భారత మహిళా టెన్నిస్ స్టార్ సానీయా మీర్జా అవతారంలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మెంటార్‌గా వ్యవహరించనుంది. మహిళల టి20 లీగ్ వచ్చే నెల 4నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత టెన్నిస్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సానీయా ఇక నుంచి క్రికెట్‌లోనూ కీలకపాత్ర పోషించనుంది. సానియా మీర్జాను మెంటార్‌గా ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా బుధవారం ప్రకటించింది. ఆర్సీబీ మహిళా జట్టుకు సానియాను మెంటార్‌గా నియమించడం సంతోషంగా ఉందని ఫ్రాంచైజీ ఉపాధ్యక్షుడు వి మేనన్ తెలిపారు. క్రీడారంగంలో సానియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టెన్నిస్ తారగా ఎదిగిందని, యువతరానికి మార్గదర్శిగా నిలిచిందని మేనన్ అన్నారు. కాగా ఆర్సీబీ మహిళా జట్టుకు మెంటార్‌గా నియమించడంపై సానీయా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. డబ్లూపిఎల్ వల్ల మహిళల క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరుతుందని విశ్వసిస్తున్నట్లు సానియా తెలిపింది.…
Author: Editor's Desk, Tattva News
ద్రవ్యోల్బణం నియంత్రణకు పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నుల్లో కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ వివరాలు తెలిసిన తరువాత కేంద్రంపై దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరిలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం జనవరిలో మూడు నెలల గరిష్టానికి 6.52 శాతానికి చేరింది. ఒక పక్క ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని ఆర్బీఐ ఇటీవలే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా వడ్డీ రేట్లను భారీగా పెంచడం వల్ల దాని ప్రభావం పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాలపై పడుతుందని ఆర్దిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు ఉత్పత్తిని దెబ్బతీస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్రం చమురు, మొక్కజొన్న వంటి వాటిపై ఉన్న పన్నులను తగ్గించే అవకాశం…
ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్రలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువులు శివుడిని మూర్తి రూపం తో పాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ రూపమే ప్రధానమైనదిగా విశ్వసిస్తారు. లింగంలో యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. మొత్తం 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శైవులు విశ్వసిస్తారు. కాగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. వివిధ ప్రదేశాలలో వెలసిన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఇవన్నీ మహాశివుని భిన్న రూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాల పేర్లు ఈ ప్రకారం: మల్లికార్జునుడు(శ్రీశైల క్షేత్రం), సోమనాథ్(గిర్, గుజరాత్), మహాకాళేశ్వర్(ఉజ్జయిన్, యుపి),ఓంకారేశ్వర్(మధ్యప్రదేశ్), కేదార్‌నాథ్(ఉత్తరాఖండ్), భీమశంకరం(పుణె, మహారాష్ట్ర), కాశీ విశ్వనాథుడు(వారణాసి, యుపి), త్రయంబకేశ్వర్(నాసిక్, మహారాష్ట్ర), బైద్యనాథ్(దేవ్‌ఘర్, జార్ఖండ్), నాగేశ్వర(వ్వారక, గుజరాత్), రామనాథస్వామి(రామేశ్వరం), ఘృష్ణేశ్వర్(ఔరంగాబాద్, మహారాష్ట్ర). కాగా..అనేక జాతీయ దినపత్రికల్లో దర్శనమిచ్చిన పూర్తిపేజీ ప్రకటనలు తాజా వివాదానికి కారణమయ్యాయి.…
భారత విమానయాన చరిత్రలో టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఏకంగా ఒకేసారి 470 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా దీనిపై ఒప్పందం చేసుకొని చరిత్ర సృష్టించింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా. విమానాలను సరఫరా చేయనున్నవి దిగ్గజ కంపెనీలు అమెరికాకు చెందిన బోయింగ్, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ లతో ఒకేరోజు ఒప్పందాలు చేసుకుంది. ఈ విమానాల రాకతో ఎయిరిండియా భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా తన సర్వీసుల్ని పెంచనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ నుంచి తొలుత 250 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం చేసుకోగా.. కాసేపటికే అమెరికాకు చెందిన బోయింగ్ నుంచి మరో 220 విమానాలను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. ఇక ఈ మొత్తం ఆర్డర్ విలువ రూ.6.40 లక్షల కోట్లి. డాలర్లలో చెప్పుకుంటే 80 బిలియన్ డాలర్లు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఒప్పందం ఆన్‌లైన్‌లోనే జరిగింది. వర్చువల్ సమావేశంలో టాటా గ్రూప్ మాజీ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1949 జూన్ 1న ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్‌గా సేవలందించారు. గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980 – 85 మధ్య చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్ గా విధులు నిర్వహించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చాలా ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2014లో తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకు రాజీనామా చేశారు. 1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీనెల్లూరు) నియోజకవర్గం నుంచి గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి…
తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వంకు రాష్త్ర హైకోర్టులో చుక్కేదురైంది. మార్చి 14 వరకు బదిలీలు చేపట్టవద్దని, అప్పటి వరకు ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. టీచర్ల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధించిన రాష్ట్ర హైకోర్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు పలు నిబంధనలు విధించింది. ప్రక్రియ కొనసాగుతుండగా, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. వీటిపై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తం అవటంతో విచారణ జరిపిన హైకోర్టు బదిలీలపై స్టే విధించింది. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జనవరి 28న మొదలు కాగా దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జీవో 317 ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన టీచర్లు తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ఇతర ప్రాంతాలకు…
న్యూజిలాండ్ చరిత్రలోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది. వేల కుటుంబాలు విద్యుత్తు అందకపోవడంతో చీకట్లో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి గంటకు 140 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ‘న్యూజిలాండ్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఈ కారణంగా పదివేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెనీ విధించాము’ అని అత్యవసర నిర్వహణా మంత్రి కీరన్ మెక్ అనుల్టీ తెలిపారు. అయితే ఈ అనుకోని తుఫాను వల్ల ఉత్తర ద్వీపంపై బాగా ప్రభావం చూపుతుందని, ఇది న్యూజిలాండ్‌వాసులకు అతిపెద్ద విపత్తు అని మంత్రి కీరన్ మెక్ అనుల్టీ పేర్కొన్నారు. తుఫాను ఎమర్జెనీ సేవలకు కూడా ఆటంకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు దాదాపు 11 మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయని న్యూజిలాండ్ వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధాని క్రిస్…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) కమిటీని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హెచ్‌సిఎ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హెచ్‌సిఎ ఎన్నికల ప్రక్రియకు సబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో హెచ్‌సిఎ ఎన్నికలు నిర్వహించాలని సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే కోర్టును కోరారు. హెచ్‌సిఎలో అసలైన ఓటర్లను ఆయన ఎంపిక చేయగలుగుతారని పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు గతంలో ఇండియన్ ఓలింపిక్ అసోసియేషన్ (ఐఓఎ) కోసం ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసే ప్రక్రియను పర్యవేక్షించారని, ఇప్పటికే ఐఓఎ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటి నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. గత కొంత…
బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కలవాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని, రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని బండి చురకలంటించారు. ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాత్రలతో ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు తన్నుకుని, అప్పుడు…
ఆదాయపన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైల్లోని బిబిసి కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ పన్నుల విధానంలో అక్రమాలు, బదిలీ ధరలలో అవకతవకలకు సంబంధించిన సర్వే కోసం బిబిసి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే కోసం అధికారులు బిబిసి కార్యాలయాలను మూసివేశారు. ఈ సోదాల్లో జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లను ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇందులో పనిచేసే ఉద్యోగులెవరినీ ఆఫీసుకు రావొద్దని ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు బిబిసి ఏజెన్సీకి తెలిపారు. కాగా, ఆదాయపన్ను అధికారుల సోదాల్లో కార్యాలయాలను మూసివేయడం వల్ల..ఉద్యోగులను పనికి దూరంగా ఉండమని బిబిసి సిబ్బందికి పేర్కొంది. ఈ సందర్భంగా.. ‘పనిలో ఉన్నవారు భయపడకండి. మేము ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము’ అని బిబిసి వెల్లడించింది. అయితే ఈ సోదాల వల్ల ఉద్యోగులు ఆందోళన చెందడంతో.. కేవలం సర్వే మాత్రమే…