ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 35కు పైగా వాగులు, వంకలు గోదావరిలో కలవడం లేదని, 22 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ గతంలో కంటే ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నది. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాచలం వరకు బ్యాక్‌వాటర్ 43 అడుగుల మేర నిలిచి ఉంటాయని తెలిపింది. భద్రాచలం ముంపు నివారణకు సుమారు రూ.1,629 కోట్లు అవసరం అవుతాయని నిపుణుల కమిటీ అంచనా వేసింది. నిరుడు సంభవించిన భద్రాచలం వరదలపై అధ్యయనం చేసి, నివారణ చర్యలపై సిఫార్సులు చేసేందుకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలుత మధ్యంతర…
Author: Editor's Desk, Tattva News
కృష్ణనదిపై తలపెట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణికి కేంద్రం ఆమోదించింది. నిధులు కూడా కేటాయించింది. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చేసి మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దేందుకు రూ. 1,082.56 కోట్ల అంచనావ్యయాన్ని ప్రతిపాదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 500 కోట్లను కేంద్రం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అవసరమైన అన్ని అనుమతుల పక్రియ పూర్తయి ఈప్రాజెక్టును ప్రారంభిస్తే 30 నెలలలోగా పూర్తి అయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల, ఏపీలోని నంద్యాల జిల్లా లలితా సంగమేశ్వరం మధ్య కృష్ణా నదిపై కేబుల్ కం సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది. పూర్తిగా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కృష్ణా నదీమీదుగా బ్రిడ్జిపై ప్రయాణం సాగనుంది. ప్రతిపాదిత సోమశిల -సిద్దేశ్వరం వంతెన తెలంగాణ…
ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాది గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు రాగా, షాలీమార్ భాగ్‌కు 116 ఓట్లు వచ్చాయి. మొత్తం 250 వార్డులున్న ఢిల్లీ మున్సిపాల్టీకి గతేడాది డిసెంబరులో ఎన్నికలు జరగ్గా.. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఫలితాలు వెలువడి రెండు నెలలు గడిచినా మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు వోటింగ్ హక్కు కల్పించడం పట్ల ఆప్ అభ్యర్థి అభ్యంతరం తెలియచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బుధవారం ఓటింగ్ నిర్వహించారు. ఉదయం 11.30 నిమిషాలకు మున్సిపల్ హౌజ్‌లో సమావేశమైన కొత్తగా ఎన్నికైన కౌన్సెలర్లు.. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల ఎన్నిక కోసం ఓటింగ్‌లో పాల్గొన్నారు. తొలుత ఢిల్లీ ఎంపీలు (లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు) తర్వాత…
యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) త్వరలో నగదును వదిలివేసే అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌లో యుపిఐ అత్యంత ప్రాధాన్య చెల్లింపు వ్యవస్థగా మారిందని, త్వరలో నగదు లావాదేవీలను అధిగమిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశం, సింగపూర్ మధ్య సరిహద్దు చెల్లింపు కనెక్టివిటీ మంగళవారం ప్రారంభమైంది. దీనిలో భారతదేశానికి చెందిన యుపిఐ సింగపూర్‌కు చెందిన పేనౌతో లింక్ చేశారు. భారతదేశంలో నగదు వినియోగదారుల కంటే యుపిఐ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రధాని మోదీ, సింగపూర్ పిఎం లీ సీన్ లూంగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెండు దేశాల చెల్లింపుల కనెక్టివిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2022 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 74 బిలియన్ల లావాదేవీల ద్వారా మొత్తం రూ.126 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. భారతదేశంలో యుపిఐ విజయాన్ని చూసి, ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఈ…
ఒప్పందాలను, నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నదీ జలాల దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ మంగళవారం తుంగభద్ర బోర్డుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలను లేఖలో వివరించారు. ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఆ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. కేసీ కెనాల్ ఆయకట్టుకు సుంకేశుల ఆనకట్ట ద్వారా తుంగభద్ర జలాలను మాత్రమే వినియోగించాలన్న తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని ఈ సందర్భంగా బోర్డుకు తెలియజేశారు. ఈ జలాలను తుంగభద్ర హైలెవెల్ కెనాల్‌కు తరలించి శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఏపీ సర్కారు భావిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపు టైబ్యునల్…
తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. కల్యాణోత్సవాల ఏర్పాట్లపై ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. మార్చి 3న జరిగే కల్యాణోత్సవానికి విశేషంగా భక్తులు వచ్చే అవకాశం…
బీటౌన్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. ముంబైలో సోమవారం రాత్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటి, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఆలియాభట్, రణబీర్ కపూర్ లకు అవార్డులు వరించాయి. దీనిపై కంగన ట్విట్టర్ ద్వారా స్పందించారు. నెపోటిజం వల్లే ఆలియా-రణబీర్‌కు అవార్డులు దక్కాయని విమర్శించారు. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితాను ట్విట్టర్ లో ఆమె పంచుకున్నారు. ‘బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదు. అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారు. నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోంది. అర్హులకు అవార్డులు, అవకాశాలు అందట్లేదు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకునే అర్హత వీరికే ఉంది’ అంటూ ఓ జాబితాను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘నిజంగా అర్హులైన వారికి అవార్డులు…
ప్రముఖ కవి, గేయరచయిత జావేద్ అక్తర్ పాకిస్తాన్‌పై ఆ దేశంలోనే ఘాటు విమర్శలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులు లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ స్మారకార్థం లాహోర్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గతవారం జావేద్ పాకిస్తాన్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకులతో నిర్వహించిన ముఖాముఖీలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ద్వేషాన్ని వెదజల్లడం సరికాదని జావెద్ అక్తర్ హితవు చెప్పారు. ఉర్దూ భాష కవి ఫయిజ్ అహ్మాద్ ఫయిజ్ జ్ఞాపకార్ద వేడుకల్లో జావెద్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఆర్టిస్టులకు పాక్‌లో గౌరవం దక్కలేదని, కానీ ఇండియాలో మాత్రం పాక్ కళాకారులు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఫయాజ్ సాహెబ్ వచ్చినప్పుడు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని,…
సుప్రసిద్ధ తిరుపతి పుణ్యక్షేత్రం 893వ పుట్టినరోజు పండుగకు ముస్తాబవుతోంది. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పూజ్య రామానుజాచార్యులు గోవిందరాజ ఆలయం ప్రతిష్ట, మాడ వీధుల ఏర్పాటు ద్వారా తిరుపతి పట్టణ ఆవిర్భావానికి నాంది పలికినట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి. ఆ అంశం ప్రాతిపదికగా తిరుపతి పుట్టినరోజును జరిపే ఆనవాయితీకి తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏడాది క్రితం శ్రీకారం చుట్టారు. ఆ ఆనవాయితీ కొనసాగింపుగా ఈనెల 24వ తేదీన తిరుపతి 893వ పుట్టినరోజు పండుగలా నిర్వహించనున్నట్టు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అందుకు సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆపై స్థానిక గోవిందరాజ ఆలయం వద్దకు చేరుకొని పుట్టినరోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అందరినీ ఆహ్వానించే కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్బంగా రామానుజ పరంపరలో భాగమైన జీయర్ మఠం వద్దకు వెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డీ) పెద్ద జీయర్, చిన్న జీయర్ లకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. అనంతరం విలేకరులతో…
సంవత్సరకాలంగా భీకరమైన రష్యా దాడులతో వణికిపోతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జరిపిన పర్యటన అందరిని ఆశ్చర్య పరిచింది. సోమవారం ఉదయం కీవ్‌లో కొంత అలజడి కనిపించినా.. ఎందుకు సైరన్లు మోగుతున్నాయో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరో పెద్ద వ్యక్తి వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా, వచ్చేది బైడెన్ అని తెలిసేందుకు చాలా సమయం పట్టింది. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆయన పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన సందర్భంగా గతంలో హామీ ఇచ్చినట్టుగా ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లు, ఇతర ఆయుధాలను త్వరగా పంపించాలని బైడెన్‌ను జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు లక్షల డాలర్ల సాయాన్ని అందిస్తామని, యాంటీ ట్యాంక్…