Author: Editor's Desk, Tattva News

ప్రముఖ సోషల్‌ షేరింగ్‌ యాప్‌ షేర్‌చాట్‌ తన ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆర్థిక మాంద్యం, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరులోని మాతృ సంస్థ మొహల్లా టెక్‌ తెలిపింది. షేర్‌చాట్‌తోపాటు షార్ట్‌ వీడియో యాప్‌ మోజ్‌ కూడా 500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం షేర్‌చాట్‌ సంస్థలో 2,200 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో 20 శాతం అంటే దాదాపు 600 మందిని తొలగించనుంది. కంపెనీ చరిత్రలో అత్యంత బాధాకరమైన, కష్టమైన నిర్ణయాలను తీసుకోవలసివచ్చందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రారంభం నుండి మాతో పాటు ఉన్న ప్రతిభావంతులైన ఉద్యోగుల్లో సుమారు 20 శాతం మందిని తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్‌ వరకు వంద శాతం వేరియబుల్‌ పేని చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నోటీసు పీరియడ్‌ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లించనున్నారు. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు…

Read More

ఢిల్లీలో వాయు కాలుష్యంపై వినూత్నంగా నిరసన తెలుపుతూ బీజేపీ ఎమ్మెల్యేలు మాస్కులు ధరించి ఆక్సిజన్ సిలిండర్లతో ఢిల్లీ అసెంబ్లీకి వచ్చారు. విషపూరిత గాలికి ప్రజలు చనిపోతున్నా సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. ”గ్యాస్ ఛాంబర్‌లో బతుకు భయంతో కాలం గడుపుతున్న రెండు కోట్ల మంది ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించబోతున్నాను. కాలుష్య రహిత రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలోమిటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి” అని విపక్ష నేత విజేందర్ గుప్తా ఒక ట్వీట్‌లో తెలిపారు. ఢిల్లీని పొగ చుట్టుముట్టిందని, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ జబ్బుల బారిన పడుతున్నారని, చేతకాని ఆప్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోందని ఆయన విమర్శించారు. సిలెండర్లు తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలను స్పీకర్ నివాస్ గోయెల్ మందలించారు. సిలెండర్లు దూరంగా పెట్టి రావాలన్నారు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లున్నప్పటికీ సిలెండర్లను ఎలా తీసుకువచ్చారని వారిని ప్రశ్నించారు. సెక్యూరిటీ సిబ్బంది తన ఛాంబర్‌కు వచ్చి కలవాలని…

Read More

ఈ నెల 24వ తేదిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకోనున్నారు.. ఏపీలో తలపెట్టిన బస్సు యాత్ర కోసం సిద్దం చేసి వారాహి వాహనానికి కూడా అదే రోజు పుణ్యక్షేత్రం కొండగట్టులో పూజలు జరిపించనున్నారు. ఈ మేర‌కు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరగ్గా, కొండగట్టు అంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్టు పవన్ కల్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారని వివరించింది. అందుకే తాను తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచే ప్రారంభించడాన్ని ఆయన శుభసూచకంగా భావిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది. “ఈ క్రమంలో… రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహిని ఇక్కడ నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ జనసేనకు చెందిన ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే…

Read More

ప్రపంచంలో మరే దేశం చేయని విధంగా అత్యంత వేగంగా, సత్వరమే కోట్లాది మందికి కరోనా టీకాలు అందుబాటులోకి తెచ్చి, ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో అద్భుత ఫలితాలు సాధించిన భారత దేశంలో ఈ టీకాలు కొన్ని ఇతర దుష్ప్రభావాలు కూడా కలిగించినట్టు వెల్లడవుతుంది. ముఖ్యంగా ఈ టీకాలను తీసుకున్న వారికి కొన్ని దుష్ప్రభావాలు (ఇతరత్రా ఆరోగ్య సమస్యలు) తలెత్తినట్లు ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు ప్రతిషకరమైన సంస్థలు ఈ విషయమై సాధికారిక వివరాలు అందించాయి. పుణెకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ శారద సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కింద అడిగన ప్రశ్నకు భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(సిడిఎస్‌సిఓ) ఇచ్చిన సమాధానాలతో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతించిన వ్యాక్సిన్లలో పుణెకు చెందిన సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్, కోవోవ్యాక్స్,…

