ప్రపంచంలోని ఐదు వింతల్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ ఒకటి. ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి లక్షలాదిగా పర్యాటకులు ఐఫిల్ టవర్ ను చూడడానికి పారిస్ వస్తుంటారు. ఐఫిల్ టవర్ ను బాంబులతో పేల్చేస్తామని పారిస్ పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఐఫిల్ టవర్ వద్దకు వెళ్లారు. ఐఫిల్ టవర్ పై వివిధ ఫ్లోర్లలో ఉన్న పర్యాటకులను, ఐఫిల్ టవర్ వెలుపల ఉన్న పర్యాటకులను అక్కడి నుంచి పంపించివేశారు. బాంబ్ స్క్వాడ్ ను రప్పించి, క్షుణ్నంగా ఐఫిల్ టవర్ ను పరిశీలిస్తున్నారు. ఐఫిల్ టవర్ సమీప ప్రాంతాలను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐఫిల్ టవర్ లోని ఒక ఫ్లోర్ లో రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ ను కూడా పోలీసులు మూసేయించారు. ఆ ప్రదేశాన్ని కూడా క్షుణ్నంగా పరీక్షించారు. పర్యాటకులను శనివారం ఐఫిల్ టవర్ వద్దకు…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సిఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేశారనీ, ‘సీఎం పిటిషన్’లు జారీ చేశారనీ తెలిపారు. ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారని చెప్పారు. ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15 లక్షల వరకూ వసూలు చేశారనీ, అయితే, ఏ దస్త్రానికి కూడా తుది ఆమోదం రాలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేపట్టామని వివరించారు. ఈ విషయంపై సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎంవోలోని రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్…
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2023 పై ముర్ము శనివారం సంతకం చేశారు. దీంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అధికారులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కల్పించేలా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. పాలనా యంత్రాంగంపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తున్న ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. అయినప్పటికీ అధికార, విపక్షాల…
ప్రముఖ అణుభౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత బికాస్ సిన్హా (78) వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కోల్‌కతా లోని తన నివాసంలో కన్ను మూశారు. అణుభౌతిక శాస్త్రవ విభాగంలో ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ ప్రదానం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇటీవల (2022లో ) రాష్ట్ర అత్యున్నత పురస్కారం “బంగభూషణ్ ” అవార్డుతో సత్కరించింది. ఆయన మార్గదర్శకత్వంలో సహ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌న్యూక్లియర్ ఫిజిక్స్ (ఎస్‌ఐఎన్‌పి), వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రన్ సెంటర్ (విఇసిసి) సంస్థలు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చి (సిఇఆర్‌ఎన్)తో సమన్వయమై పార్టికల్ ఫిజిక్సులో ఎన్నో ప్రయోగాలు చేయడమైంది. విఇసిసి లో హోమీబాబా స్థానం సాధించారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో సభ్యత్వం పొందారు. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో కాండి జమీందారీ కుటుంబంలో జన్మించిన సిన్హా కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ చదివారు. తర్వాత కేంబ్రిడ్జి లోని…
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మరుగునపడిన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు పెట్టడమే కాక వారి కుటుంబాలకూ న్యాయం చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులు తూళ్ళ వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యుషన్ క్లబ్‌లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తులు బత్తిని మొగిలయ్య గౌడ్ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలకులు ఎంతోమంది సమర యోధుల చరిత్ర తెలియకుండా చేశారని విమర్శించారు. దేశంలో నెహ్రూ కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ చరిత్రే చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మజ్లిస్ ఒత్తిడికి లోబడి నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్ర మరుగున పడేలా చేశారని ఆయన ఆరోపించారు. నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన బత్తిని మొగిలయ్యకు…
