Author: Editor's Desk, Tattva News

దేశంలోని సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతేగాక తప్పుడు కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు పెద్ద సంఖ్యలో సిమ్ కనెక్షన్లను పొందే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మే నుంచి 52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. 67,000 మంది సిమ్ కార్డు డీలర్లను బ్లాక్‌లిస్టులో పెట్టామని, 300 ఎఫ్‌ఐఆర్‌లు వారిపై నమోదు చేయడం జరిగిందని ఆయన వివరించారు. తప్పుడు కార్యకలాపాలకు పాల్పడినందుకు దాదాపు 66,000 అకౌంట్లను వాట్సాప్ తనకు తానుగా బ్లాక్ చేసిందని మంత్రి చెప్పారు. అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు ఆయన చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన డీలర్లకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. దేశంలో మొత్తం 10 లక్షల మంది సిమ్ కార్డు డీలర్లు ఉన్నారని, పోలీసు వెరిఫికేషన్ కోసం వారికి…

Read More

 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె సంసిద్ధతను వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 12న ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి ఉన్నప్పటికీ, ఆమె స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిన్నట్లు తెలుస్తున్నది.  ఇప్పటి వరకు తెలంగాణాలో రాజన్నా రాజ్యం తీసుకొస్తానంటూ తిరిగిన ఆమె ఇక నుండి ఏపీ రాజకీయాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆమెను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపించేందుకు కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడి చేస్తున్నాయి.  షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కర్ణాటక ఎన్నికలు కాగానే సిద్దపడినా, తెలంగాణ రాజకీయాలకే పరిమితంగా ఉంటానని ఆమె చెబుతూ ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండే వ్యతిరేకత వచ్చింది.…

Read More

భారత ప్రభుత్వం ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది. చంద్రుడికి సమీప కక్షలోకి చేరిన చంద్రయాన్ 3 లో ప్రొపెల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యుల్ గురువారం విజయవంతంగా వేరుపడ్డాయి. ప్రొపెల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యుల్ విజయవంతంగా విడిపోయాయని ఇస్రో గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. ఇది చంద్ర యాన్ ప్రయోగంలో మరో అత్యంత కీలక ఘట్టం. ఇకపై ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా చంద్రుడి దిశగా తన ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ల్యాండర్ మాడ్యూల్ ను మరికొంత కింది కక్ష్యలోకి చేర్చి, వేగాన్ని తగ్గించే కార్యక్రమాన్ని ఆగస్ట్ 18 సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభిస్తామని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ భారత్ కు చెందిన మూడు ఉపగ్రహాలున్నాయని తెలిపింది. ఆగస్టు 16వ తేదీన చంద్రుడికి అత్యంత సమీపంలోని 153 x163 కిలోమీటర్ల కక్ష్యలోకి చంద్రయాన్ 3 వెళ్ళింది. ఇప్పుడు, ఆగస్ట్ 17న…

Read More

తెలుగు రాష్ట్రాల్లో కీలకమై రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం అమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకల క్రమబద్ధీకరణతో పాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్‌- డోన్‌ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్‌ పనులకు అమోదం తెలిపింది. వీటితో పాటు దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టు పనులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్‌- కర్నూలు జిల్లా డోన్‌ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్‌ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. గుంటూరు – బీబీనగర్‌ మధ్య 239 కి.మీ. మార్గాన్ని రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు రూ.2,853.23 కోట్లు కేటాయించారు. గుంటూరు – బీబీనగర్‌ మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌తో గుంటూరు, పల్నాడు ప్రాంతాలను ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని…

Read More

దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏకమైన విపక్ష ఇండియా కూటమిలో పార్టీల మధ్య అప్పుడే తగాదాలు మొదలయ్యాయి. ఓవైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వెనక్కి తగ్గి స్ధానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలకు సహకరించాలని గతంలో పలు పార్టీలు కోరాయి. దీనికి అంగీకరించిన కాంగ్రెస్ ఇప్పుడు మారుతున్న పరిస్దితుల నేపథ్యంలో ఈ హామీకి కట్టుబడి ఉంటుందా/ అన్న చర్చ మొదలైంది. ఢిల్లీ పరిధిలోకి వచ్చే ఏడు లోక్ సభ సీట్లలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అల్కా లాంబా చేసిన వ్యాఖ్యలు అధికార ఆప్ కు మంట పుట్టించాయి. ఓవైపు ఇండియా కూటమి పేరుతో భేటీలు నిర్వహిస్తూ కలిసి ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇలా ఏకపక్షంగా ప్రకటనలు చేయడాన్ని ఆప్ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ ఇదే వైఖరి…

