Author: Editor's Desk, Tattva News

ఢిల్లీ గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ (సవరణ) బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిజెపితో పాటు పివి మిథున్‌ రెడ్డి (వైసిపి), పినాకి మిశ్రా (బిజెడి), రాహుల్‌ రమేష్‌ షెవాలే (శివసేన (షిండే) ) బిల్లుకు మద్దతు ఇవ్వగా, టిడిపి హాజరుకాలేదు. బిల్లును కాంగ్రెస్‌, డిఎంకె, టిఎంసి, సిపిఎం, జెడియు, ఎన్‌సిపి, ఎస్‌పి, సిపిఐ, ఐయుఎంఎల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, శివసేన (ఠాక్రే), ఆర్‌ఎస్‌పి, ఆప్‌ తదితర ఇండియా కూటమి పార్టీలతో పాటు బిఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. డిఎంకె తరపున దయానిధి మారన్‌ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్‌ స్థానంలో ప్యానెల్‌ స్పీకర్‌ రాజేంద్ర అగర్వాల్‌ మరో సభ్యుడిని మాట్లాడేందుకు పిలవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంకె సభ్యులు వాకౌట్‌ చేశారు. ఆప్‌ ఎంపీ సుశీల్‌…

Read More

ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం సమాచార బిల్లు, 2023ని గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా బిల్లుని ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ అనుమతించింది. ” ది డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, 2023” ని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ద్రవ్య బిల్లు అని, రాజ్యసభ పరిశీలన నుండి దాట వేసేందుకు ఈ బిల్లుని రూపొందించారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమగ్ర పరిశీలన కోసం ఈ బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం, వాటి సంస్థలకు మినహాయింపు ఇవ్వడంపై ప్రతిపక్ష ఎంపిలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రూరమైన చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ప్రజల గోప్యత హక్కును అణచివేసేందుకు, వ్యక్తిగత సమాచారాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌…

Read More

మణిపూర్‌లో గత మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన 35 మంది మృతదేహాలను ఖననం చేసేందుకు గురువారం కుకీజోమి వర్గానికి చెందిన గిరిజన నాయకుల ఫోరం సిద్ధమైంది. అయితే దీనిపై మణిపూర్ హైకోర్టు స్టే విధించింది. సామూహిక ఖననానికి నిర్దేశించిన ప్రాంతంలో యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభ్యర్థన మేరకు ఐదు రోజుల పాటు మృతదేహాల ఖననం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఐటీఎల్‌ఎఫ్ ప్రకటించింది. “కేంద్ర హోంశాఖ అభ్యర్థన మేరకు మృతదేహాల ఖననాన్ని ఐదు రోజులు వాయిదా వేయాలని నిర్ణయించాం. మృతదేహాలను ఖననం చేసేందుకు మేం ఎంచుకున్న స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది” అని తెలిపారు. మిజోరం సిఎం సైతం ఇదే విషయంపై తమల్ని అభ్యర్థించారని చెబుతూ ఈ విషయమై ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామని ఐటీఎల్‌ఎఫ్…

Read More

డోక్సూరి తుపాను కారణంగా చైనా అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ వరదలకు అతలాకుతలమైంది. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు, నివాస సముదాయాలన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా 20 మంది చనిపోయారని, పదుల సంఖ్యలో గల్లంతయ్యారని సమాచారం. సుమారు 8.5 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీజింగ్ లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం 140 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి బుధవారం మధ్య బీజింగ్ లో 744.8 మిల్లీ…

Read More

2024 ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ సంచలనంగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన `వారాహి విజయ్ యాత్ర’ మూడవ విడత విశాఖపట్నం నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఉభయ గోదావరి జిల్లాలో జరిపిన యాత్రకు అనూహ్యంగా స్పందన లభించింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం ఈ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుందని వెల్లడించారు. రెండు విడతలను మించిపోయేలా విశాఖ నగరంలో పవన్ వారాహి యాత్ర ఉండాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల స్పష్టం చేశారు. జనసేన నేతలు, వీర మహిళలు, జనసైనికులు సమష్టిగా కృషి…

Read More

అల్లర్లలో ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైతే ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వబోదని హరియాణా అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్పష్టం చేశారు. ఆ మేరకు ఇప్పటికే ఓ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ‘‘ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన అల్లరిమూకల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేస్తాం. దాన్ని బాధితులకు ఇస్తాం. అంతేగానీ, ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదు. ఒకవేళ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయితే మాత్రం పరిహారం చెల్లిస్తాం’’ అని ఆయన వెల్లడించాయిరు. వీహెచ్‌పీ కార్యకర్త మోనూ మనేసర్‌ వల్లే ఈ అల్లర్లు జరిగాయనే ఆరోపణలుండగా.. అతను కేవలం రాజస్థాన్‌ రాష్ట్రంలో నమోదైన కేసులో నిందితుడని చెప్పారు. కాగా.. హరియాణా అల్లర్లకు సంబంధించి మొత్తం 41 కేసులను నమోదు చేశామని, 116 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ పీకే అగర్వాల్‌ వెల్లడించారు. ఈ కేసుల దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అల్లర్లలో ఒక…

Read More

ఆలస్యం చేయకుండా మణిపూర్‌లో శాంతి స్థాపనకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరించి, తక్షణమే సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు. రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపిలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం సమర్పించారు.  ”గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో పరిస్థితి క్లిష్ట స్థితికి చేరుకుంది. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆన్‌లైన్‌లో వెలువడిన షాకింగ్‌ వైరల్‌ వీడియో దేశాన్ని ద్రిగ్భాంతికి గురిచేశాయి. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించడంలో రాష్ట్ర పరిపాలన వ్యవస్థ, పోలీసులు విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది” అంటూ వారు ఆమెకు వివరించారు.   విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకునేందుకు రెండు నెలలకు పైగా జాప్యం చేయడం సమస్య తీవ్రతను మరింత పెంచిందని పేర్కొంటూ మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన అనేక…

Read More

ప్రముఖ నటి, మాజీ ఎమ్యెల్యే జయసుధ బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జయసుధ, శాసన సభ్యురాలిగా కూడా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందారని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే సభలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. పేదల పక్షాన, బస్తీవాసుల అభివృద్ధి కోసం పని చేసిన జయసుధ చేరికతో బీజేపీకి లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని చెబుతూ తాను బీజేపీలో చేరటం చాలామందికి ఆశ్చర్యం కలిగించినా ఎప్పట్నుంచో అనుకుంటున్నానని జయసుధ తెలిపారు. హోంమంత్రి అమిత్…

Read More

లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ధోరణిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభామర్యాదలను తగు విధంగా పాటించే వరకూ తాను సభకు హాజరుకాబోనని నిర్ణయించుకున్నారు. స్పీకర్ మనస్తాపం ఆయన సభ్యుల తీరుతో విసిగిపోయిన విషయాన్ని, సభకు హాజరుకారాదని నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన సన్నిహితులు బుధవారం తెలియచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి సభలో కార్యకలాపాలకు తరచూ ఆటంకం ఏర్పడుతోంది. దీనితో విలువైన సభాసమయం వృధా అవుతుంది. మణిపూర్ పరిస్థితిపై విపక్షాలు ప్రధాని సమాధానానికి పట్టుబట్టడం, వెల్‌లోకి దూసుకువెళ్లడం, నినాదాలకు దిగడం, దీనికి ప్రతిగా అధికార పక్ష సభ్యులు కూడా పోటీగా నినాదాలకు దిగడం, పరిస్థితిని ఎంతగా అదుపులోకి తీసుకురావాలనుకున్నా, సభ్యులను ప్రాధేయపడినా ఎటువంటి మార్పు రాని దశలో స్పీకర్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. బుధవారం లోక్‌సభ ఆరంభం కాగానే స్పీకర్ స్థానంలో బిర్లా కన్పించలేదు. ఓ వైపు ప్రతిరోజూ లాగానే బుధవారం…

Read More

త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థను అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రయాణికులు ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి వీకేసింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థ స్థానంలో అడ్డంకుల్లేని టోల్‌ వ్యవస్థ లేదా ఓపెన్‌ టోల్‌ సిస్టమ్‌ అమలుకు సంబంధించిన ట్రయల్స్‌ కొనసాగుతున్నాయన్న ఆయన ఇది విజయవంతం కాగానే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే, కి.మీల ఆధారంగా చెల్లింపులు చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థతో టోల్‌ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47సెకన్లకు తగ్గించగలిగామని, ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా…

Read More