కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొత్తంగా రూ. 12,800 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ. 4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టులకు కాగా, ఏపీలోని ప్రాజెక్టుల కోసం రూ. 8,406 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2009-2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. బడ్జెట్‌లో తెలంగాణకు భారీగా కేటాయింపులు జరిగాయని, చాలా చోట్ల అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం జరుగుతోందని రైల్వే మంత్రి వైష్ణవ్ వివరించారు. వీటిలో డబ్లింగ్, ట్రిపులింగ్ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో రోజువారీ సరుకులు కూడా ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు ప్రయాణికుల మంచి స్పందన వస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.…
Author: Editor's Desk, Tattva News
ప్రభుత్వం రాసిచ్చింది చదివిన గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరణి ప్రస్తావన లేదని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ విస్మయం వ్యక్తం చేశారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడాహుడి చేసిన ప్రభుత్వం దానిలోని తప్పులను సరిచేయడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రైతుల సర్వే నెంబర్లు తప్పుతడకలతో ఉన్నాయని పేర్కొంటూ, దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యల గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన విమర్శించారు. విద్యుత్ కోసం రైతులు వ్యవసాయ క్షేత్రాలలో జాగారం చేస్తునారని, రైతాంగం గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఈటెల కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పేదలకు ఇళ్ళను కట్టించలేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన హడ్కో నిధులతో సిద్ధిపేట, గజ్వెల్…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే టాప్-1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబర్ నాటికి సిద్దం చేస్తామని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ, తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి హుండీ లెక్కింపు ప్రారంభిస్తామని, నాణేల లెక్కింపు కోసం అధునాతమనైన యంత్రాలను జర్మనీ నుంచి తీసుకువస్తున్నామని చెప్పారు. అవి రాగానే ఇక పై శ్రీవారి హుండీ కానుకల లెక్కింపును పూర్తిస్థాయిలో తిరుమలలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో తేదిని నిర్ణయించి తెలియజేస్తామని తెలిపారు. ఇక భక్తులకు మరింత మెరుగైన డిజిటల్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగారుపాళ్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సెంటర్ లైన్లో సభ నిర్వహించవద్దని మరోచోట నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులకు తీరుకు నిరసనగా నేలపైనే కూర్చుని లోకేశ్, టీడీపీ నేతలు నిరసన తెలిపారు. బహిరంగ సభను అడ్డుకున్న పోలీసు తీరుపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరు ఏం చేసినా యువగళం ఆపలేరని లోకేశ్ స్పష్టం చేశారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పిన లోకేశ్, పక్కనున్న భవనంపై నుంచి ప్రసంగించారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహణకు ప్రయత్నం చేయడంతో టీడీపీ ప్రచార రథాన్ని సీజ్ చేశామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 8 వ రోజుకు చేరింది. పాదయాత్రలో ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ వారి…
తెలంగాణ సాధిస్తున్న సమగ్రాభివృద్ధి దేశానికి ఆదర్శప్రాయంగా ఉందని గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ కితాబిచ్చారు.కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాగుతున్న మాటల యుద్ధం అనంతరం హైకోర్టు జోక్యంతో సయోధ్య కుదరడంతో, రెండేళ్ల తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి ఆమె శుక్రవారం ప్రసంగిస్తూ ప్రతీ రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రగతిని తెలంగాణ సాధిస్తోందని కొనియాడారు. ప్రజల ఆశీస్సులు, సిఎం కెసిఆర్ పాలనాదక్షత, అంకితభావం వల్లనే అపూర్వ విజయాలు సాధించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ఆయకట్టును అభివృద్ధి చేశామని ఆమె చెప్పారు. ఆమెకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతతం పలికారు. 24 గంటల కరెంటు సరఫరాతో వెలుగు జిలుగుల తెలంగాణ సాధ్యమైందని చెబుతూ దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని గవర్నర్ ఆమె ప్రశంసించారు. వంద శాతం గ్రామాల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. తెలంగాణ గ్రామాలు…
తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూశారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా చాటిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను కాపడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన మృతి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కాశినాథుని విశ్వనాథ్ జన్మించారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. బాల్యం నుంచి చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా,…
బీఆర్ఎస్, ఆప్ పార్టీల మధ్య బంధానికి ఢిల్లీ లిక్కర్ స్కాం పునాదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. తప్పు చేస్తే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) – భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య లిక్కర్ బంధం బయటపడిందని ఆయన స్పష్టం చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చారించారు. రెండు పార్టీలకు చెందిన కీలక వ్యక్తులు కలిసి కుంభకోణం ఎలా చేశారో, వచ్చిన సొమ్మును గోవా ఎన్నికల్లో ఎలా ఖర్చు చేశారో సవివరంగా చార్జిషీటులో పొందుపరిచారని ఆయన వెల్లడించారు. ఈ అనుబంధంతోనే ఖమ్మంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్…
కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో 564 మంది విద్యార్ధులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ కేవీపీవైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్‌స్పైర్, ఇన్స్పైర్-షీ బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలు చేస్తారని తెలిపారు. కేవీపీవై ఫెలోషిప్ కింద 2023-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 1 వరకు 843.80 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన కింద 2019-20లో 17.34కోట్లు, 2020-21లో 20,71 కోట్లు, 2021-22 లో 13.45 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పరిశోధన రంగంలో ప్రతిభ, యోగ్యత కలిగిన విద్యార్దులను అధిక సంఖ్యలో గుర్తించేందుకు కేవీపీవై ప్రోగ్రాంను (ఎస్‌హెచ్‌ఈ) స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్…
రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లున్నాయి. సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్‌లో కేజ్రీవాల్ పేరు వెల్లడైంది. ఇప్పటికే విచారించిన వారి జాబితాలో అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం స్కామ్ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. మొత్తం 65 మందిని ప్రశ్నించామని, 100 కోట్లు చేతులు మారాయని తెలిపింది. నిందితులు…
అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముని విగ్రహం కోసం అత్యంత అరుదైన శిలలు బుధవారం రాత్రి నేపాల్ నుంచి ఇక్కడకు చేరుకున్నట్లు ఆయల ట్రస్టు నిర్వాహకుడు ఒకరు తెలియచేశారు. ఈ శిలలతో శ్రీరాముని విగ్రహాన్ని మలచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిలలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు గురువారం మధ్యాహ్నం అందచేయగా వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ శిలలను 51 మంది వేద పండితులతో పూజలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. నేపాల్‌లోని జానకీ మందిరం మహంత్ తాపేశ్వర్ దాస్ ఈ శిలలను రామందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు బహూకరించారని అధికారులు తెలిపారు. ఈ శిలలను శ్రీరాముని బాల్యరూపంలో చెక్కి వాటిని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించనున్నట్లు వారు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కానున్నట్లు వారు చెప్పారు. పవిత్రమైన రెండు శిలలతో జనవరి 25న నేపాల్‌లోని ముస్తంగ్ జిల్లా నుంచి విశ్వ…