భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. తెరూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్ జరుగుతోంది. కాగా, శ్రీరామనవమి కల్యాణ సమయంలోనే కాకుండా తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదవకాశాన్ని కల్పించింది. కర్గో పార్సిల్ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జన్నార్ మాట్లాడుతూ భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. తెలంగాణ నుంచే కాకుండా దుబాయ్, అమెరికా…
Author: Editor's Desk, Tattva News
ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.236.05 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయుష్మాన్ భారత్ – పీఎం జన్ ఆరోగ్య యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి నిధుల విడుదలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం సమాధానమిచ్చారు. ఆయుష్మాన్ భారత్ కింద 7.09 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరగా, అందుకోసం రూ. 2,012 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 41,98,258 మందికి ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులు ఉన్నాయని, ఇందులో 7,09,497 మంది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆస్పత్రుల్లో చేరారని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 746 ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణలో పీఎంజేఏవై పథకానికి 29,02,621 కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా విషయంలో ప్రపంచంలోనే…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కె. తారక రామారావు లీగల్ నోటీసులు పంపారు. టిఎస్‌పిఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్ధేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారని కెటిఆర్ ఆరోపించారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారి పైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని పేర్కొన్న కెటిఆర్, ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులను లాయర్ ద్వారా పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ…
అమరావతి – 3 రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అటు అమరావతి రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా పడింది. ఇంకా ముందే విచారణ చేపట్టి తీర్పునివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దానితో, పరిపాలనా రాజధానిగా విశాఖకు మార్చాలని తొందరపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో మంగళవారం అమరావతి కేసుకు ఉంది. వరుస క్రమంలో 10వ స్థానంలో ఉన్నప్పటికీ, విచారణకు వచ్చేసరికి సాయత్రం గం. 4.00 దాటింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ కేసు విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరగా కోర్టు పద్ధతులు పాటించాలని, వరుస క్రమంలో కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తులు సున్నితంగా వారించారు. సాయంత్రం విచారణ చేపట్టే సమయానికి కోర్టు…
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్ )కు ఆధార్ అనుసంధానం తుది గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ విషయంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. గడువు ముగిసేలోగా పాన్ – ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోవాలని, లేకపోతే జూలై 1 నుంచి పాన్ నిరర్ధకంగా మారుతుందని స్పష్టం చేసింది. అంటే ఆధార్ – పాన్ అనుసంధానం జూన్ 30లోగా పూర్తి చేసుకోకుంటే ఆ తర్వాత పాన్ కార్డు పని చేయదు. పాన్‍కు సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోతాయి. పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి వుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. అయితే వెయ్యిరూపాయిల జరిమానాతో మార్చి 31లోపు అనుసంధానం చేసేందుకు చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును…
విశాఖపట్నం వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు- జి-20 సదస్సు నిర్వహించనున్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ,వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో..నగరంలోని రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో ఈ నెల 28,29,30వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుంచే వివిధ దేశాల నుంచి ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సదస్సు ద్వారా విశాఖనగరానికి మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. జి-20దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక జీ-20 సదస్సు ఏడాది డిసెంబర్‌లో ఇండియాలో జరగనుంది. ఈలోగా వివిధ రంగాలకు సంబంధించిన వర్కింగ్ గ్రూప్ సమావేశాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈ నెల 3,4తేదీల్లో జాతీయ స్థాయిలో పుణేలో జరిగిన తొలిదశ జీ-20ఇన్‌ఫ్రాక్చర్ వర్కింగ్ గ్రూప్ సదస్సు విజయవంతమైంది.మలివిడత జీ-20 శిఖరాగ్ర సదస్సుకు మహావిశాఖనగరం అతిథ్యం ఇస్తోంది. 40దేశాల నుంచి 200మంది వరకూ దేశవిదేశీ ప్రతినిధులు, పలుదేశాల…
సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) కుటుంబంలో చేరికల చిచ్చు రేగింది. ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన డిఎస్ సోమవారం రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు డిఎస్ రాజీనామా లేఖను పంపా రు. డిఎస్ రాజీనామా లేఖను ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. రాజీనామ లేఖను కూడా చూపించారు. డిఎస్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. “నమస్తే ఇది డీ శ్రీనివాస్ రాజీమానా ..నేను చెప్పదల్చుకున్నది ఏంటీ అంటే కాంగ్రెస్ వాళ్లు కానీ..మీడియా వాళ్లు కానీ ఇటువైపు రాకండి.” .అని విజయలక్ష్మీ వీడియోలో స్పష్టం చేశారు. “ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..డీఎస్ ను పార్టీలో చేర్చుకునే విధానం ఇది కాదు..డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు. మీ రాజకీయాలకు డీఎస్ ను వాడుకోవద్దు” అంటూ ఆమె అసహనం వ్యక్తం …
గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 150 మార్కులకు గానూ వందకు పైగా మార్కులు సాధించిన దాదాపు 121 మంది అభ్యర్థుల్లో 70 మంది విచారణను సిట్ పూర్తిచేసింది. కొందరు అభ్యర్థులు ఫోన్లోనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గతంలో వారు రాసిన యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ పరీక్షల ఫలితాల వివరాలను కూడా సిట్ అధికారులు సేకరించి పరిశీలించారు. ఈ అభ్యర్థులంతా ఏండ్లుగా పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఎఫీషియెన్సీ టెస్ట్ ఆధారంగా వారికి పేపర్ లీకేజీతో సంబంధం లేదని సిట్ అధికారులు తేల్చారు. దీంతో100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది. సిట్అధికారులు గ్రూప్1 అభ్యర్థులను విచారిస్తూనే.. ఏఈ పేపర్ లీక్ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ధాక్యా నాయక్‌కు, అభ్యర్థులకు మీడియేటర్‌గా వ్యవహరించిన తిరుపతయ్యను సోమవారం నాంపల్లి కోర్టులో…
అదానీ అంశం, రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో పాటు ప్రతిపక్షాల ఎంపీలు నల్ల చొక్కాలు వేసుకుని వచ్చి మరీ నిరసన తెలిపారు. ఉభయసభలు ప్రారంభం కాగానే సభ్యులంతా ప్లకార్డులు చేత పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఒక దశలో సభ్యులంతా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు అప్రజాస్వామికమని నినదించారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను సాయంత్రం 4 గంటలకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్‌తో సహా విపక్ష సభ్యులంతా నిరసన వ్యక్తం చేస్తూ విజయ్ చౌక్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అందరూ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. రాహుల్ గాంధీకి…
శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగియగానే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు, ఎమ్యెల్సీలలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఎమ్యెల్సీల ఎన్నిక పక్రియ పూర్తి కావడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియడంతో త్వరలో మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్యెల్సీ ఎవ్వరూ మంత్రివర్గంలో లేరు. కొత్తగా ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం ప్రస్తుత మంత్రులలో కొందరికి ఉద్వాసన పలకాల్సి వస్తుంది. సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో జరిపిన భేటీ ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ కోసమే ఆయన గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో పనితీరును కనపర్చని మంత్రులను జగన్ సాగనంపుతారని, వారి స్థానంలో మండలి ఎన్నికల్లో గెలిచిన వారికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు…