సహజీవన సంబంధాలను (లివ్ ఇన్ రిలేషన్‌షిప్) రిజిస్టర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది తెలివి తక్కువ ఆలోచన అని ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ మండిపడ్డారు. దేశంలో సహజీవన సంబంధాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, అందుకోసం మార్గదర్శకాలు సూచించాలంటూ ఓ పిటిషనర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే సహజీవనంలో ఉన్న వారికి సామాజిక భద్రత కూడా కల్పించాలని ఆ పిల్‌లో కోరారు. ఈ పిల్‌పై సిజెఐ డివై. చంద్రచూడ్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సహజీవన సంబంధాలను కేంద్ర ప్రభుత్వం ఎలా రిజిస్టర్ చేస్తుందని, వాటితో కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలతో పిటిషన్‌లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేసినవారికి జరిమానా విధించాల్సి వుంటుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ద్వారా సహజీవనంలో ఉన్న వారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా?…
Author: Editor's Desk, Tattva News
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మరో వ్యక్తి రోహిత్ గార్గ్ లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరుతో బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చింది. హిందీలో ఇది రాసి ఉంది. ‘‘లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి. లేదంటే చూసేలా చేయాల్సి వస్తుంది. ఖాన్ ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే, గోల్డీ భాయ్ తో ముఖాముఖి మాట్లాడాలి’’ అన్నది ఈ మెయిల్ సారాంశం. తన జీవిత లక్ష్యం సల్మాన్ ఖాన్ ను అంతం చేయడమేనని ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ చెప్పడం గమనించొచ్చు. సల్మాన్ ఖాన్ కు తాజా బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పోటీగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. వాయిదా తీర్మానంపై టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో తలెత్తిన వివాదం వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణగా మారింది. టీడీపీ సభ్యుల నిరసనకు పోటీగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగిన క్రమంలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో మొదలైన ఘర్షణ తోపులాటకు దారి తీసింది. టీడీపీ ఎమ్మెల్యేలకు పోటీగా వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు…
చిరుధాన్యాల సంరక్షణకు జీవితాంతం కృషి చేయడమే గాక, సంఘం రేడియో పేర కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించి నిరక్షరాస్యులైన మహిళలతోనే వ్యవసాయంపై రేడియోకార్యక్రమాలు నిర్వహించిన దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ సతీష్ (77) ఆదివారం కన్నుమూశారు. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీష్ (పీవీ సతీష్ ) కర్నాటకకు చెందిన వారు. మైసూర్‌లో జన్మించారు. ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, నూఢిల్లిలో గ్రాడ్యుయేట్ అయిన పీవీ సతీష్ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. రెండేళ్ల పాటు దూరదర్శన్‌లో టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ తర్వాత సామాజిక సేవారంగంలోకి అడుగుపెట్టారు. అది కూడా తన సొంత రాష్ట్రం కర్నాటకను కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నారు. 1980 లో కొందరు మిత్రులతో కలిసి దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి జహీరాబాద్ కేంద్రంగా సేవా కార్యక్రమాలను 40 ఏళ్ల క్రితం ప్రారంభించారు. రెండు తెలుగు…
భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా సికింద్రాబాద్ లో తరచుగా భారీ భవనాలలో అగ్నిప్రమాదాలు జరుగున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదంతో ఆరుగురి సజీవ దహనానికి దారితీసిన సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను ఆయన ఆదివారం సందర్శించి పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని చెబుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ప్రమాద ఘటనలో పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు గాని ఆ తర్వాత మర్చిపోతున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండట్లేదని, గోదాములు, స్క్రాప్ దుకాణాలను అధికారులు తనిఖీ చేయట్లేదని విమర్శించారు. అధికారులు,అగ్నిమాపక సిబ్బంది…
