2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావించే విధంగా 2023లో కొన్ని కీలక రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు చేపట్టాలని కసరత్తు చేస్తున్నట్లు బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, తమది పనిచేసే ప్రభుత్వమని చాటడం, పార్టీలో, ప్రభుత్వంలో అసమ్మతిని చల్లార్చడం, పార్టీలో ఎవరూ తమను మించిన వారు లేరన్న అహంభావాన్ని ప్రదర్శించకుండా అడ్డుకట్ట వేయడం వంటివి మంత్రివర్గ మార్పులకు ప్రధాన కారణాలని పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో వరుసగా జరుగుతున్న సమావేశాలు మంత్రివర్గంలో మార్పుల వార్తలకు ఊతమిస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీలలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత, ఈ…
Author: Editor's Desk, Tattva News
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, అందుకే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబాన్ని సంజయ్ శుక్రవారం పరామర్శించారు. మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపి మీడియాతో మాట్లాడారు. అనంతరం రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు, బీజేపీ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. అంతకుముందు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘కేసీఆర్ పాలనలో రైతులు చితికిపోతున్నారు. ఇక్కడి రైతులను పట్టించుకోని కేసీఆర్.. బీఆర్ఎస్ పెట్టి కిసాన్ సర్కార్ తెస్తానని బయలుదేరారు” అని విమర్శించారు. కామారెడ్డి రైతులకు…
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్‌లో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్న ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్'(టీఆర్‌ఎఫ్)పై కేంద్రం చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ”లష్కరే పరోక్ష సంస్థ 2019 నుంచి కార్యకలాపాలు చేపట్టిన టీఆర్‌ఎఫ్ ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్ ద్వారా యువతను నియమించుకుంటోంది. ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం, నియామకాలు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడుతోంది” అంటి ప్రకటించింది. “జమ్మూకశ్మీర్ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా టీఆర్‌ఎఫ్ ప్రభావితం చేస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని అమాయక ప్రజలు, భద్రతా దళ సభ్యుల హత్యల పథక రచనకు సంబంధించి ఇప్పటికే టీఆర్‌ఎఫ్ సభ్యులు, అనుబంధ వర్గాలపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి” అని ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. 26/11 ముంబై దాడులకు పాల్పడిన…
ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో శుక్రవారం జరగవలసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది. ఉదయం మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఢిల్లీ మున్పిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా, వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆప్ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొటెం స్పీకర్ సత్య శర్మను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ్యులెవరీనీ ప్రమాణస్వీకారం చేయనీయలేదు. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు మైకులు, కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటనలో కొందరు సభ్యులకు గాయాలయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించకుండానే సభ వాయిదా పడింది. డిసెంబరులో జరిగిన 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెపిని నెట్టివేసి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను …
తెలంగాణాలో అధికారంలోకి రావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి ప్రజలకు చేరువ అయ్యేందుకు నిత్యం పలు రకాల కార్యక్రమాలు చేబడుతున్నది. తాజాగా, మహిళలను ఆకట్టుకునేందుకు సంక్రాంతికి ముగ్గులతో వారికి చేరువ కావాలని బిజెపి భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు ప్రతి చోట పెద్ద ఎత్తున కమలం పువ్వుతో సంక్రాంతి ముగ్గులు వేయించాలని బిజెపి అధినాయకత్వం సూచించింది. సంక్రాంతి పండుగ అంటేనే మహిళలు ఎక్కువగా ఇష్టపడే పండుగ. ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గులు వేయడాన్ని మహిళలు ఇష్టపడతారు. రకరకాల డిజైన్లతో ముగ్గులు వేసి, వాటిలో రంగులు నింపి ప్రతి ఇంటి ముందు కలర్ ఫుల్ గా ముగ్గులు దర్శనమిస్తాయి. ఇక ఈ క్రమంలోనే బిజెపి గుర్తు అయిన కమలం పువ్వు ను ఇళ్ళ ముందు వేసి ముగ్గులు తీర్చిదిద్ది బిజెపి బలాన్ని ప్రత్యర్థులకు చూపించాలని అధిష్టానం సూచించింది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్ల తోపాటు, గ్రామాలు, పట్టణాలు, సిటీలలో బిజెపి అభిమానులతో ఇంటి ముందు…
దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఆనాటి మన పూర్వీకుల్లో ఏకైక జన్యువు లోపించడమే తరతరాలుగా గుండెపోటుకు, గుండెజబ్బులకు దారి తీస్తోందని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డిగో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఆ జన్యులోపం కారణంగానే జంతు మాంసం తిన్నవారికి ఈనాడు అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయని కూడా చెప్పారు. గుండెకు సంబంధించిన ధమనుల్లో కొవ్వు పదార్ధాలు పేరుకుని పోవడంతో వచ్చే జబ్బును అథెరోస్కిరోసిస్ అని అంటారు. ప్రపంచం మొత్తం మీద వచ్చే గుండెజబ్బుల రోగుల్లో మూడోవంతు మరణాలకు ఇదే కారణంగా పరిశోధనల్లో వెల్లడైంది. ఇది కాక, బ్లడ్ కొలెస్టరల్, మాంద్యం, చురుకుదనం లోపించడం, వయోభారం, రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం ఇవన్నీ కూడా గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. ఏదెలా ఉన్నా గుండెజబ్బులకు (కార్డియో వాస్కులర్ డిసీజ్) సంబంధించిన సంఘటనలు అథెరోస్క్లిరోసిస్ వల్లనే 15 శాతం వరకు ఉంటున్నాయని పరిశోధకులు వివరించారు. మానవుల్లో ఇది సహజంగా కనిపించినా, చింపాంజీ వంటి మానవ…
అతిపెద్ద టెలికాం సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్ వచ్చే ఏడాది నుంచి 5జి సేవల్ని అందించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ల 5జి సేవలను ప్రారంభించే కార్యక్రమంలోకేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒడిశాలో టెలికాం సర్వీసులకు 2022-23 సంవత్సరానికి గాను నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 5,600 కోట్లను మంజూరు చేసింది. ఈ రాష్ట్రంలో ప్రపంచస్థాయి కమ్యూనికేషన్ సౌకర్యాల కోసం 5,000 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేస్తాం. రెండు సంవత్సరాల్లోనే ఒడిశా 5జి సేవల పరిధిలోకి వస్తుంది” అని ప్రకటించారు. భువనేశ్వర్, కటక్‌లలో 5జి సేవలు ప్రారంభించాము. జనవరి 26 లోపు 5జి సేవలను ప్రారంభించాలనే నిర్ణయానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే ఏడాది నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ 5జి సేవలు అందబాటులోకి రానున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒడిశాలోని గ్రామీణ…
ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మహిళా క్రికెటర్ కి విగ్రహం ఏర్పాటు చేశారు. దాంతో ఆస్ట్రేలియా దిగ్గజ మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్‌కు అరుదైన గౌరవం లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లోని ప్రవేశ ద్వారం ‘వాక్ ఆఫ్ ఆనర్’ వద్ద బెలిండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ ఘనత అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా బెలిండా రికార్డులకెక్కారు. డేమ్ క్వెంటిన్, న్యూ సౌత్‌వేల్స్ ప్రీమియర్ మొమినిక్ పెరోటెట్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓ మహిళా క్రికెటర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి. బెలిండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2021లో ప్రకటించారు. కాగా, స్టేడియం ఆవరణలో ఇప్పటికే 73 పురుష క్రికెటర్ల విగ్రహాలు ఏర్పాటు చేయగా, ఆ ఎలైట్ లిస్ట్‌లో ఇప్పుడు బెలిండా కూడా చేరింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ విజేత, ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ అయిన బెలిండా క్లార్క్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అభినందించింది.…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుపై కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జిఓను కొట్టివేస్తూ, సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర హైకోర్టు అప్పగించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు హైకోర్టు నుండి అందిన వెంటనే గురువారమే కసరత్తు చేపట్టింది. ముందుగా, తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి బదిలీ చేసిన క్రమంలో ఎఫ్ ఐ ఆర్ నమోదుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొందిమరోవంక, ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డిజిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. కేసు దర్యాప్తు సీరియస్‌గా జరుగుతోందని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కోణం ఉందని హైకోర్టుకు నివేదించింది. అయిథెక్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఇప్పుడే స్టే ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. అప్పీల్ పిటిషన్లు విచారణ దశలో ఉండగా స్టే అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో సింగిల్ జడ్జి తీర్పును…
తెలగాంణలో ఆర్థిక సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముతోందని, కేంద్రం నిదులను ఇతర పథకాలకు దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును కేంద్రమే ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చిందన్న బీఆర్‌ఎస్ నేతల వాదనను ఆయన ఖండించారు. అవినీతిపై దర్యాప్తు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడడం కాకతాళీయమేనని చెప్పారు. కేసీఆర్.. బీఆర్‌ఎస్ కాదు డబ్ల్యూఆర్‌ఎస్ (ప్రపంచ రాష్ట్ర సమితి) పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల కేంద్రం నుంచి పంచాయతీలకు రూ.5080 కోట్లు విడుదల చేేస్త డిజిటల్ కీల ద్వారా గంటల్లోనే ఆ నిధులను దారి మళ్లించారని కేంద్ర మంత్రి విమర్శించారు. అయితే ‘గద్దలా కాచుకొని ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. ఫండ్స్ వచ్చిన గంటలోపే దారి మళ్లించింది. ఇంతకు మించి దౌర్భాగ్యపు పరిస్థితి మరోటి ఉండదు’ అని మండిపడ్డారు. డిజిటల్…