Read More

దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం ఒక్క శాతం బిలియనీర్ల చేతుల్లోనే ఉందని ఓ నివేదిక తెలిపింది. అట్టడుగున ఉన్న సగం మంది జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. 2020లో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 102 కాగా 2022 నాటికి 166కు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. దావోస్‌లో జరుగుతున్న ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ వార్షిక సమావేశం సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌ పేరుతో ఈ నివేదికను రూపొందించింది. భారత్‌లోని పది మంది ధనవంతులపై 5 శాతం చొప్పున పన్ను విధించడం ద్వారా వచ్చే మొత్తంతో పాఠశాల మానేసిన పిల్లలందరినీ తిరిగి తీసుకురావచ్చని పేర్కొంది. 2017- 2021 మధ్య అసమానంగా పెరిగిన బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చని, దీంతో దేశంలో…

Read More

కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం మాట్లాడుతూ ‘నేనూ మధ్యతరగతి కుటుంబానికి చెందినదానినే. మధ్యతరగతి ప్రజల కష్టాలు నాకు బాగా తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యతరగతి మీద ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న ఆమె 2023-24 యూనియన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిధిని పెంచి మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.‘నేనూ మధ్య తరగతి వర్గానికి చెందిన దానినే. మధ్య తరగతి ప్రజలపై ఉన్న ఒత్తిడి గురించి నాకు తెలుసు’ అని ఆమె జాతీయ వారపత్రిక ‘పాంచజన్య’ మ్యాగజైన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. పైగా, మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి కొత్త పన్నులు విధించలేదని ఆమె చెప్పారు. ఆదాయపు పన్ను పరిధి రూ. 5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. 27 నగరాలలో మెట్రో…

Read More

చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు భూపతిరాజా వెల్లడించారు. ఆయన  ఆయన వయసు 86 సంవత్సరాలు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసారు. బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి హిట్ సినిమాలకు కథ అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన ‘బంట్రోతు భార్య’ సినిమాకు కూడా ఆయనే కథ అందించారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40 కథల వరకు అందించారు. బాలమురుగన్ మృతి పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బాలమురుగన్ మృతి చెందిన  విషయం తెలుసుకున్న తెలుగు,  తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాల మురుగ‌న్ త‌న‌యుడు భూప‌తి రాజా కూడా తండ్రిలాగానే సినీ…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నూత‌న స‌చివాల‌యానికి నామ‌క‌ర‌ణం చేశారు. పాత స‌విచాల‌యంలోని 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్‌ ఉంటుంది..తెలంగాణ…

Read More

మూడో వ‌న్డేలో భార‌త జ‌ట్టు భారీ విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఇండియా 317 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడిచింది. పేస‌ర్ మ‌హమ్మ‌ద్ సిరాజ్ ధాటికి శ్రీ‌లంక టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. అత‌ని పేస్ దెబ్బ‌కు ట‌ప‌ట‌పా వికెట్లు కోల్పోయింది. కీల‌క‌మైన న‌వ‌నిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చ‌రిత అస‌లంక (1)ల‌ను సిరాజ్ అవుట్ చేయ‌డంతో లంక కోలుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత ష‌మీ, కుల్దీప్ యాద‌వ్ వికెట్ల వేట కొన‌సాగించారు. చైనామ‌న్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఓవ‌ర్‌లో లంక కెప్టెన్ ద‌సున్ ష‌న‌క బౌల్డ్ అయ్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవ‌ర్ చివ‌రి బంతికి కుమ‌ర‌ను కుల్దీప్ బౌల్డ్ చేయ‌డంతో 73 ప‌రుగుల‌కే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ 4 వికెట్లు, ష‌మీ, కుల్దీప్ యాద‌వ్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో,…

Read More

ఎనిమిదో నిజాం నవాబు భర్కత్‌ అలీ ఖాన్‌ వల్షన్‌ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి నగరానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన బౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు. ముకరం ఝా హైదరాబాద్ చిట్టచివరి ఏడో నిజాం రాజు అయిన మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌ మనుమడు. ముకరం ఝా.. హైదరాబాద్ చిట్టచివరి ఏడో నిజాం రాజు అయిన మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌ మనుమడు. మిర్ హిమాయత్ అలీ ఖాన్ వురపు అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతులకు 1933 అక్టోబర్‌ 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్ టర్కీ (ఒట్టోమన్ సామ్రాజ్యం) చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె కావడం గమనార్హం.…

Read More