వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పై అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి కోర్టు సూచించింది. ఎల్లుండి అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. అరెస్ట్ చేయకుండా సీబీఐని ఇప్పుడు ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. దీనితో అవినాష్ రెడ్డికి షాక్ తగిలినట్లైంది. మరోవైపు విచారణ సందర్భంగా సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు…
Author: Editor's Desk, Tattva News
చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోట్లను బ్యాంక్‌ల్లో మంగళవారం నుంచే మార్చుకోవచ్చు. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ సమయం ఇచ్చింది. నోట్లు మార్చుకునేందుకు 4 నెలల సమయం ఉన్నందున కస్టమర్లు వెంటనే బ్యాంక్‌లకు వెళ్లాల్సిన అవసరంలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. చలామణి నుంచి ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నప్పటికీ, గడువు వరకు చెల్లుబాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారులు రూ. 2000 నోట్లను తిరస్కరించడానికి వీలులేదని, తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. నోట్ల రద్దు మూలంగా ఎన్-రెసిడెంట్ ఇండియన్స్(ఎన్‌ఆర్‌ఐ)లు, హెచ్1బీ వీసాలు ఉన్న వారి నోట్ల వెనక్కి తీసుకుంటున్నందున ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నోట్లను ఉపసంహరించుకోవడం, కొత్త వాటిని జారీ చేయడం అనేది ఆర్బీఐ సాధారణంగా చేస్తూనే ఉంటుందని, ఈ సారి రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. సెప్టెంబర్ 30…
“కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడదాం. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే నినాదాన్ని పల్లెపల్లెకు తీసుకెళదాం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే విషయాన్ని గడప గడపకూ తీసుకెళదాం” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. హైదరాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ –కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతాం. ఆ దుష్ట చతుష్టయ పార్టీలను బజారుకీడుద్దామని స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్తులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలుసహా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు బాధల్లో ఉన్నారని, కేసీఆర్ పాలన విరగడ కావాలని కోరుకుంటున్నరని సంజయ్ తెలిపారు. వాళ్లంతా ఆశగా బీజేపీవైపు ఎదురు చూస్తున్నరని చెబుతూ బీజేపీ సింహంలా సింగిల్ గానే కొట్లాడుతుందని, అధికారంలోకి వస్తుందని, బీజేపీ ఆధ్వర్యలో పేదల రాజ్యాన్ని స్థాపించడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాంగనే తెలంగాణలో…
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సోమవారం ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. కదలిలు లేకుండా పడివున్న ఆదిత్యసింగ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆదిత్య సింగ్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అతని మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆదిత్యసింగ్ డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్ల మరణించాడా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో కనిపించాడు. స్ప్లిట్స్…
గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాల కింద దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కాగా, ఈ మొత్తంలో రూ. 63 కోట్లు ప్రయాణాల భత్యాల కిందనే వెచ్చించడమైంది. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు బయటపడ్డాయి. 2021-22 లో కరోనా వైరస్ వ్యాప్తి తరువాత రాజ్యసభ సభ్యులకు రూ. 97 కోట్లు ఖర్చయ్యాయి. ఈ మొత్తంలో రూ. 28.5 కోట్లు స్వదేశీ ప్రయాణాలకు, రూ.1.28 కోట్లు అంతర్జాతీయ ప్రయాణాలకు ఖర్చయ్యాయి. వేతనాలుగా రూ. 57.6 కోట్లు చెల్లింపులు కాగా, వైద్యం కోసం చెల్లించిన బిల్లుల వ్యయం రూ.17లక్షలు, ఆఫీస్ ఖర్చులుగా రూ.7.5 కోట్లు వినియోగమయ్యాయి. ఎంపీలకు సమాచార సాంకేతికత సహాయం కింద రూ. 1.2 కోట్లు ఖర్చయ్యాయి. 2021-23 లో మొత్తం రూ. 100 కోట్లు ఖర్చయ్యాయి. ఇందులో రూ.33 కోట్లు స్వదేశీ, విదేశీ ప్రయాణాలకు ఖర్చయ్యాయని మధ్యప్రదేశ్‌కు చెందిన చందర్ శేఖర్…
