విజయవాడ నుండి రెండు సార్లు టిడిపి ఎంపీగా గెలుపొందిన కేశినేని నాని ఇప్పుడు వైసిపి వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఆయన మాటలు, చేతలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. రెండోసారి గెలిచినప్పటి నుండి టిడిపి నాయకత్వం పట్ల ధిక్కార ధోరణి ఆవలంభిస్తుండటం, నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడంతో ఆయనకు వచ్చే ఎన్నికలలో పార్టీ సీట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. పైగా, ఆయన తమ్ముడు చిన్ని ఆయనకు వ్యతిరేకంగా మారి, టిడిపిలో క్రియాశీలకంగా ఒంటి పార్టీ సీట్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ సీట్ ఇస్తే పోటీ చేస్తా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా అంటూ వచ్చిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని చెబుతూ తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అంటూ వైసిపిలో చేరేందుకు సిద్దమనే సంకేతం ఇచ్చారు. ఇదే సమయంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వైసీపీలోకి…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జి. మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాజ్‌భవన్‌లలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను దేశ వ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్ లలో జరపనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని. అందుకే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం రంగాల వారీగా గత తొమ్మిదేళ్లలో కేంద్రం ప్రభుత్వం ఏం చేసిందో ప్రకటిస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్రం అనేకసార్లు సమావేశాలు నిర్వహించిందని, సామరస్యపూర్వకంగానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.…
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించే ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే ముందు రెండు వైపులా కాల్పులు జరిగాయి. వాతావరణం సరిగ్గా లేక పోవడం, వర్షాలు కురుస్తుండడంతో దీన్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు పూంచ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద కంచెను దాటడానికి ప్రయత్నించారని, వారి ప్రయత్నాన్ని ఆర్మీజవాన్లు, పోలీస్‌లు అడ్డుకోగలిగారని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. గుల్పూర్ సెక్టార్ లోని కర్మారా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన జవాన్లు హెచ్చరించడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ ప్రాంతమంతా దిగ్బంధం చేసి ఉగ్రవాదులను అదుపు లోకి తీసుకోగలిగారు. నిందితులు మొహమ్మద్ ఫరూక్ (26). మొహిద్ రియాజ్ (23), మొహిద్ జుబాయిర్ (22) అరెస్టయ్యారు. కాల్పుల్లో ఫరూక్ కాలికి గాయమైంది. నిందితుల నుంచి భారీగా ఆయుధాలను, ప్రెసర్ కుక్కర్‌లో దాచి ఉంచిన రూ. 100 కోట్ల విలువైన 20 ప్యాకెట్ల…
రాబోయే రోజుల్లో కృత్రిమ మేథస్సు వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని పలువురు పరిశ్రమ నేతలు, విద్య వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారంతా కలిసి మంగళవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘మహమ్మారి, అణుయుద్ధం వంటి ఇతర సామాజిక స్థాయి ప్రమాదాలతోపాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉంటేనే ‘కృత్రిమ మేథస్సు ప్రమాదాన్ని తగ్గించడం సాధ్యం.’ అని సెంటర్ ఫర్ ఎఐ సేఫ్టీ (సిఎఐఎస్) వెబ్‌సైట్ ప్రకటన పేర్కొంది. ఇక ఎఐ (కృత్రిమ మేథస్సు) నిపుణులు, పాత్రికేయులు, విధాన నిర్ణేతలు, ప్రజలు కృత్రిమ మేథస్సు నుండి ముఖ్యమైన మరియు తక్షణ నష్టాల గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు.’ అని సిఎఐఎస్ వెబ్‌సైట్ తెలిపింది. కాగా, కృత్రిమ మేథస్సు ప్రమాదానికి సంబంధించిన బహిరంగ లేఖపై మూడు ప్రముఖ ఎఐ కంపెనీల ఉన్నతాధికారులతో సహా 350 కంటే ఎక్కువ ఎఐ అధికారులు, పరిశోధకులు, ఇంజనీర్లు సంతకం చేశారు. అలాగే ఓపెన్ ఎఐ సిఇఓ సామ్ ఆల్ట్‌మాన్, గూగుల్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కూడా హైకోర్టు షరతు విధించింది. విచారణకు సహకరించాలని హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించేలా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ఈనెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తిస్థాయిలో విచారించి తుది ఉత్తర్వులివ్వాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. ఈ పిటిషన్ పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈనెల 25న ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇటీవల ఈడీ దాఖలు చేసిన 4వ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకొంది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. 