Author: Editor's Desk, Tattva News

దేశంలో తిరస్కరణకు గురైన వారిని మళ్లీ అంగీకరించేందకు ప్రజలు సిద్ధంగా లేదంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మోదీ సమాధి తవ్వుతాం అంటూ కాంగ్రెస్‌ నినాదాలు చేస్తున్నా.. దేశం మాత్రం మోదీ కమలమే వికసిస్తుందంటూ ఎలిగెత్తి చెబుతోంది’ అంటూ చెప్పుకొచ్చారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో బిజెపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్‌ నాయకుడు పవన్ ఖేరా పేరును, ఆయన అరెస్టును ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. దేశంలోని ప్రజలు ‘మీ కమలం వికసిస్తోంది’ అంటున్నారంటూ కౌంటరిచ్చారు. తమపై, తమ పార్టీపై అభ్యంతరకరమైన పదజాలం, విమర్శలు చేసిన వారికి దేశం తగిన విధంగా సమాధానం చెబుతుందని ప్రధాని హెచ్చరించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఛత్తీస్‌గఢ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో ఆ పార్టీ సభ్యులు మోదీపై వివాదాస్పద నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.…

Read More

కర్ణాటకలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్న ఇనుప గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డి గురించి పట్టించుకోవడం మాని ఓటర్లను నేరుగా కలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్-కర్నాటక ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులకు హితబోధ చేశారు. కల్యాణ కర్నాటకగా కూడా పిలిచే హైదరాబాద్-కర్నాటక ప్రాంతానికి చెందిన నాయకులతో అమిత్ షా సమావేశమై రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బిజెపి నుంచి వేరుపడి కల్యాణ కర్నాటక ప్రగతి పక్ష(కెకెజెపి) పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్న గాలి జనార్దన రెడ్డి బళ్లారి, విజయనగర, కొప్పల్, రాయచూర్ జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తూ తనపై ఈడి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు జరిపినా తన విజయాన్ని అడ్డుకోలేరంటూ చేస్తున్న ప్రకటనలను స్థానిక నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గంగావతి నియోజకవర్గం నుంచి…

Read More

గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ ల పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, సంతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు భేష్ అంటూ కితాబిచ్చారు.  పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన ‘‘బూత్ స్వశక్తీకరణ్ అభియాన్’’ వర్క్ షాప్ సందర్భంగా ప్రజా గోస – బీజేపీ భరోసా పేరుతో నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ పట్ల ప్రజల్లో సానుకూల చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికలు కూడా ఇవే చెబుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 6 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పూర్తయ్యాయని, గడువు తేదీలోగా 10 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్…

Read More

ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడో గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి గతనెలలో రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ వారిలో మూడో వ్యక్తిగా అబ్దుల్ నజీర్ గుర్తింపు పొందారు. గత రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. జగన్‌తో పాటు డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే…

Read More

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక 20వ అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమవనుంది. నేటి నుంచి 26వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పరిశ్రమ, విద్యాసంస్థలను(అకాడమీ)ని అనుసంధానించడమే లక్ష్యంగా బయో ఆసియా ఫోరం పనిచేస్తోంది. ఇందులో భాగంగా బయోఆసియా సదస్సులను ఈ ఫోరం నిర్వహిస్తోంది.  ప్రభుత్వం, నియంత్రణ అథారిటీలు, స్టేక్‌ హోల్డర్లు మధ్య సమన్వయం సాధించి హెల్త్‌కేర్‌ రంగ వృద్ధికి బయో ఆసియా ఫోరం దోహదపడుతోంది. ఈసారి సదస్సు అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌ : షేపింగ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌ అనే థీమ్‌తో సదస్సు జరగనుంది. భారతదేశ లైఫ్‌సైన్సెస్‌ రంగంలో బయోఆసియా సదస్సుది కీలక పాత్ర వహించనుంది. ఈ సదస్సులో 100కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వేడుక ప్రారంభోత్సవంలో ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, రాష్ట్ర ఐటీ,…

