Author: Editor's Desk, Tattva News

తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికైనందున పది రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. తెలంగాణ, ఒడిశాలో రెండు సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి కె కేశవరావు కాంగ్రెస్‌లో చేరేందుకు భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నుంచి నిష్క్రమించిన తరువాత రాజ్యసభ నుంచి ఇటీవల రాజీనామా చేశారు. ఒడిశాలో బిజూ జనతాదళ్ (బిజెడి) ఎంపి మమతా మొహంతా తన రాజ్యసభ సీటుకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సోనోవాల్, సింధియా కాకుండా లోక్‌సభకు ఎన్నికైన ఇతర రాజ్యసభ సభ్యుల్లో కామాఖ్య ప్రసాద్ తాసా (బిజెపి), మిశా భారతి (ఆర్‌జెడి), వివేక్ ఠాకూర్ (బిజెపి), దీపేందర్ సింగ్ హూడా (కాంగ్రెస్),…

Read More

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత గత మూడు రోజులుగా తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. శాంతిభద్రతలను అదుపు చేయడం , ట్రాఫిక్‌ను నియంత్రించడం లో పోలీస్‌లు తమ విధులకు గైరు హాజరు కావడంతో పరిస్థితిని యథాప్రకారం అదుపు లోకి తీసుకురాడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ప్రకటించిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనుస్ గురువారం మధ్యాన్నం దేశంలోకి చేరుకోనున్నారు.  రెండోరోజు బుధవారం విద్యార్థులు, స్కౌట్ సభ్యులు ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పోలీస్ ఉన్నతాధికారిగా మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్‌ఎబిగా నియామకమైన అడిషనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎఐజి) ఎకెఎం షహిదుర్ రెహ్మాన్ పోలీస్‌లు తమ విధులకు హాజరు కావాలని, ప్రజల భద్రత, శాంతిభద్రతలు పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు పోలీస్‌లు స్నేహితులని, ప్రజల కోసమే పనిచేస్తారని, పోలీస్‌లు లేకుండా సమాజాన్ని ఊహించలేమని, అందువల్ల వదంతులను విడిచిపెట్టి విధులకు తిరిగి దశల వారీగా…

Read More

ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సమావేశమై ఈ మేరకు ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. నిబంధనను రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి హామీ కూడా ఇచ్చింది. మరోవైపు.. గత ప్రభుత్వంలో ఎక్సైజ్‌లో జరిగిన అవతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చించారు. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తొలగించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్…

Read More

మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లోభారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.  మంగళవారం జరిగిన సెమీస్‌లో వినేశ్ పొగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్‌ను మట్టికరిపించి పైనల్ మ్యాచుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తుంది. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది. మంగళవారం రాత్రి…

Read More

షేక్‌ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్థరాత్రి అధ్యక్షుడి ప్రెస్‌ సెక్రటరీ ప్రకటన చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ‘స్టూడెంట్స్‌ అగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌’ ప్రతినిధులు మహమ్మద్‌ యూనస్‌ పేరును కొత్త ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించారు. దేశంలో సైనిక పాలనను, సైనిక మద్దతు ఉండే ప్రభుత్వాన్ని, నియంత పాలనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ‘స్టూడెంట్స్‌ అగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌’ జాతీయ సమన్వయకర్త నహీద్‌ ఇస్లాం మంగళవారం ప్రకటించారు. విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికవేత్త మహమ్మద్‌ యూనస్‌(84) సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్థి నేతలు మంగళవారం డిమాండ్‌ చేశారు. తాము యూనస్‌తో మాట్లాడామని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన అంగీకరించారని…

