వాయు కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉంటే నోటి క్యాన్సర్ తప్పదని తైవాన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తైవాన్ లోని 66 వాయు నాణ్యత పరీక్ష కేంద్రాల నుంచి డేటా సేకరించారు. ఈ డేటాను 40 ఏళ్లు పైబడిన 4,80,000 మందికి చెందిన హెల్తు రికార్డుల డేటాతో పోల్చి పరిశోధించగా 11,617 నోటి క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. ఆయా వ్యక్తుల వయసు, ఓజోన్ ప్రభావం, స్మోకింగ్, తమలపాకు, జర్దా, వంటివి నమిలే అలవాటు ఇవన్నీ అధ్యయనంలోకి తీసుకున్నారు. గాలిలో కాలుష్య రేణువులు పిఎం 2.5 ఎస్‌గా గణిస్తుంటారు. చదరపు మీటర్ పరిమాణం గాలికి 26.74 మైక్రోగ్రాముల వంతున సరాసరి వార్షిక పి.ఎం. 2.5 స్థాయిలను 40.37 మైక్రోగ్రాములు లేదా 43 శాతం ఎక్కువగా ఉంటే వ్యాధి పెరగడానికి వీలుంటుంది. అయితే ఈ పద్ధతిలో పరిగణించడం సరిగ్గా అర్థం కాని ప్రక్రియగా మారిందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో సూచించిన మార్గదర్శకాల ప్రకారం…
Author: Editor's Desk, Tattva News
కర్ణాటక బిజెపి రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి ఆ పార్టీని వదిలి పెట్టి, సొంతంగా కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఒక విధంగా మరో ఐదు నెలల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విధంగా మరోసారి బిజెపి అధికారంలోకి రావడానికి దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గనుల కుంభకోణంలో జైలుపాలై, పలు కేసులలో నిందితుడిగా ఉంటూ, పుష్కరకాలం పాటు ఒక విధంగా రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టడం కేసుల నుండి తనను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదుకోలేదనే అక్కసుతోనే అని స్పష్టం అవుతుంది. కర్ణాటక ఎన్నికలలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నా అనుకున్న వారే తనను మోసం చేశారని, కష్టకాలంలో ఎవరూ తనకు అండగా నిలబడలేదని ఆయన చెప్పడం గమనార్హం. దానితో గాలి జనార్ధనరెడ్డి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా…
కరోనాపై పోరు సల్పేందుకు హెటెరో సంస్థ అభివృద్ధి పరిచిన ఔషధం నిర్మాకామ్ జనరిక్ వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) సిఫార్సు (ప్రిక్వాలిఫికేషన్ ఆఫ్ మెడినిస్స్ ప్రోగ్రామ్) లభించింది. ఈ విషయాన్ని హెటెరో సంస్థ వెల్లడించింది. నిర్మాట్రెల్విర్ 150 ఎంజి (రెండు ట్యాబెట్లు), రిటోనావిర్ 100 ఎంజి (ఒక ట్యాబ్లెట్) కలిపి నిర్మాకామ్ అనే కాంబో ప్యాక్‌ను హెటెరో ప్రారంభించింది. ఈ కాంబో ప్యాక్‌నే డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కరోనా రోగులకు అంటే వ్యాక్సినేషన్ పొందని, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగులకు దీనిని ఇవ్వవచ్చు అని డబ్ల్యూహెచ్‌ఓ బలంగా సిఫార్సు చేసినట్లు హెటెరో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనానిర్థారణ అయిన తరువాత వీలైనంత త్వరగా లేదా కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఈ మందును వాడాలని హెటెరో తెలిపింది. దేశంలోని అన్ని హెటెరో ప్లాంట్లలోనూ…
చైనాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. కరోనా ధాటికి ప్రాణాలుకోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకూ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. శవాలతో దహన వాటికలు కిక్కిరిసిపోతున్నాయి. మృతదేహాలతో బాధిత కుటుంబాలు బారులు తీరుతున్నారు. ఈ మేరకు హృదయ విదారక దృశ్యాలు నమోదైన వీడియోను ఆరోగ్య నిపుణుడు ఫెజిల్ డింగ్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. మృతదేహాల దహన సంస్కారాలకు కొన్ని గంటల సమయం పడుతుంది. కరోనా చైనాలో విరుచుకు పడుతుండటంతో ఆసుపత్రుల్లో మిలియన్ల పేషెంట్లు చేరుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు చైనా దేశవ్యాప్తంగా వద్ద పొడవాటి క్యూ కడుతుండటం దుర్భర స్థితికి అద్దం పడుతోంది. హెల్త్ ఎక్స్‌పర్ట్ ట్విట్టర్‌లో షేరు చేసిన వీడియో వీక్షకుల హృదయాలను కలిచివేస్తోంది. చైనాలోని ప్రభుత్వ మీడియా కూడా నిర్దిష్ట టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించలేక పోతుంది. సగానికిపైగా సిబ్బంది బారిన పడటమే దీనికి కారణమని ఎరిక్ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం జీరో కొవిడ్…
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు బృందం సుశాంత్‌ది ప్రాథమికంగా ‘ఆత్మహత్య’గా నిర్దారించగా.. సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే అని కుటుంబం ఆరోపించింది. ఈ కేసును ముందుగా ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా, అటు నుంచి కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేశారు. సుశాంత్ సింగ్ మరణించి రెండేళ్లు దాటిపోతున్నా, అతడి మరణం మిస్టరీగానే ఉండిపోయింది. అటు ముంబై పోలీసులు కానీ.. ఇటు సీఐడీ బృందం కానీ ఈ కేసును ఎటూ తేల్చలేక పోయారు. అయితే, సుశాంత్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన రూప్‌కుమార్ షా (అటాప్సీ టీం మెంబర్) చేసిన కామెంట్స్ ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రూప్‌కుమార్ షా మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య గావించబడ్డాడని చెప్పాడు.