దేశంలో ఉల్లిగడ్డల ధరలు అదుపులో పెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లలోకి వెంటనే మిగులు ఉల్లిగడ్డల స్టాక్‌ను పంపించేందుకు ఏర్పాటు చేసింది. అవసరం అయిన ప్రాంతాలను గుర్తించి ముందుగా ఈ వంటింటి సరుకును పంపిస్తారు. అక్టోబర్ నుంచి కొత్త పంట రావడం జరుగుతుంది. అప్పటివరకూ ఈ నిత్యావసర సరుకు కొరత ఏర్పడకుండా, ధరలు పెరగకుండా చేసేందుకు వివిధ మార్కెట్లకు భారీ స్థాయిలో కోటాను తరలించేందుకు రంగం సిద్ధం అయిందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ వార్తాసంస్థలకు తెలిపారు. వచ్చే నెలలో ఉల్లిగడ్డల ధరలు కిలో రూ 100 దాటుతాయని అంచనాలు వెలువడ్డాయి. పరిస్థితిని గుర్తించి , ధరల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కుమార్ చెప్పారు. ఉల్లిగడ్డకు కొరత లేదని, స్టాకులు ఉన్నాయని, పంపిణీకి సంబంధించి పలు మార్గాలు వెతుకుతున్నామని సెక్రెటరీ తెలిపారు. ఇ ఆక్షన్, ఇ కామర్స్ వీటితో పాటు రాష్ట్రాల ద్వారా వినియోదారుల సహకార సంస్థలు,…
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది. చెన్నైలోని రాయపేటలో మాజీ ఎంపీ జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ ను నడిపించారు. ప్రారంభంలో బాగానే నడిచినా తర్వాతి కాలంలో థియేటర్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో థియేటర్ ను బంద్ చేశారు. థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికులు, అటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ…
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఐపీసీ, సీసీపీ, ఐఈఏ స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ కొత్త చట్టాన్ని తీసుకోరాబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. 1860 నుంచి 2023 వరకు దేశంలో న్యాయ వ్యవస్థ బ్రిటీషర్లు రూపొందించిన విధంగానే అమలు అయ్యిందని తెలిపారు. ఆ మూడు చట్టాలను మార్చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో పెను మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. అమిత్ షా ప్రవేశపెట్టిన మూడు బిల్లులను స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు. ఇక శాంతి భంగం కలిగించే…
సుమారు అర్ధ శతాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా వెలుగొందిన రష్యా మరోసారి సారి తన సత్తా ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధృవపు రహస్యాలను వెలికి తీసేందుకు చంద్రయాన్ తరహాలో తాజాగా లూనా-25 రాకెట్‌ను ప్రయోగించింది. రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25 నిప్పులు కక్కుతూ నింగికెగసింది. రష్యా అంతరీక్ష సంస్థ రాస్‌కాస్మొనాస్ ప్రకటన ప్రకారం, మరో ఐదు రోజుల్లో ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యను చేరుకుంటుంది. అనంతరం, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు అన్వేషించి అనంతరం చంద్రుడిపై దిగుతుంది. ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మొనాస్ నిపుణుల పేర్కొన్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాది పాటు ఈ వ్యోమౌనక చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతుంది. జాబిల్లిపై మట్టిని సేకరించి పరీక్షిస్తుంది. అనేక దీర్ఘకాలిక పరిశోధనలు కూడా…
వరుసగా మూడోసారి రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుత వడ్డీ రేటు 6.50 శాతమే కొనసాగనుంది. అయితే ఆహార ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రిజర్వు బ్యాంక్ సంకేతాలు ఇచ్చింది. గురువారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రకటించారు. 202324 ద్రవ్యోల్బణం అంచనాను ఆర్‌బిఐ 5.1 శాతం నుండి 5.4 శాతానికి పెంచింది. పెరుగుతున్న కూరగాయల ధరల కారణంగా జులై, ఆగస్టు నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని గవర్నర్ తెలిపారు. అదే సమయంలో 202324లో వాస్తవ జిడిపి వృద్ధి అంచనా 6.5 శాతం నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును 6 సార్లు మొత్తంగా 2.50 శాతం పెంచారు. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ్య విధాన సమావేశం జరుగుతుంది. …