Author: Editor's Desk, Tattva News

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబునాయుడు 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం అవసరం లేదని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని బుధవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరంలేదని మంత్రి ప్రతిమ భౌమిక్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన…

Read More

ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళల విద్య, ఉద్యోగాలపై తాలిబన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇళ్ల నుండి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటుందని తెలిపింది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న అనంతరం చట్టబద్ధంగా శాంతియుత పాలనను అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ మహిళలపై ఆంక్షలను కఠినతరం చేస్తోంది. మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్‌ నదీమ్‌ లేఖ రాశారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియావుల్లా హషిమి ఈ లేఖను ధృవీకరించారు. తాలిబన్ల నిర్ణయాన్ని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఖండించాయి. మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్‌…

Read More

దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, 2023 జనవరి 1వ తేదీ నుంచి రూ. 1000 నోట్లు చెలామణిలోకి రానున్నాయన్నది ఆ వీడియో సారాంశం. 2018-19 తర్వాత నుంచి రూ. 2000 కరెన్సీ నోట్ల ముద్రణకు కొత్త ఇండెంట్ ఏదీ పెట్టలేదని కేంద్రం ప్రకటించిన తర్వాత ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తూ ఇవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది. రూ. 1000 నోటుపై అసత్య ప్రచారం చేస్తున్నారని , వీటిని నమ్మవద్దని ప్రజలను హెచ్చరించింది. జనవరి 1 నుంచి రూ 1000 నోట్లు అందుబాటులోకి వస్తాయని, రూ. 2000 నోట్లు బ్యాంకులకు వాపసు వెళ్లిపోతాయంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో…

Read More

భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాట్​ కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలని కోరారు. కరోనా కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర రాజస్థాన్​ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ లేఖకు సంబంధించిన మరో కాపీని కేంద్ర ఆరోగ్యశాఖ రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ కు కూడా పంపింది. జపాన్​, అమెరికా, చైనా, బ్రెజిల్​, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో మంగళవారం…

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట ఊహించని విషాదం కన్నీరు పెట్టేలా చేస్తోంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన పెళ్ళికొడుకు గుండెపోటుకు గురై మృతి చెందాడు. పెళ్లి సందడితో సదరగా ఉండాల్సిన ఇళ్లు శోక సంద్రంగా మారింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన టీచివరకు తుది శ్వాస విడిచారు. చంద్రమౌళి అలియాస్ శివ గుండెపోటుతో చెన్నైలోనే కావేరి ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే చేరినప్పటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన్ను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం మిగిల్చారు. చంద్రమౌళి వయసు కేవలం 28 సంవత్సరాలే. ఇటీవలే ఆయనకు చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి…

Read More

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు పార్టులుగా ఉన్న ఈ ఆడియో క్లిప్‌ను పాకిస్థాన్ జర్నలిస్టు సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌గా చెబుతున్న వ్యక్తి ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టుగా అందులో ఉంది. ఈ ఏడాది మొదటిలో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఆడియో పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి వచ్చినట్టు కొన్ని పాకిస్థాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ ఆడియోలో నిజమెంత అన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ, పాకిస్థాన్ జర్నలిస్టులు మాత్రం ఆ క్లిప్‌లోని గొంతు ఇమ్రాన్ ఖాన్‌దేనని చెబుతున్నారు. ఇమ్రాన్ తన వ్యక్తిగత జీవితంలో ఏం కావాలంటే దానిని నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, కాకపోతే మొత్తం ఉమ్మా (ముస్లిం సమాజం)కి తనను తాను రోల్‌మోడల్‌గా చెప్పుకోవడాన్ని మానుకుంటే మంచిదని జర్నలిస్ట్…

Read More

దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సుమలత అంబరీష్, ఎల్ హన్మంతయ్య, శాంతా కుమారి, ఎ. గణేశమూర్తి,పి. స్వస్తి సుందరం చియాతో పాటు చెరకు రైతు సంఘాల నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకత్వంలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి చెరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. చెరకు రేటు విషయంలో దక్షిణాది రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, చెరకు రికవరీ రేటు 10.25కి పెంచడం వల్ల దిగుబడి తగ్గి, తీవ్రంగా…

Read More

దేశం కోసం బీజేపీ ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించడంపై రాజ్యసభలో మంగళవారం పెద్ద రచ్చ రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అందుకు నిరాకరించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా రెండు పార్టీల నేతలు పరస్పరం  నిందారోపణలు దిగారు. కాగా, సభ్యుల ప్రవర్తన పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ  చైర్మన్ జగదీప్ ధన్‌కర్  అసహనం వ్యక్తం చేశారు.  ‘‘సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చాలా చెడ్డ పేరు తెస్తుంది.. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవడం లేదు… ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నాం.. నమ్మండి.. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని ధన్‌కర్  మండిపడ్డారు. ‘‘అది పార్లమెంట్ వెలుపల జరిగింది… అటువంటి వ్యాఖ్యలకు ఆధారాలు ఉండొచ్చు.. లేకపోవచ్చు.. దాని గురించి సభలో ఆందోళనలు సరికాదు. పక్షాల మధ్య అభిప్రాయ…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదని అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నా, ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మాత్రం తగ్గడం లేదు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు చెబుతూనే ఉన్నారు. తాజాగా, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసిపి అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణం రాజు జోస్యం చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే జరగవచ్చునని ఆయన పేర్కొన్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగవనేది ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతుందని చెప్పారు. వంద రోజులే ఎన్నికలకు సమయమని చెబుతూ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కాసింత గౌరవం ఇచ్చి…

Read More

జమ్మూకశ్మీర్‌ లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ముంజ్‌ మార్గ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌ కౌంటర్‌ లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను షోపియాన్‌ కు చెందిన లతీఫ్‌ లోన్‌, అనంతనాగ్‌ కు చెందిన ఉమర్‌ నజీర్‌ గా గుర్తించారు. కాశ్మీరీ పండిత పురాణ కృష్ణ  భట్‌ హత్యలో లతీఫ్‌ లోన్‌, నేపాల్‌ కు చెందిన టిల్‌ బహదూర్‌ థాపా హత్యలో ఉమర్‌ నజీర్‌ ప్రమేయం ఉందని పోలీసులు ట్వీట్‌ చేశారు. మరో ఉగ్రవాది ఆచూకీ తెలియాల్సి వుందని అన్నారు. వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుండి ఎకె 47 రైఫిల్‌, రెండు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read More