మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీ-సులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన అవినాష్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మొదటి సారిగా సీబిఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆరోజు ఏకంగా ఆయన్ను దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా అవినాష్‌రెడ్డికి శనివారం నోటీ-సులు జారీ చేశారు. వి వేకా హత్య కేసు కడప నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఓ వైపు సీబీఐ హైదరాబాద్ కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేస్తే.. మరోవైపు సీబిఐ కోర్టులో విచారణ కూడా వేగమందుకుంది. దీనిలో భాగంగానే మొదటి సారి ఎంపీ అవినాష్‌ను ప్రశ్నించిన సీబిఐ అతని కాల్‌డేటాను కీలకంగా…
Author: Editor's Desk, Tattva News
వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మళ్లీ ఆమె పాదయాత్రకు అనుమతి రద్దు చేసి, అరెస్ట్ చేశారు. మహబూబాబాద్‌లో నోటీసులు ఇచ్చిన అనంతరం.. షర్మిలను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన ఆమె ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈక్రమంలోనే ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్తగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. మహబూబాబాద్‌లో వైఎస్ షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొజ్జాల్లా ఉన్న కొందరు ఆంధ్రా వలస వాదులు వస్తున్నారని అభ్యంతరకర కామెంట్స్ చేశారు. పర్యటనలు చేసుకుంటే చేసుకోండి కానీ.. మాట్లాడే భాష అదుపులో లేకుంటే మాత్రం.. కంకర రాళ్లకు మరోసారి పనిచెప్పాల్సి…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు. `ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మూడో రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనపర్తి దేవీ చౌక్ వద్ద బహిరంగ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసు వ్యాన్ ని నిలిపారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు కాలినడకనే దేవీ చౌక్ కి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఘటనలపై డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో అనపర్తి, బిక్కవోలు…
సినీ నటుడు నందమూరి తారక రత్న 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి చివరకు శనివారం సాయంత్రం తనువు చాలించారు. నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. టిడిపి యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. నందమూరి తారకరత్న మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు తారకరత్న మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. ‘నందమూరి తారకరత్న అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అంటూ మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి…
పెండింగ్‌లో ఉన్న మొత్తం జీఎస్టీ పరిహారం నిధులను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వాలకు భరోసా ఇచ్చారు. శనివారం విజ్ఞాన్ భవన్‌లో ఆమె అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సదస్సులో పాల్గొనగా, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. గత డిసెంబర్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించిన అంశాల మీదే ప్రత్యేక దృష్టి సారించారు జీఎస్టీ పరిహార నిధుల విడుదలపై చర్చించారు. సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ… అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంకా రూ.16,982 కోట్లు జీఎస్టీ పరిహారం బకాయిలున్నాయని, గతేడాది మే 31 వరకూ ఉన్న బకాయిలు ఇప్పటికే చెల్లించినట్లు వెల్లడించారు. వివిధ…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో మరో హత్యాయత్నానికి ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇంట్లో పేలుడు పదార్థాలను గుర్తించిన పోలీసులు, సదరు మహిళ ఇంట్లో పేలుళ్ల కోసం ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ ఎలా వచ్చాయి అన్న దానిపై దర్యాప్తు చేయగా కొత్త విషయం బయటపడింది. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేసిన నిందితుడు సదరు మహిళ ఇంట్లో ఈ పేలుడు పదార్థాలను దాచినట్టుగా తెలియడంతో పోలీసులు ఒక్కసారి షాక్ తిన్నారు. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి 2022 ఆగస్టు 2వ తేదీన రాత్రి తుపాకీని నడుము వెనుక, కత్తిని జేబులో పెట్టుకొని నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. అక్కడ గస్తీ కాస్తున్న సిబ్బంది కళ్ళు కప్పి మూడో అంతస్తుకు చేరుకున్నాడు. ఇక అక్కడ ఉన్న జీవన్ రెడ్డి…
మహారాష్ట్ర శివసేనలోని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి అసలమైన శివసేన పార్టీగా ఎన్నికల కమీషన్ గుర్తింపు ఇచ్చింది. దానితో పాటు శివసేనకు చెందిన పార్టీ పేరును, ఎన్నికల గుర్తు విల్లు-బాణంను కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దానితో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ విషయమై చేసిన పోరాటంలో పరాజయం ఎదుర్కొనక తప్పలేదు. ప్రస్తుతం శివసేన రూపొందించుకున్న నిబంధనలు, ఆ పార్టీ అమలు చేస్తోన్న అంతర్గత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఎన్నికల కమిషన్ అధికారులు వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గతంగా ఎలాంటి ఎన్నికలను కూడా శివసేన నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ అగ్ర నాయకత్వం రూపొందించుకున్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలేవీ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. దీనిపట్ల ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఉత్తర్వులు వెలువడతాయని తాము ముందే ఊహించామని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ పై తమకు ఎలాంటి నమ్మకం లేదని ఉద్ధవ్ థాకరే వర్గానికి…
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మార్చి 5న పాలేరులో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం షర్మిల ఈ యాత్ర చేపట్టారు. 2021, అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. ఆమె తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఇక్కడి నుండి చారిత్రాత్మక పాదయాత్ర ప్రారంభించడం గమనార్హం. అంతేకాదు, ముఖ్యమంత్రిగా ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని దాదాపుగా ఇక్కడి నుండే ప్రారంభించేవారు. నాటి నుంచి నేటి వరకు షర్మిల ప్రజల మధ్యలో తిరుగుతూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ.. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు 82 నియోజకవర్గాలకు పైగా పాదయాత్ర సాగింది. షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 238వ రోజుకు చేరుకుంది. మొత్తం 3700 కిలోమీటర్లకు…
వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిదిలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈసారి కూడా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం మరికొన్ని సమ్మర్ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం నుంచి జూన్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు రైళ్ల వివరాలను శుక్రవారం రైల్వే శాఖ వెల్లడించింది.ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయ: తిరుపతి- టు అకోలా (07605), అకోలా- టు తిరుపతి (07606), పూర్ణ- టు తిరుపతి (07607), తిరుపతి టు -పూర్ణ (07608), హైద్రాబాద్- టు నర్సాపూర్(07631), నర్సాపూర్- టు హైద్రాబాద్(07632), హైదరాబాద్- టు తిరుపతి (07643), తిరుపతి- టు హైదరాబాద్- (07644), విజయవాడ- టు నాగర్ సోయిల్ (07698), నాగర్ సోయిల్- టు విజయవాడ (07699) ఈ…
తెలంగాణలో కలకలం రేపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఆరోజు కోర్టు లిస్టులో ఉన్న అన్ని కేసులు పూర్తయ్యాకే ఈ కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్ర హైకోర్టు సీబీఐకు అప్పగించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. రాష్ట్ర సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, బీజేపీ తరఫున సీనియర్ అడ్వకేట్ మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేదిగా ఉందని, నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవని దవే వాదించారు. కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. అసలు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏముందని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ కేసును ఎలా…