హిజాబ్ వద్దంటూ సుమారు మూడు నెలలుగా ఇరాన్ మహిళలు చేస్తోన్న నిరసనలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. హిజాబ్ ధరించని మహిళలపై ఉక్కుపాదం మోపుతున్న మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను (నైతిక విభాగం పోలీసులు) రద్దు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమీని అనే 22 ఏళ్ల కుర్దు యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చిత్రహింసలతో వారి కస్టడీలోనే అమీని సెప్టెంబర్ 16న చనిపోయారు. దీంతో నాటి నుంచి హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజధాని టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ఆందోళనలను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది. మొరాలిటీ పోలీసులు జరిపిన కాల్పుల్లో గత రెండు నెలల్లో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కూడా చనిపోయారు. ఎంతమంది చనిపోతున్నా ఇరాన్ మహిళలు వెనక్కు తగ్గలేదు. మహిళలకు రోజురోజుకూ మద్దతు పెరిగి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నిరసనలు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటంతో ఇరాన్…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఆమె ప్రశంసించారు. ఎపి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూ భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ తదితరుల పేర్లను ఆమె ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని పేర్కొన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలకుగా విలసిల్లుతున్నాయని కొనియాడారు. అందరి అభిమానానికి రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ..దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని తెలిపారు. రాష్ట్రపతి పదవిలో…
కొలీజియం వ్యవస్థను రద్దుచేస్తూ దాని స్థానంలో పార్లమెంటు ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ ‘ఎన్‌జెెఎసి’ చట్టాన్ని (నేషనల్ జడ్జీస్ అపాయింట్‌మెంట్ కమిషన్) గతంలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. పార్లమెంటు ఆమోదించే చట్టాలను న్యాయస్థానాలు పక్కన పెట్టేసిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగదని ఘాటుగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ‘ఎన్‌జెెఎసి’ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తయితే, దానిపై పార్లమెంటు చిన్న మాట కూడా అనకపోవడం అన్నింటికంటే పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై. చంద్రచూడ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శనివారం ఢిల్లీలో జరిగిన ఎల్‌ఎమ్ సింఘ్వీ స్మారక సభలో ఉపరాష్ట్రపతి జగదీప్ పాల్గొన్నారు. చట్టంతో ముడి ఉన్న అంశాన్ని కోర్టులు తమ పరిశీలనకు స్వీకరించవచ్చునన్న ఆయన.. ఆ పేరిట మొత్తం అంశాన్నే తోసివేయవచ్చునని రాజ్యాంగంలోని ఏ నిబంధనలోనూ పేర్కొనలేదని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. చట్టంతో…
ఇస్లాం స్వీకరించిన హిందువు వెనుకబడిన తరగతి (బీసీ) అభ్యర్థిగా రిజర్వేషన్ ప్రయోజనాలను డిమాండ్ చేయగలరా? ఈ ప్రశ్నకు మద్రాసు హైకోర్టు ప్రతికూల సమాధానం ఇచ్చింది. ఒక వ్యక్తి మతం మారిన తర్వాత తన పుట్టిన కులాన్ని చెప్పుకోకూడదని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తోందని పేర్కొంది. నిమ్న వర్గానికి చెందిన కులంలో హిందువుగా జన్మించిన అక్బర్ అలీ పిటిషన్‌పై జస్టిస్ జి ఆర్. స్వామినాథన్ ఈ తీర్పును వెలువరించారు, అక్బర్ అలీ అత్యంత వెనుకబడిన తరగతి (ఎంబిసి) కేటగిరీ కిందకు రాలేడని చెప్పారు. అక్బర్ అలీ 2008లో ఇస్లాం మతంలోకి మారి తన పేరు మార్చుకున్నాడు. అతను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. రిజర్వ్‌డ్ కేటగిరీ కింద కాకుండా ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించబడినందున అతను ఉద్యోగానికి ఎంపిక అవ్వలేదు. ఈ విషయంలో తనను మినహాయించాలని కోరుతూ అక్బర్ కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్…
భారత రైల్వేలలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం మూడేళ్ల క్రితం తలపెట్టిన ప్రయివేట్ రైళ్లు ఇప్పట్లో కార్యరూపం దాల్చేటట్లు కనబడటం లేదు. 109 ప్రధాన రూట్లలో 151 ట్రైన్లను ప్రయివేట్ వారు నడిపేలా, అందుకు గానూ రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రణాళిక రూపొందించింది. అందుకు తగ్గట్లుగానే దేశ, విదేశీలకు చెందిన 14 కంపెనీలు ఆసక్తి చూపించాయి. తీరా టెండర్లను పిలిచిన తర్వాత రెండు కంపె నీలు తప్ప మిగిలిన కంపెలన్నీ వెనక్కి తగ్గాయి. ఆ రెండు కంపెనీల్లోనూ ఒకటి భారత రైల్వేకే చెందిన ఐఆర్‌సిటిసి కాగా, మరో సంస్థ మెఘా ఇంజనీరింగ్. దీంతో సరైన స్పందన రాలేదని ఏడాది క్రితమే ఈ టెండర్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రయివేట్ కంపెనీలను మరింతగా ఆకర్షించేలా తిరిగి టెండర్లను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్లకు సరైన స్పందన రాకపోవడంలో మొత్తం టెండర్ ప్రక్రియనే రద్దు చేశారు. మొత్తం…