కొద్దిరోజుల పాటు శాంతి నెలకొన్న మణిపూర్‌లో మళ్లీ సోమవారం మధ్యాహ్నం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో మెయితీ, కుకీ సముదాయాలు మళ్లీ బాహాబాహీకి దిగాయని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఘర్షణలు స్థానిక మార్కెట్‌లో మొదలయ్యాయి. ఆ ప్రాంతంలో దహనకాండ వార్తలు అందగానే కర్ఫూ ప్రకటించారు. మణిపూర్‌లో అనేక అంశాలపై నెలకు పైగా తెగల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నెల ఆరంభంలో కూడా ఘర్షణలు చెలరేగగా, సైన్యం పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఘర్షణలో దాదాపు 70 మంది చనిపోయారు. కోట్లాది ఆస్తి నష్టం జరిగింది. వేలాది మంది ప్రభుత్వ నిర్వహణ శిబిరాలకు తరలి వెళ్లారు. రిజర్వు ఫారెస్ట్ నుంచి కుకీ గ్రామస్థులను ఖాళీ చేయించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో చిన్నపాటి ఘర్షణలు మొదలయ్యాయి.మణిపూర్‌లో మెయితీలు 64 శాతం ఉన్నారు. వారు 10 శాతం భూమిని ఆక్రమించారు. గిరిజనేతరులు నోటిఫైడ్ హిల్ ఏరియాలో భూమి కొనడానికి అనుమతిలేదు. అయితే వారిని ఎస్టీ క్యాటగిరిలో…
సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శరత్‌బాబు.. ఈరోజు తుదిశ్వాస విడిచారు. నెలరోజులకు పైగా శరత్‌బాబుకు ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. శరీరం మొత్తం విషపూరితం కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం సహా ఇతర అవయవాలు దెబ్బతిని శరత్‌బాబు మరణించారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.1951 జులై 31న విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి దంపతులకు శరత్‌బాబు జన్మించారు. శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. సత్యనారాయణ దీక్షితులు అని కూడా కొంత మంది చెబుతుంటారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. కాన్పూర్ నుంచి శరత్‌బాబు కుటుంబం ఆమదాలవలసకు వలస వచ్చింది. ఆమదాలవలసలో రైల్వే క్యాంటీన్‌ను శరత్‌బాబు కుటుంబం నడిపేది. ఆ…
కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు ఆదివారం మధ్యాహుం కురిసిన అకాల వర్షానికి అతలాకుతలమైంది. గాలి, వాన భీభత్సం సృష్టించాయి. కొనిు ప్రాంతాల్లోనూ వండగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. రహదారులు ఈతకొలన్లను తలపించాయి. జలదిగ్బంధంలో ప్రజలు విలవిల్లాడి పోయారు. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీయడంతో పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. సదాశివనగర్, కెఆర్ అండర్‌పాస్, కుమారకృప రోడ్డు, చిత్రకళా పరిషత్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తడంతో రాకపోకలపై ఆంక్షలు విధించారు.కెఆర్ సర్కిల్ వద్ద ఉను అండర్‌పాస్‌లో వర్షపు నీటిలో ఒక కారు చిక్కుకుపోవడంతో కృష్ణాజిల్లాకుచెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానురేఖ (22) చనిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. కొత్తవారు కావడంతో రోడ్డు మీద వాస్తవిక నీటి లోతును గుర్తించకుండా కారును ముందుకుపోనియ్యడంతో అండర్‌పాస్‌లో కొత్తదూరం వెళ్లాక వాహనం మునిగిపోయింది. కారులో ఉన్నవారంతా అతికష్టం మీద బయటకు…
రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదయినా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. అయితే వీటిపై దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) స్పష్టత ఇచ్చింది. రూ.2000 నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రాన్ని నింపాల్సిన అవసరం లేదని ఎస్‌బిఐ స్పష్టంచేసింది. రూ.20 వేల వరకు నేరుగా బ్యాంకులో మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే ఎలాంటి ఐడి ప్రూఫ్‌ను సమర్పించాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. నోట్ల మార్పిడి సమయంలో రిక్విజిషన్ ఫారం నింపాల్సి ఉంటుందని, దానికి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు ప్రూఫ్‌గా జత చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో మెస్సేజిలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బిఐ తాజాగా ఈ స్పష్టత ఇచ్చింది.ఈ…
తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన రాజ్-కోటి సంగీత ద్వయంలో రాజ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంగీత ప్రపంచంలో రాజ్-కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది. దశాబ్దాలపాటు ఈ ద్వయం సినీప్రియులను తమ సంగీతంతో అలరించింది. రాజ్ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్-కోటి ద్వయం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించింది. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరు పనిచేశారు. ‘ముఠామేస్త్రి’, ‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్’ వంటి చిత్రాలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్ సొంతంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’,…