Read More

భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త రాజ్‌చెట్టికి హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన అత్యున్నత గౌరవ ప్రదమైన జార్జి లెడ్లీ బహుమతి లభించింది. చెట్టితోపాటు బయోలజిస్ట్ మైకేల్ స్ప్రింగర్‌కు కూడా ఈ బహుమతి లభించింది. హార్వర్డ్ యూనివర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్న రాజ్ చెట్టి ఆపర్టూనిటీ ఇన్‌సైట్స్ అనే సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక చలనశీలతపై అద్భుతమైన అధ్యయనం చేశారు. ఈమేరకు విధాన నిర్ణేతలతో భారీ డేటాను పంచుకుని, అపోహలను ఛేదించ గలిగారని, అందరికీ అమెరికా స్వప్నాన్ని అందుబాటు లోకి తెచ్చారని యూనివర్శిటీ అత్యున్నత ప్రధానాధికారి, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ అలాన్ ఎం. గార్బెర్ ప్రశంసించారు. బయోలజిస్టు మైకేల్ స్ప్రింగర్ హెచ్‌ఎంఎస్‌లో సిస్టమ్స్ బయోలజీలో ప్రొఫెసర్ గా ఉన్నారు. కొవిడ్ తీవ్రంగా వ్యాపించే సమయంలో కొవిడ్ పరీక్షల ప్రక్రియను నాణ్యతగా, వేగంగా అందేలా కృషి చేశారు. న్యూ హార్వర్డ్ యూనివర్శిటీ క్లినికల్ లేబొరేటరీని రూపకల్పన చేయడంలోను, నిర్వహణ లోను సహకరించారు. మైకేల్, రాజ్ వీరిద్దరూ తమ…

Read More

స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి విశ్వకర్మ పథకాన్ని ప్రకటించగా, బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇస్తారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్‌లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. గరిష్ఠంగా 5 శాతం వడ్డీతో ఈ రుణాలు పొందవచ్చు. ఇందుకు రూ.13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనుందని చెప్పారు. దీంతో 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.  చేతివృత్తుల వారికి రోజుకు రూ.500 ఉపకారవేతనంతో మెరుగైన శిక్షణ ఇస్తామని, శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత రాయితీతో తొలుత రూ.1 లక్ష రుణం వడ్డీపై ఇస్తామని, తొలి విడత…

Read More

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటిలో ఏర్పాటు చేసిన రామ కథపై ప్రవచనం కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామ కథ వినేందుకు రిషి సునాక్ వెళ్లారు. ‘‘ఈ కార్యక్రమానికి హాజరు కావడం నాకెంతో గర్వకారణం. ఇక్కడకు నేను ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా వచ్చా’’ అని ఆయన పేర్కొన్నారు. పంజాబీ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు సేవలందిస్తున్న తొలి శ్వేతజాతీయేతర ప్రధానిగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, తాను హిందువునని ఆయన గతంలో పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఆయన బాల్యం మొత్తం సౌతాప్టన్ లోనే గడిచింది. కాగా, ప్రధాని రిషికి మురారీ బాపు సాదర స్వాగతం పలికారు. ‘‘ఓ సాధారణ వ్యక్తిగా ఇక్కడికొచ్చిన మీకు ఘన స్వాగతం’’ అని వ్యాఖ్యానించారు. హిందూమత విశ్వాసాలు తన జీవితంలోని…

Read More

చంద్రుడిని చేరడానికి ఉద్దేశించిన చంద్రయాన్ 3 ప్రయాణంలో మరో కీలక, క్లిష్టమైన ముందడుగు పడింది. చంద్రుడి చుట్టూ చేస్తున్న భ్రమణంలో చివరిదైన, చంద్రుడికి మరింత సమీపంలో ఉన్న ఐదవ కక్ష్యలోకి చంద్రయాన్ విజయవంతంగా మారింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రయాన్ ప్రాజెక్టులో మూడోదైన చంద్రయాన్ 3 ప్రయాణం చంద్రుడి వైపు సాఫీగా సాగుతోంది.  మంగళవారం అత్యంత కీలకమైన, అలాగే, క్లిష్టమైన ఒక కార్యక్రమం ముగిసింది. చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్.. ఆ ప్రయాణంలో చివరిదైన ఐదవ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. అంటే, చంద్రుడి ఉపరితలానికి చంద్రయాన్ 3 మరింత దగ్గరైందన్న మాట. ఈ చర్యతో చంద్రుడి చుట్టూ చేస్తున్న పరిభ్రమణాల్లో కక్ష్యల మార్పు కార్యక్రమం ముగిసి.. ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యుల్ లు విడిపోయి, వేరువేరుగా ప్రయాణం సాగించడమనే మరో కీలక ఘట్టానికి చంద్రయాన్ సిద్ధమవుతోంది. ఈ వివరాలను ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ 3 ని విజయవంతగా 153 కిమీ…

Read More

సామాజిక ఉద్యమకారుడు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాథక్ మంగళవారం కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో ఢిల్లీలోని ఒక హాస్పిటల్‌లో తుదిశ్వాసం విడిచారని ఆయన సన్నిహితులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారంటూ బిందేశ్వర్ పాథక్ దీర్ఘకాలంపాటు అలుపెరుగని పోరాటం చేశారు. మానవ వ్యర్థ్యాలను కార్మికులు శుభ్రపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకోసం తన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  ఏకంగా 1.3 బిలియన్ల కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారు. ఈయన సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పలు నిబంధనలను ప్రవేశపెట్టాయి. బిందేశ్వర్ పాఠక్ బిహార్ లోని వైశాలి జిల్లాలో ఉన్న రాంపూర్ బఘేలీ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం 1970లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో సులభ్ ఇంటర్నేషనల్ ను స్థాపించారు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని…

Read More