ఖలిస్తానీ వేర్పాటు వాద సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృతపాల్ సింగ్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు ఆదివారం పంజాబ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతనిని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. శనివారం సాయంత్రం జలంధర్‌లో అమృతపాల్ సింగ్ చిక్కినట్టే చిక్కి మోటార్‌సైకిల్‌పై పారిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో కచ్చితమైన సమాచారం లేదని అన్నారు. అయితే, అనుమానం ఉన్న అన్ని ప్రదేశాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇంటర్నెట్‌పై నిషేధం కూడా విధించారు. ‘వారిస్ పంజాబ్ దే’ కి చెందిన 78 మంది సభ్యులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని విచారిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆరు నుండి ఏడుగురు అమృతపాల్ సింగ్ గన్‌మెన్‌లు ఉన్నట్లు జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్న…
లిక్కర్ స్కాంలో మరో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై ఈడీ అధికారులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. దానితో కవిత వేసిన పిటీషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మహిళా హక్కుల గురించి పిటీషన్‌లో కవిత పేర్కొంటూ కీలక అంశాలను అందులో ప్రస్తావించింది. తనను రాత్రి 8 గంటల నిమిషాల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చొబెట్టడాన్ని కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సూర్యాస్తమం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో కూర్చోబెట్టకూడదని చట్టం చెబుతోందని కవిత ఆ పిటీషన్‌లో పేర్కొంది. ఒక మహిళను కార్యాలయానికి పిలిపించి విచారించవద్దని కవిత పిటీషన్ దాఖలు చేసింది. తమ వాదన వినేంతవరకు కవిత పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈడీ సుప్రీంకోర్టును హడావిడిగా అభ్యర్థించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈడీ బెదిరిస్తోందని,…
పంజాబ్ లో స్వయం ప్రకటిత అతివాద సిక్కు మతబోధకుడు, అనుమానిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ “వారిస్ పంజాబ్ డి” నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ను పోలీసులకు చిక్కిన్నట్లే చిక్కి తప్పించుకున్నాడు. శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలో అమృత్‌పాల్ సింగ్ తో పాటు మరో ఆరుగురిని కూడా అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి అమృత్‌పాల్ ఓ బైక్‌పై పరారయ్యాడని చెబుతున్నారు. అరెస్ట్ కు ముందు రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. అమృత్ పాల్ సింగ్ ను 100 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల సరిహద్దులను మూసివేశారు. చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఛేజింగ్ కొన్ని గంటల పాటు సాగింది. చివరికి అతడిని జల్లుపూర్ ఖేరా గ్రామం దగ్గర అరెస్ట్ చేశారు. అతడి మద్దతుదారులు ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌పాల్ సింగ్ ను అరెస్ట్ చేసి రహస్య…
కరోనా మహమ్మారి ప్రభావాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ బలహీనమైన ఆర్థిక పునరుద్ధరణ క్రమంలో వున్నాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఒఇసిడి) పేర్కొంది. ‘ఆర్థిక దృక్పథం, తాత్కాలిక నివేదిక’ శీర్షికతో విడుదలైన ఈ నివేదికలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.6శాతం మేరానే వృద్ధి చెందుతుందని ఒఇసిడి అంచనా వేసింది. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి ఇంధన సరఫరాలు, ద్రవ్యోల్బణం వంటి శాశ్వత ప్రభావాలు తగ్గడం వల్ల వచ్చే ఏడాది నాటికి ఈ అభివృద్ధి 2.4శాతం వరకు వుంటుందని పేర్కొంది. ఇంధన ధరలు క్షీణిస్తుండడమనేది ఒక మోస్తరు మెరుగుదలకు దోహదపడిందని ఒఇసిడి ఆ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కెల్లా చైనా అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆ నివేదిక అంచనా వేసింది. చైనా 5.3 శాతం మేరా అభివృద్ధి చెందితే, అమెరికా ఆర్థిక వృద్ధి 1.5శాతమే వుంటుందని, వచ్చే ఏడాదైతే…
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం సైతం చమురు ధరలు తగ్గాయి. యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.1శాతం తగ్గి 66.90డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బ్రెంట్ కాంట్రాక్టు తగ్గి 73.11డాలర్లుకు చేరుకుంది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు వారంలో 11శాతంపైగా తగ్గాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అతిపెద్ద తగ్గుదలగా నమోదైంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గలేదు. మరోవైపు రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చమురు దిగుమతైంది. గత నెలలో రోజుకు సగటున 1.6మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ రష్యా నుంచి దిగుమతైంది. సౌది అరేబియా, ఇరాక్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న కంటే కావడం గమనార్హం. రష్యా రాయితీతో చమురు అమ్ముతుండటంతో భారత్ రష్యానుంచే ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాయి.…