278 పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది. సౌత్ గ్రూప్‌లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్ అరోరాతో ఉన్న…
మణిపూర్‌లో ఇటీవల చెలరేగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాయి. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా , మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా నాలుగు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పెద్ద ఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న చురాచంద్‌పూర్ ప్రాంతంలో పర్యటించారు. ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తదితరులు వెంట రాగా హెలికాప్టర్‌లో చురాచంద్‌పూర్ చేరుకున్న అమిత్ షా చర్చి నాయకులతో పాటుగా కుకి తెగకు చెందిన మేధావులు, సభ్య సమాజం నేతలు,…
ఒక పౌర వ్యోమగామితో సహా మొత్తం ముగ్గురు వ్యోమగాములతో చైనా మంగళవారం తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌కు మూడో విడతగా విజయవంతంగా పంపగలిగింది. వాయువ్య చైనా లోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు లాంగ్ మార్చ్ 2ఎస్ రాకెట్ ద్వారా షెంజు 16 వ్యోమనౌకను ప్రయోగించింది. ప్రయోగించిన పది నిమిషాల తరువాత భూమికి 400మీ ఎత్తున షెంజు 16 మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది. చైనా సొంత అంతరిక్షకేంద్రం పూర్తిగా అందుబాటు లోకి వచ్చిన తరువాత వ్యోమగాములు వెళ్లడం ఇదే మొదటిసారి అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సిఎంఎస్‌ఎ) డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికియాంగ్ వెల్లడించారు. ఇప్పటివరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములు కాగా, ఈసారి పౌర వ్యోమగామి కూడా వెళ్లడం విశేషం. ఇప్పుడు వెళ్లిన వారిలో మిషన్ కమాండర్ జింగ్ హైపింగ్, స్పెషలిస్ట్…
తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామంటూ హరిద్వార్ కు మంగళవారం చేరుకున్న భారత రెజ్లర్ల నిర్ణయాన్ని రైతు సంఘం నేత నరేష్ తికాయత్ వద్దని, వారించి అడ్డుకున్నారు. రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తూ.. 5 రోజులు ఆగాలంటూ కోరారు. గంగా నదిలో వేసేందుకు రెజ్లర్లు తమ వెంట హరిద్వార్ కు తీసుకెళ్లిన పతకాలను నరేష్ తికాయత్ తీసుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 5 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. నరేష్ తికాయత్ సూచనతో హరిద్వార్ గంగ నదిలో తమ పతకాలను నిమజ్జనం చేయకుండానే రెజ్లర్లు మళ్లీ ఢిల్లీకి బయలుదేరారు. 5 రోజుల్లోపు బ్రిజ్ భూషణ్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. జూన్ 11వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 4, 5 రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.…
దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా స్వచ్చ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకంలో భాగంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్‌గా నియమించింది. క్లీన్ మౌత్ కాంపేయిన్ కోసం సచిన్ అయిదేళ్ల పాటు స్మైల్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి పునాది నోటి ఆరోగ్యమేనని చెప్పారు. అలాగే ఫిటెనెస్‌పై అవగాహన కూడా ముఖ్యమని చెప్పారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఫిట్‌నెస్‌పై అవగాహనతో క్రమశిక్షణతో మెలగడం చాలా ముఖ్యమని సచిన్ టెండూల్కర్ తెలిపారు. ఫిట్‌నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదని, మానసిక ఆరోగ్యం, నోటి శుభ్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. 50 శాతం మంది చిన్నారులు నోటి సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారని చెబుతూ అవి వారి జీవితాలను…