ఇది వరకు ఎన్నడు చూడని సౌర తుఫాను 2023లో మనం చూస్తామా? అదే జరిగితే ఆ సౌర తుఫాను సాంకేతికతను దెబ్బతీయగలదు. పెద్ద ఎత్తున బ్లాక్ అవుట్స్, కమ్యూనికేషన్స్ ఫెయిల్యూర్స్ ఏర్పడవచ్చు. అదే విధంగా, ఓ అణు కేంద్రం విస్ఫోటనం జరుగుతుందా? అనేక విధ్వంసకర ఘటనలు చోటుచేసుకుంటాయా? ఇటువంటివి జరిగితే వచ్చే ఏడు ప్రళయకారకంగా ఉండే అవకాశం లేకపోలేదు. బల్గేరియాకు చెందిన ఓ గుడ్డి కార్మికురాలు బాబా వంగ చెప్పున ఇటువంటి జోస్యాలు నిజమవుతాయా? అనే చర్చ జరుగుతున్నది. ‘నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమెకు తన 12వ ఏట చూపు పోయింది. ఆమెకు చూపులేకపోయినప్పటికీ దేవుడు ఆమెకు భవిష్యత్తులో జరుగబోయేది చూడగలిగే శక్తినిచ్చాడంటారు. ఆమె వాంజెలియా గుష్టెరోవ్‌గా జన్మించారు. ఇప్పటి వరకు ఆమె చెప్పిన జ్యోష్యం 85 శాతం మేరకు నిజమయ్యాయి. 9/11 ఉగ్రదాడులు, బ్రెగ్జిట్, డయానా రాణి మరణం, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడవుతాడు అని ఆమె చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆమె 1996లో చనిపోయింది. ఈ ప్రపంచం 5079…
సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస రావుకు పలువురు నేతలు, అధికారులతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాస్ నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో కస్టడీని పొడిగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారం తోసిపుచ్చింది. ఈ కేసులో చాలా పెద్ద స్థానాలలో ఉన్న వారిని, బడా లీడర్లను శ్రీనివాసరావుతో కలిపి విచారించాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుతో ముడిపడిన దాదాపు 1100 కాల్స్ డేటాను పరిశీలన చేస్తున్నామని పేర్కొంది. శ్రీనివాసరావుతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను డిసెంబరు 1న దాదాపు 8 గంటల పాటు సీబీఐ ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించింది. విచారణకు శ్రీనివాస్ సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆరుగురు సాక్షులను పిలిచి విచారణ జరిపామని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ శ్రీనివాస్ ఫోన్ నుంచి సేకరించిన…
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సూచించింది. లేకపోతే మరో కొత్త వేరియంట్ విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించింది. నిఘా, పరీక్షలు, వ్యాక్సిన్‌లతో వైరస్‌పై నియంత్రణ సాధించగలిగామని పేర్కొంది. కరోనాను అడ్డుకునే వ్యూహాత్మక యత్నాల వైఫల్యంతో ఈ ఏడాది కొత్త వేరియంట్ పుట్టుకువచ్చే పరిస్థితులు ఉండవచ్చని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. మహమ్మారి అత్యవసర దశ ముగిసిందని చెప్పడానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. కానీ ఇప్పుడే ప్రకటించలేమని చెప్పారు. చైనాలో వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాల రోగాలు కలిగిన వారు, 60 ఏళ్లు దాటిన వారిపై చైనా సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని డబ్ల్యుహెచ్‌ఒ టెక్నికల్ లీడ్ మారియా వాన్ ఖేర్గోవ్ స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు 90 శాతం మంది ఇప్పుడు కరోనా వైరస్ సోకడం ద్వారా, వ్యాక్సిన్ కారణంగా కొంత మేర రోగనిరోధక…
పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్ కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో బాంబు పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. టీఎంసీ నేతలు రాజ్‌కుమార్ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ పేలుడుకు కారణంపై విచారణ జరుగుపుతున్నామని, శక్తివంతమైన బాంబు పేలడంతో…
ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలపై సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్ సిసిఎస్, ఈఓడబ్లూ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న లక్ష్మీనారాయణ ప్రీ పేరుతో పలువురు అమాయకుల వద్ద నుంచి రూ.వందల కోట్లు వసూలు చే శాడు. హైరైజ్ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నానని, ఇందులో 1,200, 1,700 స్కేర్ ఫీట్లు ఉంటుందని ప్రచారం చేసుకున్నాడు. అమీన్‌పూర్‌లోని సాహితీ శార్వాణి ఎలైట్ పేరుతో ప్రాజెక్ట్ చేస్తున్నానని చెప్పి 1,700 మంది వద్ద నుంచి రూ. 539 కోట్లు వసూలు చేశాడు. ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్ట్ 23 గుంటల్లో ఉంది, దీనికి హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి నుంచి ఎలాంటి అనుమతి లేదు. అంతేకాకుండా ప్రాజెక్ట్ కనీసం ప్రారంభించక పోవడంతో బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయడంతో వారు కట్టిన డబ్బులకు 15 నుంచి 18 శాతం వడ్డీ కలిపి…