Read More

శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే) నేత సంజయ్ రౌత్‌ పై పరువునష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే నుండి తనకు ప్రాణహాని ఉందని తప్పుడు ఆరోపణలు చేసినట్లు థానే మాజీ మేయర్‌ మీనాక్షి షిండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంజయ్  రౌత్‌పై ఐపిసి సెక్షన్‌ కింద పరువు నష్టం శతృత్వాన్ని ప్రోత్సహించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, దుష్ప్రవర్తనతో కూడిన ప్రకటనలు వంటి సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎంపిగా ఉన్న శ్రీకాంత్‌ షిండే తనను హత్య చేసేందుకు థానేకు చెందిన రాజా ఠాకూర్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చినట్లు ఈ వారం ప్రారంభంలో సంజయ్  రౌత్‌ థానే పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు కాపీని పోలీసులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీక్‌కు పంపారు. ఈ ఫిర్యాదుపై ఫడ్నవీస్‌ ఆగ్రహం…

Read More

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ) నిబ్బంధన కింద బిభవ్ కుమార్ వాంగ్మూలాన్ని ఇడి అధికారులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్‌తోసహా కనీసం 36 మంది నిందితులు వేలాది కోట్ల రూపాయల ముడుపులు పుచ్చుకున్నారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపివేసేందుకు 170 సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని ఇడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిభవ్ కుమార్‌ను ఇడి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడి రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. మొత్తం తొమ్మిదిమంది నిందితును అరెస్టు చేసింది. కాగా, ఈ కేసులో విచారణకు ఆదివారం హాజరుకావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్…

Read More

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను అస్సాం పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళుతున్న ఖేరాను విమానం నుంచి కిందకు దింపివేసి పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన వెంటే విమానంలో వెళుతున్న సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విమానం ముందు టర్మాక్ మీద వారు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఐసిసి ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గురువారం ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరిన ఖేరా విమానంలోకి ప్రవేశించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌తో వచ్చిన అస్సాం పోలీసులు ఆయనను కిందకు దించివేసి అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టులో ఖేరాను ప్రవేశపెట్టిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్‌పై అస్సాంకు తరలిస్తారు. అదానీ, హిండెన్‌బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెపిసి) వేయాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఇటీవల డిమాండ్ చేసిన నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి పవన్ ఖేరా…

Read More

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, న‌గ‌ర ప‌రిస‌ర మున్సిపాలిటీల ప‌రిథిల‌ల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. వీధికుక్కలు దాడిలో ఐదేళ్ళబాలుడు చనిపోయిన ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ తర్వాత బుధవారం ఒక వంక అధికారులు కుక్కల వేట ప్రారంభించగా, మరోవంక నాలుగు ప్రాంతాలలో చిన్నారులను కుక్కలు గాయపరిచాయి. వీధి కుక్క‌ల బెడ‌ద‌ను నివారించ‌డానికి యుద్ద‌ప్రాతిప‌థిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ మున్సిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌ ఆదేశించారు. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు చనిపోయిన నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. జిహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌స్తుతం ఐదున్న‌ర ల‌క్ష‌ల వీధి కుక్క‌లున్నాయ‌ని, గ‌తంలో 8 ల‌క్ష‌ల 50 వేల ఉండేవ‌ని (2011) స్టెరిలైజేష‌న్ ఆప‌రేష‌న్స్ నిర్వ‌హించ‌డం వ‌ల్ల‌న వాటి…

Read More

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. శివసేన పార్టీ, గుర్తు విల్లు-బాణంను సీఎం షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో థాక్రే సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. ఈ క్రమంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని థాక్రే తరపు న్యాయవాది కోరగా..అందుకు కోర్టు నిరాకరించింది. షిండే వర్గం ఈసీ ముందు మెజారిటీని నిరూపించుకుందని..కాబట్టి ఆ ఆదేశాలపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉద్ధవ్ వర్గం (బాలాసాహెబ్ థాక్రే) కాగడ గుర్తును వాడుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కాగా శివసేన ఇటీవల ఉద్ధవ్, షిండే వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణంను పార్టీ చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్త్ర ముఖ్యమంత్రి ఏక‌నాథ్ షిండే వర్గానికే దక్కుతుందని ఈసీ స్పష్టం చేసింది. అసలైన శివసేన తమదేనని…

Read More