జనవరి 1, 2023 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణానికి ముందు వారు తమ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. కరోనా కేసులు విదేశాల్లో మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. రెండు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో ముందు నుంచే నివారణ చర్యలు చేపట్టింది. పౌరులంతా మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న 40 రోజులు భారత్ కు కీలకమని కేంద్రం ఇటీవలే వెల్లడించింది. జనవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం తదితర ఏర్పాట్లపై కేంద్ర…
Author: Editor's Desk, Tattva News
చైనాలో కరోనా విలయతాండవం చేస్తూ, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలు దేశాలు అక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి ఆంక్షలు విధిస్తోంది. తమ దేశాల్లోకి రావాలంటే కచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్టు ఉండాలని సూచిస్తుంది. తాజాగా స్వదేశీ, విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే భారత్, జపాన్, మలేషియాలు.. డ్రాగన్ కంట్రీ నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరింది. చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చైనా నుంచి వచ్చేవారు నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలన్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అమెరికా తెలిపింది. చైనా నుంచి నేరుగా కాకుండా సియోల్, టొరంటో, వాంకోవర్ మీదుగా వచ్చే ప్రయాణికులకు కూడా ఇదే షరతు…
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకు పోవడంతో అప్పులు కూడా పుట్టని పరిస్థితులు నెలకొనడంతో, ప్రధాని జోక్యం చేసుకొని రాష్ట్రానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ రుణపరిమితిని పెంచేటట్లు చేయమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభ్యర్ధించారు. బుధవారం ఆయనతో సమావేశమై సుమారు 45 నిముషాలు చర్చించిన ముఖ్యమంత్రి ఆర్ధికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఏపీకి కొత్త అప్పులు ఇవ్వడం సాధ్యంకాదని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తేటతెల్లం చేసిన నేపథ్యంలో గతంలోని టిడిపి పాలనపై విమర్శలు గుప్పిస్తూ, వారి చేసిన పనుల కారణంగానే ప్రస్తుతం కేంద్రం తమపై రుణపరిమితి ఆంక్షలు విధిస్తున్నదని, కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని ఆరోపించారు. అయితే, జగన్ అభ్యర్ధనలు విన్న ప్రధాని ఎటువంటి హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలపలేదు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరానికి నిధులు, రుణాలపై విధిస్తును…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సుమారు పది మంది కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద కాలువలో పడిపోయారు. తొక్కిసలాటలో గుండంకట్ట ఔట్‌లెట్‌లో కార్యకర్తలు జారిపడిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.కాగా, ఈ…
రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేశారని చెబుతూ పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటి వరకూ పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవని ఆయన విమర్శించారు. మచ్చుకు కొన్ని జగన్ దృష్టికి ఆయన తీసుకువచ్చారు: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి – ఒక్కొక్కరి పేరునా వేల…
కేరళలో సంచలనం సృష్టించిన ‘సోలార్ స్కామ్’లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సిబిఐ, కోర్టుకు రిఫరల్ రిపోర్ట్ సమర్పించింది. 2012లో ఊమెన్ చాందీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘సోలార్ కుంభకోణం’ చోటు చేసుకుంది. సోలార్ యూనిట్ల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్టు యూడిఎఫ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ, తాను లైంగిక వేధింపులకు గురైనట్టు 2013 జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊమెన్ చాందీ సహా, కొందరు మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన కేరళ క్రైంబ్రాంచ్ పోలీసులు, చాందీ, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 2021లో కేరళ…
జమ్ముకశ్మీర్‌లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో నక్కిన ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. వారిని గుర్తించాల్సి ఉందన్నారు. కాగా, ఉధంపూర్ జిల్లాలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో 15 కిలోల ఐఈడీ, 400 గ్రాముల ఆర్డీఎక్స్, ఐదు డిటోనేటర్లు, 7.62 ఎంఎం కాట్రిడ్జ్‌లు ఏడింటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సిధ్రాలో ట్రక్ కదలికలు అనుమానాస్పదం ఉండటంతో దానిని అనుసరించామని ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. సిధ్రా వద్ద ట్రక్కును ఆపిన సమయంలో ..డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని..ఆ తర్వాత ట్రక్కులో దాక్కున్న ఉగ్రవాదులు తమపై…
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరముందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. మంగళవారం ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో మోడీతో విజయన్ భేటీ అయ్యారు. కరోనా కొత్త వేరియంట్‌తో ముప్పు పొంచివుందన్న కథనాల నేపథ్యంలో మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన సన్నాహాలపై ఇరువురు చర్చించారు. కరోనా తీవ్రతను ఎదుర్కోవడానికి కేరళ ప్రభుత్వ సన్నద్ధతను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఉన్న జల జీవన్ మిషన్, జాతీయ రహదారులు వంటి కేంద్ర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కేరళలో జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి విజయన్ తెలిపారు. కేరళకు చెందిన ప్రసిద్ధ నృత్యరూపకం ‘కథాకళి’ నమూనా ప్రతిమను ఈ భేటీ సందర్భంగా మోదీకి విజయన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపి ఆనందం…
సంస్కృతి పరిరక్షణ హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని ఆమె హితవు చెప్పారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైనా, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారైనా తన సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని చెప్పారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి మంగళవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థ క్యాంపస్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. హైదరాబాద్ ఐటి ఫార్మా సహా ఇతర రంగాల్లో పురోగతి సాధించిందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారు పట్టణ ప్రాంత జీవనం చూసి ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దని ఆమె విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని చెబుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రగతి సాధించాలని ఆమె…
తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక షిరిడి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఒక్క రోజులో షిరిడీ చూసి రావాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. కేవలం రూ.2400 ధరకే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండటం విశేషం. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ మాత్రమే కవర్ అవుతుంది. షిరిడీతో పాటు సమీపంలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునే వారికి వేరే టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. షిరిడీ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు దిల్‌షుక్‌నగర్‌లో టూరిజం బస్సు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. ఉదయం 7 గంటలకు షిరిడీ చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత షిరిడీ సాయి దర్శనం ఉంటుంది. దర్శనం తర్వాత షిరిడీలోని ఇతర ఆలయాలు చూడొచ్చు. సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. తెలంగాణ టూరిజం షిరిడీ టూర్…