Author: Editor's Desk, Tattva News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వ శాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గత ఏడాదిలో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో అన్ని విభాగాలకు సంబంధించి గత ఏడాది మొత్తం 1.15 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదిక వెల్లడించింది. వీటిలో 85,437 ఫిర్యాదులు పరిష్కరించగా, మరో 29 వేలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.న ఇందులో 22 వేల ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్టు సివిసి పేర్కొంది. గత ఏడాది వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో అత్యధికంగా 43,643 హోం మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పైనే వచ్చాయి. రైల్వేల్లో 10,850 బ్యాంకుల్లో 8129 ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదిక తెలియజేసింది. ఢిల్లీ ప్రాంతంలోని ఉద్యోగులపై 7370 ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువగా ఢిల్లీ…

Read More

నిర్మల్ పట్టణంలో చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో 5వ రోజుకు చేరుకుంది. శనివారం బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం పట్ల తీవ్ర స్థాయిలో బీజేపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో ఆయన ఇంటి లోపలికి రాకుండా పోలీసులను బిజెపి నాయకులు అడ్డుకున్నారు. అదే తరుణంలో బిజెపి నాయకులు పెద్ద ఎత్తున గాజులపేట్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడ నుంచి మంత్రి నివాసానికి ర్యాలీగా వెళ్లారు. చివరకు భారీ సంఖ్యలో అక్కడకు  చేరుకున్న పోలీసులు మహేశ్వ ర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బిజెపి నాయకులు ప్రయత్నించారు. దీంతో…

Read More

సుమారు 50 ఏండ్ల తర్వాత రష్యా చేపట్టిన మూన్‌ మిషన్‌ ఫెయిల్‌ అయ్యింది. అది పంపిన లూనా-25 ప్రోబ్‌ చంద్రుడిపై కూలిపోయింది. తమ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ఆదివారం తెలిపింది. శనివారం లూనా-25తో కమ్యూనికేషన్‌ తెగిపోయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ల్యాండర్‌ నియంత్రణ కోల్పోవడంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్టు వెల్లడించింది. కాగా, ఆగస్ట్‌ 11న రష్యా ప్రయోగించిన లూనా-25 రెండు రోజుల కిందట చంద్రుడి వద్దకు చేరుకున్నది. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అంతకుముందు శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకు లూనా 25 తో.. తమకు సంబంధాలు తెగిపోయాయని రోస్‌కాస్మోస్ తెలిపింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టామని.. ప్రాథమిక పరిశోధనల ప్రకారం ల్యాండర్ చంద్రుని ఉపరితలంతో ఢీకొన్న తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు ప్రకటించింది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద…

Read More

భారతదేశపు ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3, రష్యాకు చెందిన లూనా 25 వ్యోమనౌకలు దాదాపుగా ఏకకాలంలోనే చంద్రుడిపై సజావుగా దిగేందుకు రంగం సిద్ధమైంది. 1976లో అప్పటి సోవియట్ యూనియన్ ద్వారా ప్రయోగిత లూనా 24 తరువాత చైనాకు చెందిన ఛాంగ్ 3 2013లో , ఆ తర్వాత ఛాంగ్ 4 2018లో చంద్రుడిపైకి వెళ్లాయి. అప్పటి నుంచి అక్కడ వ్యోమనౌకల ఆగమనం జరగలేదు. ఇప్పుడు విచిత్రమైన రీతిలో భారత్ చంద్రయాన్‌కు, రష్యా లూనాకు పోటీ నెలకొంది. రేస్‌లో ముందు చంద్రయాన్ 3 జాబిల్లిపై వాలుతుందని భావించారు. అయితే దీనిని లూనా 25 వెనకకు నెట్టివేసింది. ఈ నెల 21నే చంద్రయాన్‌కు ముందుగానే లూనా 25 చంద్రుడిపై వాలనుంది. చంద్రయాన్ 3 నిర్ణీత దశ ప్రకారం ఈ నెల 23న చంద్రుడిపై చేరనుంది. ఇప్పటివరకు ఏ వ్యోమనౌక వెళ్లని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకునే ఈ రెండు వ్యోమనౌకలు తమ లక్షాలను ఖరారు…

Read More

మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లకు సంబంధించి రూ.144.83 కోట్ల మేర కుంభకోణం జరిగిందని కేంద్రం గుర్తించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆదేశించారు. ఐదేళ్ల వ్యవధిలో వందలాది విద్యాసంస్థల్లో ఈ అవకతవకలు చోటు చేసుకున్నట్లు మైనారిటీ శాఖ అంతర్గత విచారణలో గుర్తించినట్లు సమాచారం. మొత్తం 34 రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో 1,572 విద్యాసంస్థలలో తనిఖీ చేపట్టగా, 21 రాష్ట్రాల్లోని 830 సంస్థల్లో అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో సదరు విద్యాసంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలను ఇచ్చే పథకాన్ని 2007-08లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 1.8 లక్షల విద్యాసంస్థలకు ఈ పథకం వర్తిస్తోంది. అయితే, ఇది భారీ ఎత్తున దుర్వినియోగం అయ్యిందని, లబ్ధిదారుల్లో 53 శాతం మంది నకిలీ వ్యక్తులేనని…

