తెలిపింది. ఇవే కాకుండా మొత్తం 12,408 అపీళ్లు,…

Read More

మణిపూర్ హింసాకాండ బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం సుప్రీంకోర్టుకు మూడు నివేదికలు సమర్పించింది. బాధితులకు పరిహార చెల్లింపు పథకాన్ని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అల్లర్లలో భాగంగా బాధితులు తమ గుర్తింపు పత్రాలను కోల్పోయారని, వాటిని మళ్లీ జారీ చేయాలని సూచించింది. దీంతోపాటు కమిటీకి సాయంగా నిపుణులను నియమించాలని కోరింది. ఈ అంశాలను పరిగణన లోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం కమిటీ పనితీరును సులభతరం చేసేందుకు ఆగస్టు 25న ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. ‘కమిటీ సమర్పించిన మూడు నివేదికలు, మణిపూర్ బాధితులకు అవసరమైన దస్త్రాలను జారీ చేయాలని పరిహార పథకాన్ని అప్‌గ్రేడ్ చేయాలని, కమిటీకి సాయంగా డొమైన్ నిపుణులను నియమించాలని సూచిస్తున్నాయి.’ అని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నివేదికల ప్రతులను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని ఆదేశాలు జారీ…

Read More

ఏపీలో మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుందని వార్తలొస్తున్నాయి. విశాఖ-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆదివారం చెన్నై నుంచి 16 బోగీల వందే భారత్ రైలు విశాఖకు బయలుదేరింది. ఈ రైలు విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారని ప్రచారం జరుగుతోంది.  ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతారో పూర్తి సమాచారం రాలేదు. కానీ తిరుపతి నుంచి విశాఖకు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాల్తేరు రైల్వే అధికారులు స్పందిస్తూ వందేభారత్ రైలుపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.  విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ఇప్పటికే వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ నడుపుతున్నారు.  ఈ రైలులో తరచూ సాంకేతిక సమస్యలను తలెత్తుతున్నాయి. రద్దైన సందర్భాలు కూడా ఉన్నాయి. తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరో రైలును చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు మరో వాదన…

Read More

తెలంగాణ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 115 నియోజకవర్గాలకు బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బిఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఇక కెసిఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ కేసీఆర్ చేయనున్నారు. 2023 ఎన్నికలకు ప్రకటించే అభ్యర్థుల్లో ఆరేడుగురు మాత్రమే సిట్టింగ్‌లను తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్‌లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు…

Read More

భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారనే అభియోగాలపై అనంతపురం జిల్లా జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిబంధనలు పాటించకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ గత కొంత కాలంగా టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది.  ఈ క్రమంలో ఈసీకి చెందిన అధికారులు అనంతపురం జిల్లా ఉరవకొండలో నేరుగా క్షేత్ర స్థాయి పర్యటన సైతం నిర్వహించారు.  ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన విధి విధానాలు పాటించకుండా ఏకపక్షంగా ఓట్లు తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఓట్ల తొలగింపుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో పంచాయితీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2020, 2021వ సంవత్సరాల్లో ఉరవకొండలో 1,116 ఓట్ల తొలగించడానికి కారకులైన నాటి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, అనంతపురం జిల్లా జడ్పీ సీఈవో కె.భాస్కర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఉత్తర్వులు…

Read More

నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు మండిపోగా, ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ లో ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి ఎగుమతులపై డిసెంబర్ 31 వరకు 40 శాతం సుంకం విధించింది. దిల్లీలో ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులకు ఉపశమనం కల్పించడానికి కిలో రూ.25 ధరకు విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.  సోమవారం నుంచి దిల్లీలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను సిద్ధం చేసింది. ఈ ఏడాది బఫర్ స్టాక్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. దిల్లీలో సోమవారం నుంచి 10 మొబైల్ వ్యాన్‌లలో ఉల్లిపాయలు విక్రయించనున్నారు.  క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్న క్రమంలో…

Read More

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో భారీగా మార్పులు చేసింది అధిష్టానం. త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీలో మార్పులు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం కొత్త కమిటీని ప్రకటించారు. మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి, అంబికా సోనీ, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, ప్రియాంక గాంధీ, తారీఖు అన్వర్, లాల్‌థన్‌వాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్‌రావు చవాన్, అజయ్ మకెన్, చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, కుమారీ సెల్జా, గైకంగమ్, ఎన్ రఘువీరా రెడ్డి, శశిథరూర్, తమర్థ్‌వాజ్ సాహూ, అభిషేక్ మనూ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, సల్మాన్ ఖుర్షీద్, జితేంద్ర సింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా , సచిన్ పైలట్, దీపక్ బబారియాలు సభ్యులుగా నియమితులు అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం…

Read More