Read More

వలసదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అల్లర్లతో బ్రిటన్‌ అట్టుడుకుతున్నది. జూలై చివరి నుంచి అక్కడక్కడ కొనసాగుతున్న ఆందోళనలు శుక్రవారం నుంలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. నార్తర్న్‌ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో నిరసనకారులు పోలీసులపైకి పెట్రోల్‌ బాంబులు విసరడంతో తీవ్రరూపం దాల్చాయి. యూకే వ్యాప్తంగా ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. సౌత్‌పోర్ట్‌, రోథర్‌హామ్‌, టామ్‌వర్త్‌, లివర్‌పూల్‌, మాంచెస్టర్‌, బ్రిస్టల్‌ వంటి ఇతర పట్టణాలకు ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సౌత్‌పోర్ట్‌లో కత్తిపోటుకు గురై ముగ్గురు యువతులు మృతి చెందారు.  ఈ విషాదకరమైన హత్య తర్వాత..తప్పుడు సమాచారం వల్ల ఈ నిరసనలు జరిగాయి. హంతకుడు రువాండాకు చెందిన వ్యక్తి. ఇతను ముస్లింవలసదారుడని సోషల్‌మీడియాలో పుకార్లు వచ్చాయి. వీటివలనే నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పలు పట్టణాల్లో ఆశ్రయం పొందుతున్న హోటళ్లను తగలబెట్టారు.  మైనార్టీ బ్రిటన్లు అక్రమదోపిడికి పాల్పడుతున్నారని నిరసనకారులు నినదించారు. ఈ నిరసనలను ప్రధానమంత్రి స్టార్మర్‌ తీవ్రంగా…

Read More

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్ధితిపై బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. తివారీ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపధ్యంలో నెలకొన్న పరిస్ధితులు విచారకరంగా ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతల పరిస్ధితి కుప్పకూలిందని, ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని, ఎక్కడ చూసినా అరాచకం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అభద్రతతో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. ఈరోజు పార్లమెంట్ వేదికగా విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ బంగ్లా పరిస్ధితిపై సవివర నివేదిక సమర్పించారని తెలిపారు. ఈ సంక్లిష్ట సమయంలో విపక్షం యావత్తూ ప్రభుత్వం వెంట నిలిచినందుకు తాను విపక్షాన్ని ప్రశంసిస్తున్నానని చెప్పారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ స్ధాయిలో లేవనెత్తి పరిష్కారం చూపేందుకు భారత్‌ చొరవ చూపుతుందని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున…

Read More

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు వస్తున్నట్లు ఆమె అభ్యర్థించారని మంగళవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. తమకు కొన్ని నిమిషాల ముందే ఆమె ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు.  ఢాకా నుంచి బంగ్లా ఆర్మీకి చెందిన సి -130జె ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎజెఎఎక్స్‌ పేరుతో ఢాకా నుంచి టేకాఫ్‌ అయి, కోల్‌కతా మీదుగా ఢిల్లీకి సమీపంలోని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన హిండన్‌ ఎయిర్‌ బేస్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత ఇంటలిజెన్స్‌ ఏజెన్సీల సురక్షిత కస్టడీలో ఉన్నారు. బంగ్లా ఆర్మీ హెలికాప్టర్‌ మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారత సరిహద్దు వద్ద అతి తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు మన రాడార్లు గుర్తించాయి. భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే విమానంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుని భారత్‌…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఫల్యాలపై విచారణ నిమిత్తం సె ప్టెంబర్ 5న విచారణ కోసం హాజరు కావాలంటూ భూపాలపల్లి కోర్టు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరికొందరికీ నోటీసులిచ్చింది. రూ.లక్ష కోట్ల వ్యయం చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటి కెసిఆర్ సర్కారే కారణమని, దీనివల్ల భారీగా ప్రజా ధ నం దుర్వినియోగం అయిందని, కాళేశ్వరం ప్రా జెక్టు లక్ష్యమే దెబ్బతిందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలంటూ పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. బ్యారేజీ దెబ్బతి న్న అంశంపై సమగ్ర విచారణ చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు నాటి మం త్రి హరీశ్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి…

Read More

జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరుగుతాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. అభివృద్ధి క్రమం కొనసాగడానికి, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కేంద్ర పాలిత ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదేళ్ల క్రితం ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన దరిమిలా జమ్మూ కశ్మీరులో పాకిస్తాన్, దాని నిఘా సంస్థ ఐఎస్‌ఐ కార్యకలాపాలు కట్టడయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు. జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదాన్ని బలపరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు. జమ్మూ కశ్మీరులో బిజెపి ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి 370వ అధికరణ రద్దు ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ శివార్లలోని బనా సింగ్ స్టేడియంలో బిజెపి నిర్వహించిన ఏకాత్మ మహోత్సవంలో ప్రసంగించారు. బిజెపి జాతీయ ప్రధనా కర్యదర్శి, జమ్మూ కశ్మీరు ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, జమ్మూ కశ్మీరు…

Read More