త్వరలోనే హైదరాబాద్ నగరంలో బోనాల పండగ సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 22 నుండి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రరకరణ్ రెడ్డి,మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్ విజయ లక్ష్మీ, డీజీపీ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న గోలొండలో బోనాలు ప్రారంభం…
Author: Editor's Desk, Tattva News
కొత్త పార్లమెంటుకు సంబంధించిన బీజేపీకి ప్రతిపక్షాలకు తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంటు భవనం రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడం, ప్రారంభోత్సవానికి అసలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు ఆహ్వానం అందించకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రధాని, బీజేపీ తీరును నిరసిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు.. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదంటూ ఉమ్మడి ప్రకటన చేశాయి. మరోవైపు పార్లమెంటు ఆవరణలో స్పీకర్ కుర్చీ రాజదండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనిపై తాజాగా దుమారం చెలరేగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటీష్ చివరి వైశ్రాయ్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అధికార బదిలీకి గుర్తుగా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు అందించినట్లు బీజేపీ వెల్లడించింది. అయితే అందుకు సరైన ఆధారాలు లేవని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్…
కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు అని ధ్వజమెత్తారు. రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఢిల్లీలో లిక్కర్ దందా చెసిన వారు తెలంగాణలో చేయలేరా? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో పివి నరసింహారావు జయంతి జరిపిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పాలని నిలదీశారు. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం ఏమిటి? ఎపిలో కాంగ్రెస్ గెలుస్తదా? అంటూ కర్ణాటక ఎన్నికల ప్రస్తావనను కొట్టిపారేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. తనతో ఈటల, రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనేది మీడియా కల్పనే అంటూ ధ్వజమెత్తారు. ఒక వర్గం మీడియా…
ప్రముఖ దర్మక నిర్మాత కె వాసు శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా మన మెగాస్టార్ చిరంజీవిని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ దర్శకుడే. చిరంజీవి ‘ప్రాణంఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది కె వాసునే. ఆ తర్వాత కూడా చిరుతో కలిసి కోతలరాయుడు, తోడు దొంగలు, అల్లులొస్తున్నారు.. వంటి సినిమాలు కూడా చేశారు. ఇక డివోషనల్ మూవీస్ లో ఒక క్లాసిక్ గా ఉన్న విజయ చందర్ ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ని కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. అలాగే ‘అయ్యప్ప స్వామి మహత్యం’ని కూడా వాసునే డైరెక్ట్ చేశారు. ఇక బ్రహ్మానందంని హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన వ్యక్తి కూడా ఈయనే.…
ఆస్ట్రేలియాలోని ప్రతిపక్షాలను చూసైనా సవ్యంగా నడవడం నేర్చుకుంటే మంచిదని ప్రధాని నరేంద్ర మోదీ భారత విపక్షాలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఐదురోజుల విదేశీ పర్యటను ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో ఏర్పాటు అయిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ ద్వారా ఆవిష్కృతం అవుతోంది. దీనిని నిరసిస్తూ , ప్రజాస్వామ్య పద్ధతులను మోడీ కాలరాస్తున్నారని పేర్కొంటూ ప్రతిపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు సిద్ధం అయ్యాయి. దీనిని ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలోని విపక్షాలకు గులాంగిరీ పద్థతి పోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వైపు విపక్షాలు మొగ్గు చూపుతున్న అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఓ పెద్ద పార్టీ చెప్పినట్లు నడుచుకునే పాత బానిస వైఖరి ఇప్పుడు తిరిగి తలెత్తిందని తెలిపారు. తాను ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అక్కడి ప్రతిపక్షాల వైఖరిని గమనించానని, ఆ పార్టీలు జాతీయ విషయాలలో కనబరుస్తున్న నిర్మాణాత్మక వైఖరి ఆకట్టుకుందని,…
మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని లండన్‌లో వేలం వేశారు. ఈ ఖడ్గం వేలంలో ఏకంగా కోటీ 40 లక్షల 80 వేల 900 పౌండ్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ. 144 కోట్లకు పైనే ఉంటుంది. వేలం నిర్వహించిన బాన్‌హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు బాన్‌హమ్స్ తెలిపింది. 18వ శతాబ్ధంలో ఎన్నో యుద్ధాలను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. టైగర్ ఆఫ్ మైసూర్ గా సుప్రసిద్ధుడైన టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించి రక్షించుకున్నాడు. టిప్పు సుల్తాన్ మృతి తర్వాత అప్పటి బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బయిర్డ్ ఈ ఖడ్గం చేజిక్కించుకుని లండన్ తరలించాడు. ఈ టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని మే 23న వేలం వేసినట్లు బోన్హమ్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఖడ్గాన్ని…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గానూ కలెక్టర్లకు రూ. 105 కోట్ల నిధులు విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం…
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్, సాయిను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఈ కేసులోఅరెస్ట్ చేసిన వారి సంఖ్య 43కి చేరుకుంది. ఈ కేసులో మే24వ తేదీన కూడా సిట్ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏఈ పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన రాయ్‌పూర్‌కు చెందిన దివ్య, రవి, కిశోర్‌లను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్టు అధికారులు గుర్తించారు. దీనితో వారిని విచారించిన సిట్.. పోలీసులు చెప్పిన వివరాల ఆధారంగా అనుమానం రావడంతో అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజి కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. వీరిలో 11 మంది జైలు నుంచి ఇప్పటికే రిలీజ్ అయ్యారు.…
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి. నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. తీవ్రమైన వేడి కారణంగా వాటి ఆరోగ్యం క్షీణించింది పార్క్ అధికారులు పేర్కొంటున్నారు. వీటి మరణంతో కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఐదుకు చేరింది. 23న చిరుత పిల్ల మృతి చెందిన తర్వాత మూడింటితో పాటు జ్వాలాను పాల్పూర్‌లోని వన్యప్రాణుల వైద్యశాలకు తరలించారు. వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించినా వాటిని కాపాడలేకపోయారు. జ్వాలాతో పాటు పిల్లలు మామూలుగా లేవని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల వరకు…
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో ఏడు ర్యాంకులు ఆంధ్రాకు రాగా మూడు ర్యాంకులు తెలంగాణకు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రాకు ఎనిమిది ర్యాంకులు, రెండు ర్యాంకులు తెలంగాణకు వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో బి జశ్వంత్(తూర్పుగోదావరి)కు ప్రథమ ర్యాంకు, ఎన్. వెంకట్ తేజ(చీరాల)కు ద్వితీయ ర్యాంకు, ఎస్ లక్ష్మి(హైదరాబాద్)కి తృతీయ ర్యాంకు, డి. కార్తికేయ రెడ్డి(తెనాలి)కి నాలుగో ర్యాంకు, వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)కి ఐదో ర్యాంకు, గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)కి ఆరో ర్యాంకు, హర్షిల్ సాయి(నెల్లూరు)కి ఏడో ర్యాంకు, చిద్విలాస రెడ్డి(గుంటూరు)కి ఎనిమిదో ర్యాంకు, గిరి వర్సితకు (అనంతపురం) తొమ్మిదోవ ర్యాంకు, గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)కి పదో ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ అనిరుధ్(విశాఖ పట్నం)కు ప్రథమ ర్యాంకు, మణిందర్ రెడ్డి(గుంటూరు)కి ద్వితీయ ర్యాంకు, ఉమేష్ వరుణ్(నంది గామ)కు మూడో ర్యాంకు, అభినీత్(హైదరాబాద్‌కు)…