Author: Editor's Desk, Tattva News

ఎపికి రూ. 13 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రానున్నాయ‌ని, వాటి ద్వారా 6 ల‌క్ష‌ల మందికి పైగా ఉపాధి ల‌భించ‌నుంద‌ని ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి వెల్ల‌డించారు. ఎపి ప్ర‌భుత్వం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమీట్ ను ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు జ‌గ‌న్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 92 ఎంవో యులు కుదుర్చు కుంటున్నామని, అలాగే 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. తొలి రోజునే 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని చెబుతూ రూ. 8.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయులు మొదటి ఈరోజు జరుగుతాయని తెలిపారు. మిగిలిన కొన్ని ఎంవోయులు శనివారం జరుగుతాయని చెప్పారు. విశాఖ చిన్న ఏకానిమిక్ హబ్ గా మారి దేశంలోనే అతి కీలకమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగు మతులు పెరిగాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ…

Read More

ప్రస్తుతం జరుగుతున్న ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఆర్‌జెడి, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డిపై ఎన్నికల కమీషన్ ఆంక్షలు విధించింది. అతను పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఎటూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతాప్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిబ్రవరి 24న ఆదేశాలు జారీ చేశామని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ వి బాలసుబ్రమణ్యంకు మీనా లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారుల జీవిత భాగస్వామి ఎన్నికల్లో అభ్యర్థులుగా…

Read More

ఈశాన్య రాష్ట్రాల్లో తనకు తిరుగులేదని మరోసారి బీజేపీ జెండా సత్తాచాటింది. మూడు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి రెండు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వస్తుండగా, మూడో రాష్ట్రంలో కూడా అధికార పార్టీ బీజేపీక మద్దతు కోరింది. నాగాలాండ్‌, త్రిపురలో బీజేపీ కూటమి విజయం సాధించగా మేఘాలయలో హంగ్‌ ఏర్పడింది. త్రిపురలో రెండోసారి అధికారం త్రిపురలో బీజేపీ-ఐపీఎ్‌ఫటీ కూటమి విజయం సాధించింది. బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి మానిక్‌ షా వరుసగా రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. గురువారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ కూటమి 33 స్థానాల్లో గెలిచింది. కాంగ్రె్‌స-వామపక్షాల కూటమి 14 సీట్లలో, మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్‌ బిక్రమ్‌ వర్మ సారథ్యంలోని తిప్రా మోథ పార్టీ 13 స్థానాల్లో గెలిచాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) అన్నిచోట్లా ఓడింది. టీఎంసీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 31 కాగా 33…

Read More

ప్రధాన ఎన్నికల కమిషనరు, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీయేే ఎన్నికల సంఘంలో నియామకాలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. సిఇసి, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ అజరు రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేష్‌ రారు, జస్టిస్‌ సిటి రవికుమార్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేస్తున్నట్లు…

Read More

పది రోజులుగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంబరాన్నంటేలా జరుగుతున్న ‘ఖేలో తెలంగాణ-జీతో తెలంగాణ’ క్రీడా సంబరాలు గురువారం ఘనంగా ముగిశాయి. యువతలో క్రీడాస్ఫూర్తి నింపడమే లక్ష్యంగా, వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్దడమే ధ్యేయంగా, ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో నిర్వహించిన సికింద్రాబాద్ క్రీడోత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఫిట్ ఇండియా నినాదంతో .. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పేరుతో అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సికింద్రాబాద్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమసత్తా చాటారు. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం జింఖానా గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.  ప్రధాని మోదీ గారి పిలుపుతో ఫిట్ ఇండియా లక్ష్యంగా, యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు నిర్వహించిన సికింద్రాబాద్ క్రీడోత్సవాలకు విశేష స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో యువత ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఖేలో సికింద్రాబాద్..…

Read More

తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. ఎం ఈ ఐ ఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది. టిటిడి మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పి వీ శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడి వినియోగించనుంది. టి టి డి అధికారులకు బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు. భక్తులు…

Read More

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతి ఇచ్చే విషయంలో గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వంల మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లి, సామరస్యంగా ముగియడంతో పాటు బడ్జెట్ సమావేశాలు సహితం సవ్యంగా జరగడంతో గవర్నర్ – సీఎం కేసీఆర్ ల మధ్య దూరం తగ్గినదని అందరూ భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పరిశీలించకుండా తన వద్దనే పెట్టుకొంటున్నారనే ఆగ్రహంతో కేసీఆర్ ప్రభుత్వం నేరుగా గవర్నర్ తీరుపై సుప్రీం కోర్టును గురువారం ఆశ్రయించింది. గవర్నర్ 10 బిల్లులకు ఆమోదం తెలపడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిట్ పిటీషన్ వేశారు. ఈ రిట్ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఈ పిటీషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా చాలా రోజులుగా 10 బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా తొక్కిపడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. 6 నెలలుగా కొన్నిబిల్లులు రాజ్…

Read More

హిన్​డెన్​బర్గ్​ షార్ట్​ సెల్లింగ్​ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్​ వ్యవహారంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి అభయ్​ మనోహ్​ సప్రే నేతృత్వంలో ఓ ఆరుగురు సభ్యుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది. అదానీ గ్రూప్​లో అవకతవకలు జరిగాయంటూ జనవరి 24న ఓ నివేదిక బయటపెట్టింది హిండెన్‌బర్గ్ సంస్థ. అప్పటి నుంచి అదానీ గ్రూప్​పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్​వెస్టర్​లకు రక్షణ కలిగించే విధంగా ప్రస్తుత విధానాల్లో మార్పులు తీసుకురావాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా వీటిపై విచారణ చేపట్టింది సీజేఈ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ క్రమంలోనే ప్యానెల్​ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రముఖ బ్యాంకర్లు కేవీ కామథ్​, ఓపీ భట్​, ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నందన్​ నీలేకని, రిటైర్డ్​ జస్టిస్​ జేపీ దేవ్​దార్​లు ఈ ప్యానెల్​లో సభ్యులుగా ఉండనున్నట్టు పేర్కొంది. ఈ ఆరుగురు సభ్యుల ప్యానెల్​.. అదానీ కేసుపై దర్యాప్తు…

Read More

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి బుధువారం బీజేపీలో చేరారు. కొద్దీ రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధిస్తున్నాడని, మూడేళ్ల పదవీకాలంలో తనను తీవ్ర ఇబ్బందుల పెట్టారని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసి ఆమె వార్తల్లో నిలిచింది. ఆమె గత వారం చైర్ పర్సన్ పదవికి, బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజాగా ఈరోజు బుధువారం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఢిల్లీలో ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీలో తనను అణచివేశారని, తన ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని…

Read More

యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధువారం 31 వ రోజు పూర్తి చేశాడు. ఈరోజు తో 400 కిలోమీటర్లను పూర్తి చేసినట్లు అయ్యింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. లోకేష్ యాత్ర కు టీడీపీ శ్రేణులు , ప్రజలు బ్రహ్మ రథంపడుతున్నారు. ప్రజల ఆశీస్సులతో 400 కి.మీ దూరాన్ని పూర్తి చేశానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 4 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యేంత వరకు తాను విశ్రమించబోనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాదయాత్రపై పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. అంటే సగటున ప్రతి 33 కిలోమీటర్లకు ఒక కేసు నమోదయిందని చెప్పారు. పాకాల హైస్కూలు గ్రౌండ్ లో విద్యార్థులతో కాసేపు లోకేష్ వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా తమకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని లోకేశ్ కు విద్యార్థులు వినతి పత్రం అందించారు. పాకాల మార్కెట్ వద్ద స్టూలుపై నిలబడి…

Read More