మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రధాని మోదీ చేతులు ఊపి పలకరించారు. నాగ్‌పూర్‌కు చేరుకున్న ప్రధానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6700 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయనున్న రైలు ప్రాజెక్టు ఫేజ్-2 కి శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో, సుమారు రూ. 590 కోట్లతో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్, రూ.360 కోట్లతో పునరాభివృద్ధి చేయనున్న అజ్నీ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ నిర్వహణ డిపో, అజ్ని (నాగ్‌పూర్), కోహ్లి-నారేర్ సెక్షన్-ఇటార్సీ థర్డ్ లైన్…
Author: Editor's Desk, Tattva News
హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్జి మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా వీరభద్రసింగ్ విచ్చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు నడావ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ పై 3వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన…
బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. యువ సంచలనం ఇషాన్ కిషన్ (210) డబుల్ సెంచరీకి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (113) సూపర్ శతకం తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్లలో కేవలం 182 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆతిథ్య బంగ్లాదేశ్ 21 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే…
తన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అర్థరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. లోటస్ పాండ్ దగ్గరకు వెళ్లిన పోలీసులు.. దీక్షను భగ్నం చేసి.. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐతే.. అక్కడ చికిత్స చేయించుకోవడానికి వైఎస్ షర్మిల నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. తిరిగి ఆమె ఇంటికి వెళ్లిపోగా, ప్రస్తుతం ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. షర్మిల పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి దగ్గర ఆందోళనలు చెయ్యకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ షర్మిల రెండు రోజుల కిందట ఈ దీక్ష ప్రారంభించారు. శనివారం ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ టెస్ట్ చేసిన అపోలో డాక్టర్ చంద్రశేఖర్ షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందనీ… కనీసం…
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇస్తే గడీల పాలన నుండి విముక్తి చేసి పేదోల్ల రాజ్యం తీసుకువస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తెలిపారు. కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్ గ్రామం నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ప్రారంభమై అయిలాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలలో చేపట్టే ప్రతి అభివృద్ది పనిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని అని విమర్శించారు. “బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా… మీరెప్పటికీ సీఎం కాలేరు. కొడుకును సీఎం చేసి మిమ్ముల్ని కేసీఆర్ అవమానిస్తరు. అందుకే బీజేపీతో కలిసి రండి… ప్రగతి భవన్ బద్దలు కొడదాం”అని సంజయ్ పిలుపునిచ్చారు. వచ్చే ప్రభుత్వంలో పోలీసులు మొట్టమొదట ఉరికించేది కేసీఆర్ నే అని స్పష్టం…
డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారికి, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామని వివరించారు. ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడుపుతారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో…
భారత్-పాకిస్థాన్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ సొంతం చేసుకోగా తాము ఈ టోర్నీ కోసం పాక్ కు వెళ్లేది లేదని బీసీసీఐ కొన్ని రోజుల కిందట స్పష్టం చేసింది. టీమిండియా ఈ టోర్నీ కోసం తమ దేశానికి రాకుంటే భారత్ లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ ను బహిష్కరిస్తామని మరోవంక పాక్ క్రికెట్ బోర్డ హెచ్చరించింది. అప్పటి నుంచి బీసీసీఐ, పీసీబీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఓ టీవీ షోలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మారనున్నాయా అన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి. కానీ, మా ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో మీకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది సంక్లిష్టమైన సమస్య.…
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేస్తామని చెబుతున్న ఆ పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు అసలు ఉద్దేశం అది కాదని, ‘అబ్ కీ బార్ మేరా పరివార్ కా సర్కార్’ అన్నదే ఆయన అసలు నినాదమని బిజెపి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రయత్నాలను తప్పుబట్టడం లేదని, కానీ రైతుల కోసం ఏం చేశారో ముందు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల హామీగా ప్రకటించిన రైతు రుణమాఫీ ఇప్పటివరకు పూర్తిచేయలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ‘ఫసల్ బీమా యోజన’ రాష్ట్రంలో అమలు కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని ఆయన ఆరోపించారు. ఇదొక్కటే కాదు, కేంద్ర పథకాలను కేసీఆర్ ప్రజలకు చేరువకాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో యూరియా, ఇతర ఎరువుల కొరత…
న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కొలీజియం భేటీలో చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పలువురు సభ్యులతో కూడిన కొలీజియంలో చాలా చర్చ జరుగుతుందని, ఆ మొత్తాన్నీ బహిర్గతం చేయలేమని తెలిపింది. కేవలం సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తామని తేల్చిచెప్పింది. ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కోసం 2018, డిసెంబరు 12న జరిగిన కొలీజియం సమావేశ వివరాలను వెల్లడించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ కోర్టును ఆశ్రయించారు. తొలుత ఆమె ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా.. సంబంధిత అధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నాటి సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయమూర్తి…
బీఆర్ఎస్ సమావేశంలో ఒక్కరి మొహంలో కూడా నవ్వులేదని అంటూ అది పార్టీ ఆవిర్భావ సభలా లేదు.. సంతాప సభలా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పార్టీ పేరు జెండా నుంచి తెలంగాణ పేరు తొలగించారని, ఇక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయారని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామయాత్ర కొనసాగిస్తున్న సంజయ్ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోమాట్లాడుతూ బీఆర్ఎస్ కాదు.. అది బందిపోట్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. లిక్కర్ స్కాం పక్కకు పోయేందుకే బీఆర్ఎస్ అంటూ నాటకాలు అని మండిపడ్డారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేటీఆర్ ప్రయత్నమని అంటూ రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ రగిల్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పెట్టిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లు చేయడమేనా? తెలంగాణ మోడల్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఒకే కుటుంబం…