…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ విచారణ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ దశలో కేసును సీబీఐకి బదిలీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో సిట్ పురోగతి సాధించిందని, అందుకే సిట్ తోనే దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల తరఫున రాంచందర్ రావు వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తులో సాంకేతిక అంశాలను విస్మరించారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసు పెట్టారని, కేసుతో సంబంధంలేకపోయినా బీజేపీ పేరు ప్రస్తావించారని ఆయన కోర్టుకు విన్నవించారు. ఏకంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారని వివరించారు. అసలు ఈ కేసులో ఏసీబీకి తప్ప సిట్ కు విచారణ జరిపే అధికారం లేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. వాదనలు విన్న హైకోర్టు…
క్రిస్‌మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యం పడిపోవడంతో, పలు నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 60 శాతం మంది మంచు తుపానుతో విలవిల్లాడుతున్నారు. సుమారు ఏడు లక్షల మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు క్రిస్మస్ వేడుకల సమయంలోనూ విద్యుత్ కోతలకు గురయ్యారని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. మంచు తుపాను, క్రిస్మస్ సెలవుల కారణంగా అనేకమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని తెలిపింది. శనివారం 2,700 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయని, 6,400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూర్క్ ఒక వార్ జోన్‌ను తలపిస్తున్నది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చల్లని గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా…
భారత్ దాయాది దేశాలు చైనా..పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం కలిగి ఉండటం, ఇటీవల చైనా నుంచి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండడంతో ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ప్రళయ్ క్షిపణులను మోహరించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. శత్రు దేశాల నుంచి మన దేశం వైపు దూసుకొచ్చే క్షిపణులను వీటితో అడ్డుకోవచ్చని శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 2015లో భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ ఈ ప్రళయ్ క్షిపణులను అభివృద్ధి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా చేస్తాయి. శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను కూల్చేసే ప్రయత్నంలో అవసరాన్నిబట్టి గాలిలోనే దిశను మార్చుకోగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్రళయ్ క్షిపణులను తయారు చేసినట్లు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఈ క్షిపణులను పరీక్షించిన ఆర్మీ వర్గాలు సంతృప్తి వ్యక్తం…
జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో భారీ ఆయుధాల డంప్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాకిస్థాన్, చైనాలో తయారైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకొన్నట్లు ఆర్మీ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ చంద్రపురియా వెల్లడించారు. వీటిలో ఎనిమిది ఏకే-74 రైఫిళ్లు, 24 ఏకే-74 రైఫిల్ మ్యాగిజైన్లు, 7.62 ఎంఎం ఏకే-74 లైవ్ అమ్యూనిషన్లు 560, 12.30 ఎంఎం చైనీస్ పిస్టల్స్, 24 చైనా పిస్టల్స్ మ్యాగజైన్స్, భారీ మందుగుండు సామగ్రి, పాకిస్థాన్.. చైనాలలో తయారైన హ్యాండ్ గ్రనేడ్లు, ‘ఐ లవ్ పాకిస్థాన్’ అని రాసిన 81 బెలూన్లు ఉన్నట్లు వివరించారు. ఇటీవల కాలంలో కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధాల చేరవేత భారీగా తగ్గిన వేళ లోయలో ఎలాగైనా అలజడి సృష్టించే ప్రయత్నం పాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నట్టు అజయ్…
ఈ నెలాఖరులోపు రైతులందరి ఈ-కేవైసీ పూర్తి చేయాలని రాష్ట్రాల్రకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు ఇకపై ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం వర్తింప చేయలేమని కూడా స్పష్టం చేసింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా మూడు విడతలుగా రూ 6 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం దుర్వినయోగమవుతోందనీ, అర్హత లేని వారు కూడా లబ్ది పొందుతున్నట్టు ఆరోపణలు వెల్లవెత్తుతుండటంతో ఈ-కేవైసీనీ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేకాదు.. ఈ-కేవైసీసీ పూర్తి చేయని రైతులకు 13 వ విడత పీఎం కిసాన్ ఆర్ధిక సహాయాన్ని నిలుపుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఈ నెలాఖరు లోపు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రాల్రను ఆదేశించింది. ఏపీలో అధికారికంగా గుర్తించిన క్రియాశీలక రైతుల సంఖ్య 49,13,283 మంది ఉండగా వారిలో ఇప్పటివరకు 35,16,597 మంది ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా 13,96,686…