Read More

భారత సైన్యం ప్రయాణిస్తున్న వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. లడఖ్‌లోని ఖేరీ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో 10 మంది భారత సైనికులు ఉన్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. చనిపోయిన 9 మందిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తోపాటు మరో 8 మంది జవాన్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఘటన సమయంలో వాహనంలో 10 మంది ప్రయాణిస్తుండగా.. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు వివరించారు.  దీంతో గాయపడిన ఆ ఒక్క సైనికుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 10 మంది జవాన్లు సైనిక వాహనంలో కేరే గ్యారిసన్ నుంచి లేహ్ సమీంపంలోని ఖేరీకి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ…

Read More

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో గౌరవించింది. పారిశ్రామిక , ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయనకు ‘ఉద్యోగరత్న’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దక్షిణ ముంబై లోని కొలాబాలో ఉన్నటాటా నివాసానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ,డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు 85 ఏళ్ల టాటాను కలిసి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఉపాధి కల్పనారంగాల్లో విశేష సేవలందించే పారిశ్రామిక వేత్తలను గౌరవించేందుకు ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. శనివారం మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున శాలువా, ప్రశంసా పత్రంతోపాటు జ్ఞాపికను అందజేసి రతన్ టాటాను సన్మానించారు. రతన్‌టాటాకు ఉద్యోగరత్న పురస్కారం అందించడం ద్వారా ఆ అవార్డుకే మరింత గౌరవం పెరిగిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రశంసించారు. మన దేశం లోని అనేక రంగాల్లో టాటా గ్రూపు సహకారం అపారమైందన్న ఆయన టాటా అంటేనే నమ్మకమని…

Read More

సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల తీవ్రత, రీచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. 2018లో మహిళా జర్నలిస్టులను కించపరిచేలా నటుడు, తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరూతు ఆయన వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు జులై 14న తిరస్కరించింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.  ఈ వ్యాజ్యంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టి ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ‘ఎవరైనా సోషల్ మీడియాను ఉపయోగిస్తే దాని ప్రభావం.. రీచ్ గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది. తన క్లయింట్ కంటి అనారోగ్యానికి మందులు వేసుకోవడం వల్ల…

Read More

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు ప‌లు చోట్ల మోస్త‌రు వ‌ర్షం కురిసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో.. శుక్ర‌వారం ఉద‌యం 8:30 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 8:30 గంట‌ల వ‌రకు ప‌లు చోట్ల న‌మోదైన వ‌ర్షపాతం వివ‌రాలు ఇలా ఉన్నాయి: హైద‌రాబాద్ ప‌రిధిలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో అత్య‌ధికంగా 11.5 మి.మీ., శివ‌రాంప‌ల్లిలో 10.5 మి.మీ., టోలిచౌకీలో 10 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిశీలిస్తే నిజామాబాద్‌లోని భీంగ‌ల్‌లో అత్య‌ధికంగా 107.8 మి.మీ., జ‌య‌శంక‌ర్‌లోని ముత్తారం మ‌హాదేవ్‌పూర్‌లో 107 మి.మీ., నిర్మ‌ల్‌లో 103, క‌మ్మ‌ర‌ప‌ల్లిలో 100.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కాగా, రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  శనివారం నుంచి…

Read More

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం దక్షిణాది దేశాల గళంగా మారిందని కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత దేశంవైపు చూస్తున్నాయని, ప్రపంచంలోని నలుమూలల నుంచి కంపెనీలు తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను మన దేశంలో ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు.  ‘ఆజ్ తక్ జీ20 సమ్మిట్’లో శనివారం ఆయన పాల్గొంటూ  నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని గుర్తు చేశారు. యాపిల్, ఎయిర్‌బస్ తమ తయారీ కేంద్రాలను మన దేశంలో ఏర్పాటు చేస్తాయని మీరు కానీ, నేను కానీ ఎన్నడైనా ఊహించామా? అని ప్రశ్నించారు.  నేడు ఐఫోన్లలో అత్యధిక భాగం మన దేశంలోనే తయారవుతున్నాయని చెబుతూ ఎయిర్‌బస్ కంపెనీకి చెందిన సీ-295 ఫెసిలిటీని మన దేశంలో ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల రంగంలోకి కూడా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మోదీ నాయకత్వంలో…

Read More