ముచ్చింతల్‌తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కేంద్రం ఏర్పడి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందని వెల్లడించారు చిన జీయర్ స్వామిజీ. ముచ్చింతల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారని తెలిపారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారని చెబుతూ కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందని చెప్పారు. అలాగే, రామానుజాచార్యులు…
Author: Editor's Desk, Tattva News
రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఇంత వరకు ఆమోదించలేదంటూ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే పిటిషన్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి, పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. పైగా, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గవర్నర్ ను విమర్శించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 3న సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుమతి కోరుతూ ఈ నెల 21న గవర్నర్ కు లేఖను పంపించింది. అయితే రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి…
దేశాధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్గాన్ మహిళల స్వేచ్ఛా, హక్కులపై తాలిబాన్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కఠిన ఆంక్షలతో వారిని విద్యకు దూరం చేస్తున్నారు. ఇంతకు ముందే ఆఎn్గాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యపై ఉక్కు పాదం మోపి, కఠిన ఆంక్షలు కొనసాగుతుండగా, తాజాగా విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్షకు మహిళలు హాజరుకాకుండా తాలిబన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. నిషేధన ఉత్తర్వులను దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి ప్రవేశ పరీక్షకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఆఎn్గాన్ మహిళలకు ఉండదు. ప్రభుత్వేతర కార్యాలయాల్లో మహిళల్ని పని చేయకుండా నిషేధం విధించి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల్ని, అపఖ్యాతిని మూటకట్టుకున్న తాలిబన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో తన నియంతృత్వ పాలనను మరోసారి బహిర్గతం చేసుకుంది. మహిళలకు విశ్వవిద్యాలయ చదువుల్ని దూరం చేస్తూ తాలిబన్ ప్రభుత్వం నిరవధిక నిషేధం నిర్ణయంపై హక్కుల సంస్థలు ఆందోళన చేపట్టాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్…
తొలిసారి జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెల్చుకుంది. సుదీర్ఘకాల నిరీక్షణకు తెరదించుతూ.. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్‌లోనే అద్భుత విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికాలో ఆదివారం జరిగిన ఫైనల్లో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత అండర్19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్‌లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయంతో ఫైనల్ చేరిన షఫాలీ బృందం.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అండర్-19 బాలికల జట్టు.. 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. నలుగురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రియానా మెక్‌డొనాల్డ్ (19) టాప్ స్కోర్‌గా నిలిచింది. మన బౌలర్లలో టిటాస్ సధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ,…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభతో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ముందుగా అనుకోకుండా అకస్మాత్తుగా శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరింఛారు. తన ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ లాల్ చౌక్‌లో మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత రాహుల్ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గమనార్హం. ముందుగా ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా జాతీయ పతాకం సోమవారం ఎగరవేయడానికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో, ఇక్కడకు సమీపంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎగురవేయాలని అనుకున్నారు. అయితే, శనివారం అధికారులతో జరిగిన మంతనాలలో ఆదివారం ఎగురవేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే, పాదయాత్రగా కాకుండా గుప్కర్ దగ్గర నుండి వాహనాల కాన్వాయ్ లో వచ్చి రాహుల్ ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోమవారం పార్టీ…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రెండు రోజులు పార్లమెంటు ఉభయ సభల్లో జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉండదని పార్లమెంటరీ బులెటిన్ పేర్కొంది. జనవరి 31న సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. పార్లమెంటు సమావేశాల రెండో రోజున కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘జనవరి 31న సమావేశమయ్యే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం వల్ల ఆ రెండు రోజులు ‘జీరో అవర్’ ఉండదని పార్లమెంటరీ బులెటిన్ పేర్కొంది. జీరో అవర్‌లో లేవనెత్తాలనుకుంటున్న ప్రజా ప్రాముఖ్యత అంశాలను ఫిబ్రవరి 2న చేపట్టనున్నట్లు కూడా ఆ బులెటిన్ పేర్కొంది. ఫిబ్రవరి 2 నుంచి ఉభయ సభలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం’పై చర్చను నిర్వహిస్తాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సమాధానాలిస్తారు.…
కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలి? అని క్షుద్రపూజలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇతరుల నాశనం కోరుకునేవాడు బాగుపడదని విమర్శించారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాల అభివృద్ది చేస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇస్తానన్న నిధులు ఎక్కడ? అని ప్రశ్నించారు. బీజేపీ ఆధికారంలోకి వస్తే కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్లు చొప్పున రూ.400 కోట్లు ఇస్తామని, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రూ.100 కోట్లు, కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి 2 నెలలు కావొస్తున్నా.. పైసా ఇవ్వలేదని సంజయ్ విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబం…
ఒడిశాలోని బ్రిజరాజ్‌నగర్‌లో ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ ఆదివారం మృతిచెందారు. ఛాతీ భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో.. ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. గుండె, ఎడమ ఊపిరితిత్తుల వైపు దూసుకెళ్లిన బుల్లెట్ తీవ్ర గాయం చేయడంతో ఆయన మృతిచెందినట్టు ప్రకటించారు. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీ చౌక్ దగ్గర మంత్రిపై కాల్పులు జరిగాయి. మంత్రి నబకిశోర్.. వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన మంత్రిని.. ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి నవీన్ పటాుయక్ నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్లి మంత్రికి అందుతును చికిత్సపై వైద్యులతో సమీక్షించారు. అవసరమైతే హైదరాబాద్, బెంగళూరు ఆసుపత్రులకుతరలించాలనికూడా…
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పారిశ్రామిక సంస్థలలో ఒకటిగా పేరొందిన అదానీ గ్రూపు అక్కౌంట్స్ మోసాలు, మనీలాండరింగ్ ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఈ గ్రూప్ కు భారీగా అప్పులు ఇవ్వడంతో పాటు ఈక్విటీ రూపంలో పెట్టుబడులు సమకూర్చిన బ్యాంక్‌లు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు ఇరకాటంలో పడుతున్నాయి. అమెరికన్ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ అవకతవకలపై విడుదల చేసిన 108 పేజీల నివేదికపై ఆ సంస్థకానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు పెదవి విప్పక పోవడంతో వివిధ రూపాల్లో ఆ గ్రూపునకు వెళ్లిన తమ పొదుపు మొత్తాలు ఎంతవరకు సురక్షితమనే ఆందోళన ప్రజలలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసి అదానీ గ్రూపు సంస్థల్లో కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడులు పెడుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్‌లో 2.11…
రాష్ట్రపతి భవన్‌లోని ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. 75 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకుని “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పేరును పెట్టినట్లు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా తెలిపారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనిని దృష్టిలో ఉంచుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాచరణను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చినట్టు తెలుస్తోంది. ఇకపై సరికొత్త నామధేయంతో కొనసాగనున్న ఈ ఉద్యానవనాన్ని ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. కాగా, ప్రజల సందర్శన నిమిత్తం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఉద్యానవనం పూర్తిగా వికసించిన రంగురంగుల పువ్వులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చార్…